E-Paper
Advertisement

Motorola Edge 70 Offers: ఆఫర్ల సునామీలో మోటరోలా ఎడ్జ్ 70.. ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 28,999 లకే మీ సొంతం

Motorola Edge 70 Offers: ఆఫర్ల సునామీలో మోటరోలా ఎడ్జ్ 70.. ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 28,999 లకే మీ సొంతం

Motorola Edge 70 Offers: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లు అనగానే ముందుగా గుర్తొచ్చేది భారీ తగ్గింపులు, బ్యాంక్ డీల్స్, అసలు ధరకంటే తక్కువలో ప్రీమియం ఫోన్‌లు దొరికే అవకాశం. ముఖ్యంగా మిడ్ రేంజ్ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కావాలనుకునే వాళ్లకు ఫ్లిప్‌కార్ట్ ఎప్పుడూ మంచి ఆప్షన్ ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆఫర్‌లోనే మోటరోలా నుంచి వచ్చిన ఎడ్జ్ 70 ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. డిజైన్ నుంచి కెమెరా వరకు, బ్యాటరీ నుంచి డ్యూరబిలిటీ వరకు ఈ ఫోన్ ఎందుకు స్పెషల్ అనేది ఇప్పుడు పూర్తిగా చూద్దాం.

డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ

మోటరోలా ఎడ్జ్ 70 చూడగానే ముందుగా కనిపించేది దాని అల్ట్రా స్లిమ్ లుక్. కేవలం 5.99 ఎమ్‌ఎమ్ మందంతో ఈ ఫోన్ చేతిలో పట్టుకుంటే చాలా స్లిమ్ ఫీలింగ్ ఇస్తుంది. పాంటోన్ బ్రాంజ్ గ్రీన్ కలర్ ఫినిష్ ఈ ఫోన్‌కి చాలా ప్రీమియం టచ్ ఇస్తుంది. బ్యాక్ సైడ్‌లో కెమెరా మాడ్యూల్ డిజైన్ కూడా కొత్తగా కనిపిస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేసిన బాడీ వల్ల స్టైల్‌తో పాటు స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. రోజువారీ వాడకంలో చిన్న చిన్న దెబ్బలు, నీటి చుక్కలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు అనిపించేలా డిజైన్ చేశారు.

డిస్‌ప్లే అనుభవం

ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల పెద్ద డిస్‌ప్లే ఉంటుంది. సినిమాలు చూడటం, సోషల్ మీడియా స్క్రోలింగ్ చేయటం, గేమ్స్ ఆడటం అన్నింటికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. డిస్‌ప్లే క్లారిటీ చాలా షార్ప్‌గా ఉంటుంది. బ్రైట్‌నెస్ కూడా తగినంతగా ఉండటం వల్ల బయట వెలుతురు ఉన్నా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎడ్జ్ డిజైన్ కారణంగా ఫోన్‌కి మరింత స్లిమ్ లుక్ వస్తుంది. కంటెంట్ చూడటానికి ఇది ఒక మంచి విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు.

50 మెగా పిక్సెల్ ప్లస్ 50 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా

మోటరోలా ఎడ్జ్ 70లో కెమెరా విభాగం చాలా బలంగా ఉంది. వెనుక వైపు 50 మెగా పిక్సెల్ ప్లస్ 50 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వడం జరిగింది. ఫోటోలు తీస్తే కలర్స్ నేచురల్‌గా వస్తాయి. డే లైట్‌లో తీసిన ఫోటోలు చాలా క్లియర్‌గా ఉంటాయి. పోర్ట్రైట్ షాట్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ కూడా బాగా వస్తుంది. ముందు వైపు 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీలు ఇష్టపడే వాళ్లకు ఇది పెద్ద ప్లస్. వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు కూడా క్లారిటీ బాగానే ఉంటుంది. సోషల్ మీడియా కోసం ఫోటోలు, వీడియోలు తీసేవాళ్లకు ఈ కెమెరా సెటప్ సరిపోతుంది.

Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ వావ్ డీల్స్.. బ్రాండెడ్ సూట్‌కేస్‌లపై 28శాతం వరకు తగ్గింపు

స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉపయోగించారు. ఆక్టా కోర్ సెటప్‌తో 2.8 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ఉండటం వల్ల రోజువారీ పనులు చాలా స్మూత్‌గా జరుగుతాయి. యాప్స్ ఓపెన్ చేయడం, మల్టీటాస్కింగ్ చేయడం, గేమ్స్ ఆడటం అన్నింటిలో కూడా ల్యాగ్ అనిపించదు. 8 జీబీ ర్యామ్ ఉండటం వల్ల ఒకేసారి చాలా యాప్స్ ఓపెన్ చేసినా ఫోన్‌ స్లో అవదు. 256 జీబీ స్టోరేజ్ ఉండటం వల్ల ఫోటోలు, వీడియోలు, యాప్స్ కోసం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పని లేదు.

5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ

మోటరోలా ఎడ్జ్ 70లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో రోజు మొత్తం ఈజీగా నడుస్తుంది. వీడియోలు చూడటం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయటం, కాల్స్ చేయటం లాంటి పనులకు బ్యాటరీ డ్రెయిన్ ఎక్కువగా ఉండదు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. బయటకు వెళ్లేటప్పుడు పవర్ బ్యాంక్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు.

డ్యూరబిలిటీ అండ్ సేఫ్టీ

ఈ ఫోన్‌కి ఐపీ 68 ప్లస్ ఐపీ 69 రేటింగ్ ఉండటం చాలా పెద్ద హైలైట్. అంటే నీరు, ధూళి నుంచి మంచి రక్షణ ఉంటుంది. వర్షంలో కొంచెం తడిచినా, చేతులు తడిగా ఉన్నా ఫోన్‌కి ఏమీ కాకుండా ఉండేలా డిజైన్ చేశారు. రోజువారీ లైఫ్‌లో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. బలమైన బిల్డ్ క్వాలిటీ వల్ల లాంగ్ టర్మ్ వాడకానికి ఇది సరైన ఫోన్‌ అనిపిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ వివరాలు

ఇప్పుడు అసలు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ విషయానికి వస్తే, మోటరోలా ఎడ్జ్ 70 అసలు ధర 34,999 రూపాయలు. కానీ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో ఈ ఫోన్‌ 29,999 రూపాయలకు లిస్ట్ అయింది. అంటే నేరుగా 14 శాతం తగ్గింపు వస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్‌లు ఉపయోగిస్తే ఇంకా తక్కువ ధరకే దొరికే అవకాశం ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కొన్ని ఆఫర్‌లతో చూస్తే ఈ ఫోన్‌ ధర 28,999 రూపాయల వరకు తగ్గుతుంది. ఈ ధరలో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, స్లిమ్ డిజైన్, స్ట్రాంగ్ కెమెరా సెటప్ ఉన్న ఫోన్‌ దొరకడం అంటే నిజంగా మంచి డీల్ అని చెప్పాలి.

ఛాన్స్ మిస్ అవకండి..

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో మోటరోలా ఎడ్జ్ 70 ఒక ఆల్ రౌండర్ ఫోన్‌లా కనిపిస్తుంది. ప్రీమియం లుక్ కావాలనుకునే వాళ్లు, కెమెరా ఇష్టపడే వాళ్లు, మంచి బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వాళ్లందరికీ ఇది సరైన ఎంపిక. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి డీల్ మిస్ కాకుండా చూసుకోవడం మంచిది. అసలు ధర 34,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ధర 29,999 రూపాయలు, బ్యాంక్ ఆఫర్‌లతో చూస్తే 28,999 రూపాయల వరకూ దొరికే ఛాన్స్ ఉంది.

Related News

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

Big Stories

×