E-Paper
Advertisement

అదుర్స్ అనిపించే సౌండ్..డాల్బీ ఆడియోతో అరిపించే మోడల్

అదుర్స్ అనిపించే సౌండ్..డాల్బీ ఆడియోతో అరిపించే మోడల్
Advertisement

Mivi Fort H880 soundbar: ఇంట్లోనే నిజమైన సినిమా థియేటర్ ఫీల్ పొందాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ మివి మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ మోడల్ మీకోసమే. కేవలం రూ.8,999 అద్భుతమైన ధర వద్ద లభిస్తున్న ఈ పవర్‌ఫుల్ సౌండ్‌బార్, మీ లివింగ్ రూమ్‌ను అదిరి పోయే మ్యూజిక్ కాన్సర్ట్‌లా మార్చేస్తుంది. 880 వాట్ల పవర్ ఫుల్ ఆడియో అవుట్‌పుట్, డ్యూయల్ సబ్‌వుఫర్లతో వస్తున్న ఈ ట్రెండీ గాడ్జెట్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్,లుక్ :

ఈ సౌండ్‌బార్ డిజైన్ చాలా ప్రీమియమ్‌గా ఉంటుంది. దీనికి ఇచ్చిన పియానో.. ఫినిష్ క్యాబినెట్ కేసింగ్ , మెటాలిక్ మెష్ గ్రిల్ ఇంటి లుక్‌నే పూర్తిగా మార్చేస్తాయి. చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా ఉంటూ.. మీ టీవీ సెటప్‌కు రిచ్ లుక్‌ను అందిస్తుంది. ప్రత్యేకించి లెదర్ ఫినిష్ సైడ్ ప్యానెల్స్ దీనికి మరింత మోడర్న్ టచ్ ఇస్తాయి.

పవర్,ఆడియో పర్ఫార్మెన్స్ :

Advertisement

ఈ డివైజ్  అత్యంత ముఖ్యమైన హైలైట్ దీని పవర్. ఇది ఏకంగా 880 వాట్ల సౌండ్ అవుట్‌ పుట్‌ను అందిస్తుంది. చిన్న రూమ్ అయినా, పెద్ద హాల్ అయినా ప్రతి మూలకు సౌండ్ స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది. ఇందులో.. ఉన్న డ్యూయల్ సబ్‌వుఫర్స్, 5.2 ఛానెల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ బేస్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తాయి. మీరు సినిమాలు చూస్తున్నప్పుడు లేదా గేమింగ్ ఆడుతున్నప్పుడు పేలుళ్లు, యాక్షన్ సీన్ల తాలూకు వైబ్రేషన్స్ స్పష్టంగా ఎంజాయ్ చేయెచ్చు

డాల్బీ ఆడియో సపోర్ట్ :

సినిమా థియేటర్లలో లభించే.. ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు మీ ఇంట్లోనే దొరుకుతుంది. ఇందులో.. ఉన్న అడ్వాన్స్‌డ్ డాల్బీ ఆడియో టెక్నాలజీ కారణంగా డైలాగ్స్ అత్యంత స్పష్టంగా వినిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ , వాయిస్ మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. దీని వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హై-క్వాలిటీ ఆడియోను ఎంజాయ్ చేయెచ్చు.

కనెక్టివిటీ, ఫీచర్లు :

Advertisement

లేటెస్ట్ టెక్నాలజీకి తగ్గట్టుగా ఈ మోడల్ లో పలు రకాల కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

బ్లూటూత్ : మీ స్మార్ట్‌ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను క్షణాల్లో కనెక్ట్ చేసుకొని వైర్‌లెస్ మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు.

HDMI (ARC) & ఆప్టికల్: టీవీకి అత్యంత నాణ్యమైన సిగ్నల్స్ అందించడానికి ఇవి ఉపయోగపడతాయి.

USB,ఆక్సిలరీ (AUX): పెన్ డ్రైవ్ ద్వారా నేరుగా పాటలు ప్లే చేసుకోవచ్చు.

మల్టిపుల్ EQ మోడ్స్: రిమోట్ సాయంతో.. మ్యూజిక్, మూవీస్, న్యూస్, 3D, స్పోర్ట్స్ వంటి వేర్వేరు ప్రీసెట్ మోడ్స్‌ను అవసరానికి తగినట్లు మార్చుకోవచ్చు.

ధర :

అన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ మేడ్ ఇన్ ఇండియా మోడల్ ఛానెల్ సౌండ్‌బార్ ప్రస్తుత మార్కెట్లో కేవలం రూ.8,999 ధరకే కస్టమర్లకు లభిస్తోంది. ఈ బడ్జెట్‌లో ఇన్ని ఫీచర్లు, ముఖ్యంగా 880 వాట్ల పవర్ అందించే.. సౌండ్‌బార్ దొరకడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

Related News

రూ.9,990కే..మైక్రోవేవ్ ఓవెన్!బేకింగ్,గ్రిల్లింగ్,ఎయిర్ ఫ్రైయింగ్ అన్నీ ఒకే చోట

తక్కువ నెట్‌తో హై-క్లారిటీ వీడియోస్.. యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఇదే!

రూ. 2,000లకే ఎయిర్ ప్యూరిఫైయర్.. ఐఐటీ బాంబే రీసెర్చర్ అద్భుత ఆవిష్కరణ!

ఒప్పో నుంచి మరో మాస్టర్‌పీస్.. Find X10 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి!

సైబర్ మోసంలో డబ్బులు పోయాయా? తిరిగి పొందేందుకు మీకున్న హక్కులివే!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..టాప్ 5 వీడియో ఎడిటింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే

కత్తి అక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు.. ఫ్రీజర్ మంచును ఈజీగా క్లీన్ చేసే సింపుల్ టిప్స్!

Big Stories

Advertisement
×