E-Paper
Advertisement

పంజాబీ బ్లూటూత్ స్కామ్ టు కర్ణాటక SSLC లీక్.. విపక్షాలకు కమలం గట్టి కౌంటర్!

పంజాబీ బ్లూటూత్ స్కామ్ టు కర్ణాటక SSLC లీక్.. విపక్షాలకు కమలం గట్టి కౌంటర్!
Advertisement

NEET Protests: స్వేచ్చ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల వివాదం ఇప్పుడు తీవ్ర రాజకీయ రణరంగంగా మారింది. ఈ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంతో దేశ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్షాలు తమకు లభించిన బలమైన రాజకీయ అస్త్రంగా మలుచుకుంటుండగా, అధికార బీజేపీ సైతం అంతే దీటుగా సోషల్ మీడియా వేదికగా కౌంటర్ అటాక్‌కు దిగింది. నైతికత ప్రాతిపదికన సాగుతున్న ఈ సవాల్ ప్రతిసవాళ్లతో జాతీయ రాజకీయాలు అట్టుడుకుతున్నాయి.

విద్యార్థులకు న్యాయం..

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని ప్రతిపక్షాలు తమ విజయంగా అభివర్ణిస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో వైఫల్యం, పేపర్ లీకేజీల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం చివరకు తప్పును ఒప్పుకోక తప్పలేదని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. మంత్రి రాజీనామాతోనే సరిపెట్టకుండా, విచారణ వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఇష్యూను పార్లమెంట్ లోపల, వెలుపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా వినిపించేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.

బీజేపీ సవాల్..

Advertisement

మరోవైపు, ప్రతిపక్షాల విమర్శలపై కాషాయ పార్టీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్న విపక్షాలకు నైతికత అనే అంశంపైనే బీజేపీ సవాల్ విసురుతోంది. గతంలో తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన వివిధ పరీక్షల లీకేజీలు, పేపర్ మాల్‌ప్రాక్టీస్ ఉదంతాలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇస్తోంది. ఆయా రాష్ట్రాల్లో లీకేజీలు జరిగినప్పుడు అక్కడి పాలకులు ఎందుకు నైతిక బాధ్యత వహించలేదని, ఇప్పుడు కేంద్ర మంత్రిని రాజీనామా చేయమన్నవారికి అసలు నైతికత ఉందా అని కాషాయ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో నిలదీస్తున్నాయి.

Also Read: ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. మాజీ సీఎం సంచలన ప్రకటన!

బురదజల్లుకుంటూ కాలక్షేపం..

Advertisement

ఈ విధంగా రాజకీయ పంతాలు, పట్టింపులు నెగ్గినప్పటికీ.. అసలు బాధితులైన నీట్ అభ్యర్థుల పరిస్థితి ఏంటనే సంధిగ్ధత నెలకొంది. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటూ కాలక్షేపం చేస్తున్నాయే తప్ప, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారనే చర్చ సామాజికంగా వ్యక్తమవుతోంది. మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన బాధితులకు ఒరిగేదేంటని, వారి ఆందోళనలకు శాశ్వత పరిష్కారం ఎప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భారీ స్థాయిలో లీకేజీలు..

విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పోటీ పరీక్షలు, నియామక పరీక్షలు దేశంలో ఏదో ఒక చోట లీకేజీల రొంపిలోకి దిగజారుతూనే ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఈ అంశాలను ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడానికి వాడుకుంటుండగా, కష్టపడి చదివిన సామాన్య అభ్యర్థులు మాత్రం మానసిక వేదనతో, ఆందోళనలతో రోడ్డున పడుతున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తెలంగాణతో పాటు కర్ణాటక, పంజాబ్‌లలోనూ ఇదే తరహా లీకేజీల పరంపర సాగడంపై బీజేపీ వారికి సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో భారీ స్థాయిలో లీకేజీలు జరిగాయి.

బీఆర్ఎస్ పాలనలో..

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అనేక పేపర్ లీకేజీల వివాదాలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఎంసెట్, ఎస్సెస్సీ పేపర్లు లీక్, టీజీపీఎస్సీ గ్రూప్-1 తో సహా ఏకంగా 6 పరీక్షల పేపర్లు లీక్ అవ్వడం రాష్ట్రాన్ని కుదిపేసింది. 2019 లో ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళం వల్ల 22 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం రాష్ట్ర విద్యాచరిత్రలోనే చీకటి అధ్యాయంగా విశ్లేషకులు గుర్తుచేస్తుంటారు. ఆ సమయంలో వారు నైతికతతో ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించేందుకు కాషాయ పార్టీ సిద్ధమవుతోంది. ఇకపోతే.. బీఆర్ఎస్ లీకేజీలను ఎండగట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హయాంలో కూడా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని విమర్శలు వస్తున్నాయి.

Also Read: తెలంగాణ బీజేపీలో మార్పుల పర్వం.. త్వరలోనే కొత్త అధ్యక్షుల నియామకం?

కర్ణాటకలోని సిద్ధరామయ్య..

కేవలం తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ విద్యాశాఖ మంత్రుల కళ్ల ముందే పేపర్ లీకేజీల దందా సాగిందని బీజేపీ విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టనుంది. కర్ణాటకలోని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో, విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప హయాంలో ఎస్ఎస్ఎల్‌సి పరీక్షల పేపర్ లీక్ వ్యవహారం పెద్ద వివాదానికి దారితీసింది. గతంలో ఆన్సర్ షీట్ల పరిశీలనలో తప్పులు దొర్లించిన సదరు ప్రైవేట్ సంస్థకే మళ్లీ ఓఎస్ఎమ్ కాంట్రాక్టును కట్టబెట్టడం వల్లే ఈ అవకతవకలు జరిగాయని రాజకీయ వర్గాల్లో విమర్శలు వినిపించాయి.

భగవంత్ మాన్ నేతృత్వంలో..

ఇకపోతే పంజాబ్‌లో భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో.., విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ హయాంలో వరుసగా లీకేజీలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని నెలల వ్యవధిలోనే అక్కడ గ్రూప్-బీ పరీక్ష, క్లాస్ 12 ఇంగ్లిష్ పేపర్, పీఎస్‌టెట్, ఏడీఓ పరీక్షల పేపర్లు లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే 454 ఫార్మసిస్ట్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో హైటెక్ బ్లూటూత్ పరికరాల ద్వారా పెద్ద ఎత్తున చీటింగ్ స్కామ్ బయటపడటం జాతీయ స్థాయిలో సంచలనమైంది.

Also Read: Medchal: మేడ్చల్ బస్టాండ్‌కి వెళ్లాలంటే ముక్కు మూయాల్సిందే.. ఎందుకో తెలుసా..!

యువతలో తీవ్ర అసంతృప్తి..

ఈ మూడు రాష్ట్రాలలోనూ పరీక్షల లీకేజీల వల్ల నష్టపోయిన ఏ ఒక్క సామాన్య విద్యార్థికి లేదా నిరుద్యోగికి ఎలాంటి పరిహారం అందలేదని, ఫలితంగా దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా వ్యవస్థలో లోపాలు సవరించకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరినొకరు విమర్శించుకోవడానికే ఈ లీకేజీల అంశాలను వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీజేపీ పోరాడుతాయా?

సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లలో ఉంటూ, రూమ్ అద్దెలు కడుతూ, తిండీ తిప్పలు మానేసి చదివిన లక్షలాది మంది మెరిట్ అభ్యర్థులు ఈ లీకేజీల వల్ల తీవ్రంగా నష్టపోయారని వారు చెబుతున్నారు. పరీక్షలు రద్దు కావడం, రీ-ఎగ్జామ్స్ పెట్టడంతో అభ్యర్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాజకీయ పంతం నెగ్గడంతో పార్టీలకు పొలిటికల్ మైలేజ్ వస్తే.. నష్టపోయిన అభ్యర్థులకు ఏం దక్కిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నీట్ తొలి పరీక్షలో క్వాలిఫై అయ్యి.. రీ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వని అభ్యర్థులకు న్యాయం ఎలా చేస్తారనే అంశంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు, సీజేపీ పోరాడుతాయా? లేక తమ డిమాండ్లు నెరవేరాయని సరిపెట్టుకుని లైట్ తీసుకుంటాయా? అనేది చూడాలి.

Also read: NEET Protests: నీట్ లీక్ వివాదంతో కాంగ్రెస్ మైండ్ గేమ్.. నెక్ట్స్ ప్లాన్ అదేనట..?

Related News

నేషనల్ మీడియా ఇంట్రాక్ట్‌లో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!

నిజామాబాద్‌లో ఘోర విషాదం.. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్స్‌లో నలుగురు యువకులు గల్లంతు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. సైబర్ కేటుగాళ్ల వలలో పడొద్దు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!

NEET Protests: నీట్ లీక్ వివాదంతో కాంగ్రెస్ మైండ్ గేమ్.. నెక్ట్స్ ప్లాన్ అదేనట..?

మరో పథకాన్ని పున:ప్రారంభించిన కాంగ్రెస్ సర్కార్.. రూ. 20 వేల ఆర్థిక సహయం!

కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. స్కూటర్‌ను ఢీకొట్టిన లారీ, ఇద్దరు యువకులు మృతి!

తెలంగాణ బీజేపీలో మార్పుల పర్వం.. త్వరలోనే కొత్త అధ్యక్షుల నియామకం?

Big Stories

Advertisement
×