BigTV English

Health Insurance : ఆరోగ్య బీమా తీసుకునే ముందు.. వీటి గురించి తెలుసుకోండి

Health Insurance : ఆరోగ్య బీమా తీసుకునే ముందు.. వీటి గురించి తెలుసుకోండి

 


health

Health Insurance Precautions : ఈ రోజుల్లో అనారోగ్యం పాలయితే.. ఆరోగ్య బీమా ఉంటే తప్ప గట్టెక్కలేని పరిస్థితి. బీమా లేని పక్షంలో రెండు మూడేళ్ల పాటు కూడబెట్టుకున్న పొదుపు సొమ్ము అంతా వైద్య ఖర్చులకు ఆవిరైపోతుందంటే ఆశ్చర్యం లేదు. ఆధునిక జీవన విధానంలో మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా కొన్ని పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లడం మాత్రం తప్పడం లేదు. మనుషులు ఆచరించే ఆర్ధిక విధానాలే వారి కుటుంబ స్థితిగతులను నిర్ధేశిస్తాయి.


సాధారణంగా మధ్య తరగతి ఉద్యోగుల్లో చాలా మంది ఉన్నతంలో ఉన్నంతగా ఉండాలని చూస్తారు. తమ కలలను సాకారం చేసుకోనడానికి రూపాయి, రూపాయి కూడబెడుతుంటారు. ప్రతి కుటుంబానికి కావాల్సింది కనీస భద్రత ఆరోగ్య భీమా. ప్రతి ఖర్చును నియంత్రించవచ్చు. మన సంపాదనకు తగ్గట్టుగానే ఇంటి అద్దె ఎంత కట్టాలో నిర్ణయించుకోవచ్చు. మన చేతుల్లో లేనిది, అందుబాటులో ఉండనివి దవానా ఖర్చులు. మనం ఆరోగ్యంగా ఉన్నంతసేపు మనకి ఆరోగ్య భీమా ప్రాధాన్యత తెలియదు.

కానీ అనారోగ్యం బారిన పడినప్పుడు భీమా లేకపోతే ఆ కుటుంబం ఆర్ధిక పరిస్థితి తలక్రిందులు అవ్వడానికి ఎంతో సమయం పట్టదు. వైద్యం కోసం పెట్టిన ఖర్చులు, అప్పుల ఊబిలో నుండి బయటపడటానికి కొంత సమయం పడుతుంది. విలువైన కాలమంతా రుణాలు తీసుకోవడానికి సరిపోతుంది. మనం ఎలాంటి పరిస్థిలో ఉన్న ఆర్ధిక పరిస్థితి స్థిరంగా ఉండాలంటే ఏకైక మార్గం ఆరోగ్య భీమా. అయితే.. ఈ బీమా పాలసీలు తీసుకునే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Read more: మీ పీఎఫ్ ఖాతాలో వివరాలు తప్పుగా ఉన్నాయా?.. ప్రాసెస్ ఇదే!

ఆరోగ్యబీమా తీసుకునే ముందు దరఖాస్తులో అన్నీ సరైన వివరాలే ఇవ్వాలి. ఇప్పటికే ఉన్న జీవనశైలి వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు, స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లను ముందుగానే తెలియజేయాలి. లేకుంటే.. క్లెయిం సమయంలో ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య బీమా విషయంలో కొన్ని జబ్బులకు వెయిటింగ్ పీరియడ్ 1-4 ఏళ్లు ఉంటుంది. కనుక తక్కువ వెయిటింగ్ పీరియడ్ పాలసీని ఎంచుకోవాలి. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి చికిత్సలు ఆయుష్ కిందకి వస్తాయి. వీటికీ బీమా కవరేజీ ఉంటుంది.

కానీ, కొన్ని బీమా సంస్థలు ఆయుష్ చికిత్సకు పరిమితులు విధిస్తున్నాయి. అందుకే మంచి కవరేజీని అందించే బీమా సంస్థను ఎంచుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీ మీద కొంత అదనపు ప్రీమియం చెల్లించి యాడ్-ఆన్ లేదా రైడర్లు జతచేసుకుంటే వీలైనంత ఎక్కువ ప్రయోజనాన్ని పొందొచ్చు.
ఉదా: క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను ఎంచుకుంటే.. బీమా సంస్థ జాబితాలో ఉన్న ఏదైనా తీవ్రమైన అనారోగ్యం కలిగితే.. 15 రోజుల వ్యవధి (సర్వైవల్ పీరియడ్) తర్వాత బీమా సంస్థ పాలసీలో పేర్కొన్న మొత్తాన్ని చెల్లిస్తుంది. టాప్-అప్, సూపర్ టాప్ అప్ పాలసీలు తీసుకుంటే.. ప్రాథమిక ఆరోగ్య బీమా కవరేజ్ దాటినప్పుడు ఇవి ఆదుకుంటాయి.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×