E-Paper
Advertisement

Motorola Edge 70 Fusion: మార్కెట్ షేక్ అవ్వాల్సిందే.. మోటరోలా కొత్త ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్, పూర్తి వివరాలు ఇవిగో!

Motorola Edge 70 Fusion: మార్కెట్ షేక్ అవ్వాల్సిందే.. మోటరోలా కొత్త ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్, పూర్తి వివరాలు ఇవిగో!
Advertisement

Motorola Edge 70 Fusion: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తున్న ప్రముఖ టెక్ సంస్థ మోటరోలా.. ఇప్పుడు Edge సిరీస్‌లో మరో పవర్‌ఫుల్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. Motorola Edge 70 Fusion పేరుతో రానున్న ఈ ఫోన్ గురించి ప్రస్తుతం టెక్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా లీకైన ఫొటోలు చూస్తుంటే.. ఈ ఫోన్ డిజైన్ పరంగా యువతను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా పాంటోన్ కలర్ ఆప్షన్లతో పాటు నైలాన్, లినెన్ మెటీరియల్‌తో వస్తున్న వెనుక ప్యానెల్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తోంది.

కళ్లు చెదిరేలా డిస్‌ప్లే:

Motorola Edge 70 Fusion డిస్‌ప్లే విభాగంలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతోంది. 6.78-అంగుళాల క్వాడ్ కర్డ్వ్ అమోలెడ్ స్క్రీన్, 1.5K రిజల్యూషన్‌తో అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్, స్క్రోలింగ్ చాలా మెరుగ్గా ఉంటుంది. ఇక ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఏకంగా 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను దీనిలో జోడించారు. అతి తక్కువ బెజెల్స్ ఉండటం వల్ల ఫోన్ చూడటానికి చాలా సన్నగా కనిపిస్తోంది.

Advertisement

Also Read: యాపిల్ నుంచి మరో బిగ్ సర్‌ప్రైజ్.. స్పెషల్ ఎడిషన్ బ్లాక్ యూనిటీ బ్యాండ్ వచ్చేసింది!

అద్భుతమైన కెమెరా సెటప్:

స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో రానున్న ఈ ఫోన్.. మల్టీ టాస్కింగ్ కోసం 12GB వరకు RAM ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో ఇది పనిచేయనుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇక ఫొటోగ్రఫీ కోసం 50MP ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండగా.. సెల్ఫీల కోసం 32MP కెమెరాను అమర్చారు. క్వాలిటీ ఫొటోలు, వీడియో కాల్స్ కోసం ఈ సెటప్ ఎంతో మేలు చేస్తుంది.

షాకింగ్ బ్యాటరీ లైఫ్:

Advertisement

ఈ Motorola Edge 70 Fusion ఫోన్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 7000mAh భారీ బ్యాటరీని సంస్థ ఇస్తోంది. సాధారణంగా ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ బరువుగా ఉంటుంది. కానీ మోటరోలా దీనిని చాలా స్లిమ్‌గా డిజైన్ చేయడం గమనార్హం. దీనికి తోడు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండ్రోజుల పాటు టెన్షల్ లేకుండా వాడుకోవచ్చు.

Also Read: అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో XLపై షాకింగ్ డీల్.. ఆఫర్ మిస్ అవ్వకండి భయ్యా!

 

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×