E-Paper
Advertisement

Motorola Razr 50 Ultra Features Leaked: మతిపోగొడుతున్న మోటో కొత్త మడత ఫోన్.. స్క్రీన్ ఎంత స్టైలిష్‌గా ఉందంటే..?

Motorola Razr 50 Ultra Features Leaked: మతిపోగొడుతున్న మోటో కొత్త మడత ఫోన్.. స్క్రీన్ ఎంత స్టైలిష్‌గా ఉందంటే..?
Advertisement

Motorola Razr 50 Ultra Features Leak: టెక్ దిగ్గజం మోటో పెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటి. కంపెనీ టెక్ మార్కెట్‌లో అనేక గ్యాడ్జెట్లను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఈ కంపెనీకి చెందిన ఫోన్లకు ప్రజల్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే మోటో Razr 50 Ultra స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన పిక్స్, కొన్ని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఇది క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్. ఇందులో పెద్ద సెకండరీ స్క్రీన్ పంచ్ హోల్ డిజైన్‌తో కనిపిస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి.

ఇంటర్నెట్‌లోని సమాచారం ఆధారంగా రాబోయే మోటో Razr 50 Ultra స్మార్ట్‌ఫోన్ గతేడాది తీసుకొచ్చిన Razr 40 Ultra మాదిరిగానే కనిపిస్తుంది. ఇది మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌తో పెద్ద రెండవ స్క్రీన్ కలిగి ఉంది. ఈ ఫ్లిప్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ కలర్‌లో ఉంది. వెనుక కెమెరాలు దాని వెనుక ప్యానెల్‌లో అడ్డంగా అమర్చబడి ఉంటాయి. దీని మోడల్ నంబర్ XT-24510-3. ఇది 12 GB RAM + 512 GB స్టోరేజ్‌తో వస్తుంది. అయితే ఈ ఫోన్ లాంచింగ్‌కు సంబంధించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.

Advertisement

Also Read: సేల్స్‌లో రికార్డుల మోత.. వరల్డ్‌వైడ్ టాప్ -10 స్మార్ట్ ఫోన్లు ఇవే!

ఇంతకు ముందు ఇది మోడల్ నంబర్ XT2453-1తో EEC వెబ్‌సైట్‌లో కనిపించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మోటరోలా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గత సంవత్సరం జూలైలో Motorola Razr 40 Ultra ఫోన్‌ను 8GB RAM+256 GB స్టోరేజ్‌తో విడుదల చేసింది. దీని ధర రూ. 89,999గా ఉంది. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల ఫుల్ HD+ పోలెడ్ ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ 3.6 అంగుళాలు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ప్రాసెసర్‌ ఉంటుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీని 3,800 mAh బ్యాటరీ 30 W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 5 W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Advertisement

Also Read: ఇదేక్కడి ఆఫర్ రా దేవుడా.. ఫోన్ ధరను ఒక్కసారిగా ఇంత తగ్గిచ్చేస్తారా..!

Motorola ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)లో కార్నింగ్‌తో కొత్త ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ ఏడాది Q2 నుంచి కంపెనీ తన స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లలో గొరిల్లా గ్లాస్‌ను ఉపయోగించనుంది. ఇంతకుముందు కంపెనీ ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే స్క్రీన్ ప్రొటక్షన్ అందుబాటులో ఉంది. Motorola స్మార్ట్ కనెక్ట్, స్మార్ట్‌ఫోన్‌,లు టాబ్లెట్‌లను కనెక్ట్ చేయడానికి సాఫ్ట్‌వేర్‌ను కూడా తీసుకొచ్చింది. దీనితో వినియోగదారులు Motorola పరికరాలను Lenovo ల్యాప్‌టాప్‌లకు సులభంగా కనెక్ట్ చేయగలుగుతారు. గొరిల్లా గ్లాస్ కంపెనీ ఎంట్రీ-లెవల్ గ్యాడ్జెట్‌లలో కూడా అందింస్తుంది.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×