E-Paper
Advertisement

Ananya Panday: బ్రేకప్ పార్టీ.. లక్షల్లో ఖర్చు పెట్టిన ‘లైగర్’ బ్యూటీ.. ?

Ananya Panday: బ్రేకప్ పార్టీ.. లక్షల్లో ఖర్చు పెట్టిన ‘లైగర్’ బ్యూటీ.. ?
Advertisement

Ananya Panday latest news(Bollywood celebrity news): కాలం రోజురోజుకు మారుతుంది అంటే ఏమో అనుకున్నాం.. కానీ, మరీ ఇంత ఫాస్ట్ గా తయారవుతుంది అనుకోలేదు.. అంటే ఇది మేము అంటున్న మాట కాదు ఈ విషయం విన్నవారు అంటున్న మాట. పెళ్లి గ్రాండ్ గా చేసుకోవడం విన్నాం.. సీమంతం గ్రాండ్ గా చేసుకోవడం విన్నాం. కానీ, బ్రేకప్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం విన్నారా.. ? ప్రేమ విఫలమైతే తాగడం అబ్బాయి వంతు.. ఏడుస్తూ తిండి మానేసి ఇంట్లో కూర్చోవడం అమ్మాయి హక్కు అనేవి ఇప్పుడు లేవు.

ఈ కాలంలో బ్రేకప్ అంటే ఒకరోజు ఏడ్చామా .. రెండో రోజు మరొకరితో రిలేషన్ లో ఉన్నామా.. ? అనేలానే ఉన్నారు. ఇక ఈ బాలీవుడ్ బ్యూటీ అయితే ఏకంగా తన బ్రేకప్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి లక్షల్లో ఖర్చుపెట్టి మరీ పార్టీ ఎరేంజ్ చేసింది. ఇందేందమ్మా విడ్డూరం అని నోళ్లు నొక్కుకోకండి. అదే కొత్త పోకడ. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారు.. అనన్య పాండే. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే నట వారసురాలిగా 2019 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. మొదటి సినిమాకే ఫిలింఫేర్ అవార్డును అందుకొని ఔరా అనిపించుకుంది.

Advertisement

ఇక ఆ తరువాత 2021 లో లైగర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా అమ్మడికి భారీ పరాజయాన్ని అందివ్వడంతో ఇంకోసారి తెలుగు వైపు కూడా కన్నెత్తి చూడలేదు. అమ్మడి సినిమాల గురించి పక్కన పెడితే.. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ఈ బ్యూటీ నడిపిన ప్రేమాయణం ఇండస్ట్రీని షేక్ చేసింది. మూడేళ్లు వీరిద్దరూ గాఢమైన ప్రేమలో మునిగితేలారు. ఎక్కడికి వెళ్లినా చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతారేమో అనుకున్నారు. కానీ అంతలోనే ఈ భామ మూడేళ్ళ తమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టింది. మార్చి లో ఈ జంట విడిపోయారని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ మధ్యనే అనన్య పాండే.. తాను ఫ్రెండ్ సర్కిల్ తో పాటు ఫ్యామిలీకి కూడా పెద్ద పార్టీ ఇచ్చిందంట. దానికి ఆదిర్య రాయ్ కపూర్ కూడా అటెండ్ అయ్యినట్లు తెలుస్తోంది. దీనికోసం అమ్మడు లక్షల్లో ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆదిత్య కు తనకు బ్రేకప్ అయ్యిందని అధికారికంగా అందరికి తెలియజెప్పిందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ వార్త విన్న నెటిజన్స్ ఇప్పుడున్న జనరేషన్ ఇలాంటిది అని పెదవి విరుస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×