E-Paper
Advertisement

Motorola Edge 50 Pro Price Drop: అమెజాన్‌లో మోటోరొలా ఎడ్జ్ 50 ప్రోపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.18,650 ధర తగ్గింపు!

Motorola Edge 50 Pro Price Drop: అమెజాన్‌లో మోటోరొలా ఎడ్జ్ 50 ప్రోపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.18,650 ధర తగ్గింపు!
Advertisement

Motorola Edge 50 Pro Price Drop: రూ.25వేల లోపు పవర్‌పుల్, ప్రీమియం ఫీల్ ఇచ్చే స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నవారికి ప్రస్తుతం ‘మోటోరొలా ఎడ్జ్ 50 ప్రో’ బెస్ట్ ఛాయిస్‌ అని చెప్పవచ్చు. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ ధర తగ్గింపు అందుబాటులో ఉండటంతో, ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లున్న హ్యాండ్‌సెట్‌ను తక్కువ బడ్జెట్‌లో సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. మరెందుకు ఆలస్యం పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం రండి.

44 శాతం ధర తగ్గింపు:

మోటోరొలా ఎడ్జ్ 50 ప్రో.. అసలు ధర రూ.41,999 కాగా.. ప్రస్తుతం దీనిపై రూ.18,650 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ ధర కేవలం రూ.23,349కి తగ్గింది. అంటే.. దాదాపు 44 శాతం వరకు తగ్గింపు లభిస్తున్నట్లే. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్స్‌పై అదనంగా రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ తగ్గింపు, అలాగే Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఇంకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా పాత హ్యాండ్‌సెట్‌ను ఇచ్చి, కొత్త ఫోన్ ధరను మరింత తగ్గించుకునే అవకాశం ఉంది.

Advertisement

Also Read: ఫోల్డబుల్ మార్కెట్లో హువావే సంచలనం.. అత్యాధునిక Kirin 9030 Pro చిప్‌సెట్‌తో Mate X7 విడుదల!

మల్టీటాస్కింగ్:

ఇక ఈ ఫోన్ పనితీరు విషయానికి వస్తే.. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రోజువారీ ఉపయోగం నుంచి గేమింగ్ వరకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ హ్యాండ్ సెట్ 12జీబీ RAM, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో రావడం వల్ల మల్టీటాస్కింగ్‌, స్టోరేజ్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

గేమింగ్ లవర్స్ కోసం:

Advertisement

డిస్‌ప్లే విషయంలో మోటోరొలా ఎడ్జ్ 50 ప్రో ప్రత్యేకంగా నిలుస్తుంది. దీనిలో 1.5K రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల కార్డ్వ్ పోల్డ్ డిస్‌ప్లే‌ను కలిగి ఉంది. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు HDR10+ సపోర్ట్ ఉండటం వల్ల వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం మరింత ఆకట్టుకునేలా ఉంటుంది.

ప్రధాన ఆకర్షణగా కెమెరా:

ఇకపోతే.. కెమెరా సెటప్ కూడా ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. దీనిలో OIS సపోర్ట్ ఉన్న 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫొటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ ప్రేమికుల కోసం ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరాను అందించడంతో.. ఇది క్లియర్, డీటెయిల్డ్ ఫొటోలను అందిస్తుంది.

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్:

బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌ 4,500mAh బ్యాటరీతో వస్తుంది. ముఖ్యంగా 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల చాలా తక్కువ సమయం లోనే ఫోన్ ఛార్జ్ అవుతుంది. మొత్తంగా చూస్తే.. ప్రస్తుతం ఉన్న భారీ డిస్కౌంట్‌తో మోటోరొలా ఎడ్జ్ 50 ప్రో రూ.25,000 బడ్జెట్‌లో ఒక వాల్యూ ఫర్ మనీ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పవచ్చు.

Also Read: ఆధునిక ఏఐ ఫీచర్లు, టాప్ ప్రొటెక్షన్‌తో మోటోరొలా ఎడ్జ్ 70 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×