E-Paper
Advertisement

Weather Report: నగర వాసులకు బీ అలర్ట్.. భారీ వర్షం.. నిలిచిన మెట్రో సేవలు

Weather Report: నగర వాసులకు బీ అలర్ట్.. భారీ వర్షం.. నిలిచిన మెట్రో సేవలు
Advertisement

Weather Updates in Telugu States:  గత రెండు గంటలుగా హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కూకట్ పల్లి, మాదాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ భారీ వర్షం కారణంగా హైదరాబాద్ మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా మియాపూర్ లో 1.9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. అటు గాజుల రామారం ప్రాంతంలో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేసవి తాపం నుంచి ఊరటనిస్తూ వాతావరణం మారిపోయింది. తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా ఇవాళ మధ్యాహ్నం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి.

Advertisement

గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వేడి, ఈదురు గాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వడదెబ్బతో కొంతమంది మరణించారు. ఎండ తీవ్రతతో ఉదయం పది గంటల నుంచే అంతా ఇళ్లకు పరిమితం అయ్యారు. వేడిని తట్టుకునేందుకు జ్యూస్ సెంటర్ల బాట పట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ నుంచే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడితో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.

విదర్భ నుంచి తమిళనాడుకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావం వల్ల.. రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో 19 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురస్తుంది. గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

Advertisement

Also Read:  హమ్మయ్య.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఏపీలో భారీ వర్షం

ఇప్పటికే ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ఆసిఫాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రాళ్ల వాన పడింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. మరొకొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. సాయంత్రానికల్లా హైదరాబాద్ లో జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎన్టీఆర్ తో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్వారకా తిరుమలలో గంట నుంచి వర్షం పడుతోంది.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×