E-Paper
Advertisement

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?
Advertisement

Mini LED vs OLED: హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో ప్రస్తుతం స్మార్ట్ టీవీల హవా నడుస్తోంది. ముఖ్యంగా ప్రీమియం డిస్‌ప్లే టెక్నాలజీలపై ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్‌లో మిని ఎల్‌ఈడీ (Mini LED), ఓఎల్‌ఈడీ (OLED) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొత్త టీవీ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రెండింటికి తేడా ఏంటి? ఏ అవసరాలకు ఏ టీవీ బెస్ట్? అన్నది ఈ కథనంలో చూద్దాం.

Mini LED ఎలా పనిచేస్తుంది?

స్మార్ట్ టీవీల్లో వినియోగించే.. మిని ఎల్‌ఈడీ టెక్నాలజీలో వేలాది చిన్న చిన్న ఎల్‌ఈడీ డయోడ్‌లను బ్యాక్‌లైటింగ్‌గా ఉపయోగిస్తారు. ఇది అత్యధిక బ్రైట్‌నెస్‌ను (Peak Brightness) అందిస్తుంది. ఫలితంగా గదిలో వెలుతురు ఎక్కువగా ఉన్నప్పటికీ స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే.. సుదీర్ఘకాలం వాడియా ‘స్క్రీన్ బర్న్-ఇన్’ సమస్య వచ్చే ప్రమాదం చాలా తక్కువ. బడ్జెట్ పరంగా కూడా ఇది OLED కంటే కొంత అందుబాటు ధరలోనే లభిస్తుంది.

OLED సంగతేంటి?

Advertisement

ఓఎల్‌ఈడీ (Organic Light Emitting Diode) టెక్నాలజీలో ప్రత్యేక బ్యాక్‌లైట్ ఉండదు. ప్రతి పిక్సెల్ స్వయంగా ప్రకాశిస్తుంది. రాత్రి సన్నివేశాల్లో పిక్సెల్స్ పూర్తిగా ఆఫ్‌ కావడం వల్ల అసలైన ‘ట్రూ బ్లాక్’ (True Black) రంగును యూజర్లు అనుభూతి చెందొచ్చు. దీనిలో కాంట్రాస్ట్ రేషియో అద్భుతంగా ఉండి రంగులు ఎంతో సహజంగా కనిపిస్తాయి. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. దీనిలో వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగుంటాయి. అంటే ఏ వైపు నుంచి చూసినా పిక్చర్ క్వాలిటీ అదిరిపోతుంది.

Also Read: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. సైబర్ కేటుగాళ్ల వలలో పడొద్దు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!

ఏ టీవీ ఎవరికి బెస్ట్?

Advertisement

టీవీ ఉండే గదిలో వెలుతురు ఎక్కువగా ఉండి.. గేమింగ్ లేదా నిరంతరం వార్తా ఛానెళ్లు చూసే అలవాటు ఉంటే Mini LED బెస్ట్. అలా కాకుండా తక్కువ వెలుతురు ఉండే గదిలో హోమ్ థియేటర్ అనుభూతిని పొందుతూ సినిమాలు, క్వాలిటీ కంటెంట్ ఎక్కువగా చూసేవారికి OLED మంచి ఆప్షన్ గా నిలుస్తుంది.

Also Read: రూ.55 వేలలో అత్యుత్తమ టీవీలు.. ఫీచర్లు చూస్తే.. అంత పెట్టినా పర్లేదంటారు!

Related News

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌లో కాకుండా.. మెటల్‌‌ లోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

Big Stories

Advertisement
×