Big Stories

Smartphone: ఓరి దేవుడా!.. 28,000 mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ఇంత తక్కువ ధర

- Advertisement -

Smartphone: చాలా మంది కొత్త ఫోన్ కొనేటప్పుడు ముఖ్యంగా ఆ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ను తప్పనిసరిగా తెలుసుకుంటుంటారు. కెమెరా క్వాలిటీ ఎలా ఉంది. ఫోన్ బ్యాటరీ కెపాసిటీ ఎంత వరకు ఉంది. అలాగే హెల్త్ ట్రాకర్స్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనే వాటిని చూసి బాగుంటేనే ఆ ఫోన్‌ను కొనడానికి ఇష్టపడుతుంటారు.

- Advertisement -

అయితే ప్రస్తుత కాలంలో ఫోన్లలో లీనమైపోయి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రోజులో ఎక్కువ సమయం వీడియోలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల వారు కొనుక్కునే ఫోన్ బ్యాటరీ అధిక సామార్థ్యంతో ఉండాలని చాలా మంది కోరుకుంటుంటారు. అలాంటి వారికి ఇప్పుడొక గుడ్ న్యూస్.

ఇప్పటి వరకు చాలామంది స్మార్ట్‌ఫోన్లలో 5000, 6000 సామర్థ్యం గల బ్యాటరీనే చూసుంటారు. అయితే ఇప్పుడొక స్మార్ట్‌ఫోన్ ఏకంగా 28,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో మార్కెట్‌లోకి రాబోతుంది. అవునండీ మీరు విన్నది నిజమే.. ఆ స్మార్ట్‌ఫోన్ ఏంటా అని ఆలోచిస్తున్నారా?. అయితే ఇప్పుడు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

READ MORE: 5జీ ఫోన్‌పై కళ్లుచెదిరే ఆఫర్.. రూ.18 వేల ఫోన్ రూ.6వేలకే!

అవెనిర్ (Avenir) అనే టెలికాం కంపెనీ ‘ఎనర్జైజర్ హార్డ్ కేస్ P28K’ (Energizer Hard Case P28K Smartphone) స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానుంది.

ది వెర్జ్ నివేదిక ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.76 అంగుళాల LCD డిస్ల్పేతో రానుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్లతో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇది 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో రానున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఆండ్రాయిడ్ 14 వంటి ఫీచర్స్‌‌తో.. మీడియా టెక్ MT6789 చిప్‌సెట్‌‌తో వస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ IP69 రేటింగ్‌ వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌తో వచ్చే అవకాశముందని సమాచారం అందుతోంది.

కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో దాదాపు 28,000 mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని సమాచారం. కాగా ఇంతపెద్ద భారీ బ్యాటరీని వాడటం వెనుక ఉన్న ఉద్దేశాన్ని అవెనిర్ కంపెనీ వెల్లడించింది.

READ MORE: రూ.53 వేలకే ఐఫోన్​ 15.. ఇదే సూపర్​ డీల్!

ఈ ఫోన్‌ను ఒకసారి ఫుల్‌‌గా ఛార్జింగ్ చేస్తే దాదాపు వారం రోజుల పాటు బ్యాకప్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 20 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ ఆక్సిలరీ సెన్సార్‌ను ఇది కలిగి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అమర్చినట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ధర విషయానికి వస్తే.. ఈ ఫోన్ 249.99 యూరో‌లు ఉండవచ్చని సమచారం. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం.. సుమారు రూ.22,000తో సమానం అన్నట్లు తెలుస్తోంది.

READ MORE: రూ.79,999 ధర గల SAMSUNG Galaxy S23 FE ఫోన్.. కేవలం రూ.42,499కే!

అంటే 28000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు కేవలం రూ.22వేలకే లభిస్తుందన్నమాట. కాగా ఈ ఎనర్జైజర్ హార్డ్ కేస్ P28K స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మరి మంచి బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News