E-Paper
Advertisement

Deputy CM Plane Crashed: మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ దుర్మరణం

Deputy CM Plane Crashed: మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం..  డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ దుర్మరణం
Advertisement

Deputy CM Plane Crashed: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. బారామతిలో ల్యాండింగ్‌ అవుతున్న సమయంలో కూలిపోయింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తుల మంటలు చెలరేగడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.

మహారాష్ట్రలో ఘోర విమానం ప్రమాదం

Advertisement

మహారాష్ట్రలో ఘోర విమానం ప్రమాదం జరిగింది.  ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. విమానం కూలిన వెంటనే విమానం భారీ ఎత్తున ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారం కోసం విమానంలో వెళ్తున్న డిప్యూటీ సీఎం, బారామతిలో ల్యాండింగ్‌ అవుతున్న సమయంలో కుప్పకూలింది.

ఘటన సమయంలో విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తోపాటు మరో ఐదుగురు ఉన్నారు. బుధవారం ఉదయం 8.45 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. విమాన ప్రమాదంలో  ఐదుగురు మృతి చెందినట్టు డీజీసీఏ వెల్లడించింది.  బారామతి ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నించే క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ సహా పలువురు మృతి

జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఒక్కరోజు ఆయన నాలుగు భారీ బహిరంగ సభలకు హాజరుకావాల్సివుంది. సంఘటనా స్థలం నుండి మంటలు, పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ఘటన ప్రాంతంలో ధ్వంసమైన విమానం అవశేషాలు కనిపించాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు. వెంటనే అక్కడికి అంబులెన్సులు వచ్చాయి.

మంగళవారం ముంబైలో జరిగిన కేబినెట్ సమావేశానికి అజిత్ హాజరయ్యారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి బయలుదేరారు.  విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ఆయనతోపాటు వ్యక్తిగత, భద్రతా సిబ్బంది అందులో ఉన్నారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టు డీజీసీఏ వెల్లడించింది.

ALSO READ: అమెరికాకు మాస్టర్ స్ట్రోక్.. భారత్-ఈయూ చేతులు కలిపాయి

అజిత్ పవార్ వయస్సు 66 ఏళ్లు. ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయ నేతల్లో ఆయన కూడా ఒకరు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌ సోదరుడి కుమారుడు అజిత్. ఎన్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, మహారాష్ట్రకు గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మారుతున్న రాజకీయాల నేపథ్యంలో బాబాయ్‌ శరద్ పవార్‌తో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ నుంచి బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టుకున్నారు.

మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పని చేస్తున్నారు. దాంతోపాటు ఆర్థిక, ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి వంటి శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు. మరోవైపు ఘటన గురించి తెలియగానే అజిత్‌పవార్‌ భార్య సునేత్ర, సోదరి సుప్రియా సూలే హుటాహటిన బారామతికి బయలుదేరారు. అజిత్‌ పవార్‌ హఠాన్మరణంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

 

 

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×