E-Paper
Advertisement

Moto G04 @ Rs 1 Month Recharge Pack Price: ఒక్క నెల రీఛార్జ్ ప్యాక్ ధరకే కొత్త 5G స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ మిస్ చేయకండి

Moto G04 @ Rs 1 Month Recharge Pack Price: ఒక్క నెల రీఛార్జ్ ప్యాక్ ధరకే కొత్త 5G స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ మిస్ చేయకండి
Advertisement

Get Moto G04 at 1 Month Recharge Pack Price: ప్రస్తుతం మార్కెట్‌లోకి కొత్త కొత్త మోడళ్లతో స్మార్ట్‌ఫోన్లు దర్శనమిస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్డేటెడ్ వెర్షన్లతో ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వీటికి వినియోగదారుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటంతో ప్రముఖ కంపెనీలు సరికొత్త ఫీచర్లతో.. కొత్త మోడళ్లలో వేరియంట్లను అందుబాటులో ఉంచుతున్నాయి.

Advertisement

అయితే ఇప్పటికే మార్కెట్‌లోకి చాలా కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అందులో మోటోరోలా కంపెనీ ఒకటి. ఈ కంపెనీకి భారత దేశంలో మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఆ డిమాండ్‌ను మరింత పెంచుకునేందుకు అప్డేట్‌ మోడళ్లను తీసుకువచ్చి కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

అయితే ఇటీవల ఈ కంపెనీ భారతదేశంలో ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. మోటో జీ04 (MOTOROLA G04) పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ 14, డాల్బీ అట్మాస్ సపోర్ట్ స్పీకర్, ఐపీ52 సర్టిఫికేట్ వంటి అనేక అద్భతమైన ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

Also Read: 6/128జీబీ వేరియంట్.. రూ.6 వేలకే..

కాగా ఈ మొబైల్‌ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇవి కాంకర్డ్ బ్లాక్, శాటిన్ బ్లూ, సీ గ్రీన్, సన్‌రైజ్ ఆరెంజ్ వంటి కలర్ ఆప్షన్లను కలిగి ఉంది.

అయితే ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో మంచి డిస్కౌంట్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీని 4/64జీబీ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999 ఉండగా.. 30 శాతం తగ్గింపుతో రూ.6,999 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే 8/128 జీబీ వేరియంట్ ధర రూ.10,999 ఉండగా.. ఇప్పుడు 27 శాతం తగ్గింపుతో 7,999లకే కొనుక్కొని ఇంటికి పట్టికెళ్లొచ్చు.

అంతేకాకుండా పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తుంది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ట్రాన్షక్షన్లపై రూ.500 వరకు డిస్కౌంట్ ఉంటుంది.

Also Read: ఓరి దేవుడా!.. 28,000 mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ఇంత తక్కువ ధర

వీటితోపాటు వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలుపై క్యాష్‌బ్యాక్/ కూపన్లతో సహా అదనంగా రూ.3000 వరకు తగ్గింపు పొందొచ్చు. అప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ మరింత తక్కువ ధరకే అందుతుంది. ఇవి కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. 4/64జీబీ వేరియంట్‌పై రూ.5,900 వరకు భారీ ఎక్స్ఛేజ్ డిస్కౌంట్ పొందొచ్చు.

అలాగే 8/128జీబీ వేరియంట్‌పై రూ.7,400 వరకు భారీ ఎక్స్ఛేంజ్ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ తగ్గింపు అనేది పాత ఫోన్ కండీషన్ బట్టి ధర మారుతుంటుంది. అంతేకాకుండా పిన్‌కోడ్ బట్టి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ పూర్తి మొత్తం ఆఫర్ వర్తిస్తే ఈ వేరియంట్లు వరుసగా.. రూ.1099, రూ.599లకి కొనుక్కోవచ్చు.

Tags

Related News

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

Big Stories

Advertisement
×