Kieron Pollard On Mumbai Indians: ముంబై ఇండియన్స్ (Mumbai Indians) హెడ్ కోచ్ గా నియామకమైన కీరన్ పొలార్డ్ ( Kieron Pollard) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాంఖడే స్టేడియంలో అడుగు పెడితే ముంబై ఇండియన్స్ జెర్సీలు తప్ప ఏ ఒక్క రంగులు కనిపించకూడదని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. పసుపు, ఎరుపు రంగుల జెర్సీలు కనిపిస్తే తొక్కేయండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ముంబై ఇండియన్స్ జెర్సీలు మాత్రమే ఎక్కడ చూసినా కనిపించాలని.. అప్పుడే జట్టులో ఉత్సాహం మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. మనోళ్లు మాత్రమే ఉంటే ముంబై ఇండియన్స్ ఈజీగా గెలుస్తుందని వ్యాఖ్యానించారు. దీంతో కీరన్ పొలార్డ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ముంబై ఇండియన్స్ గత రెండు సీజన్లుగా చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ముంబై ఇండియన్స్ కొత్త హెడ్ కోచ్ కీరన్ పొలార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండు సీజన్లలో అభిమానులను చాలా నిరాశ మరిచినట్టు గుర్తు చేశారు. వచ్చే సీజన్ నుంచి అలాంటి పరిస్థితులు ఉండబోవు అని వ్యాఖ్యానించారు. దీని కోసం ముంబై అభిమానులు కూడా తమకు సహకరించాలని కోరారు. వాంఖడే స్టేడియంలో ముంబై జెర్సీలు తప్ప మరో జెర్సీ కనిపించకూడదని వ్యాఖ్యానించారు. స్టేడియం మొత్తం బ్లూ మయం కావాలని పిలుపునిచ్చారు.
అప్పుడే ముంబై ఇండియన్స్ క్రికెటర్లలో నూతన ఉత్సాహం వస్తుందని.. ప్రత్యర్థులను చీల్చి చెండాడుతాడని ఈ వ్యాఖ్యానించారు. తనకు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ పదవి ఇచ్చినందుకు అంబానీ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు. గత రెండు సీజన్ల కంటే భిన్నంగా జట్టును ముందుకు నడిపించే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. గతంలో ప్లేయర్ గా రాణించిన తనను.. ఇప్పుడు కొత్త పాత్రలో చూడాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. ఇలాంటి అవకాశం కొంతమందికి మాత్రమే వస్తుందని తెలిపారు. ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్ చేయడమే తన లక్ష్యమని ముంబై ఇండియన్స్ కోచ్ కీరన్ పొలార్డ్ అన్నారు.
2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా పై వేటు వేసి రోహిత్ శర్మకు మళ్లీ కెప్టెన్సీ ఇస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ముందుగా హెడ్ కోచ్ గా ఉన్న జయవర్ధనేను తప్పించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం… కీరన్ పొలార్డ్ ను తీసుకువచ్చింది. త్వరలో పాండ్యా పై వేటు వేసి రోహిత్ శర్మకు కెప్టెన్సీ కూడా ఇవ్వనున్నారట.