E-Paper
Advertisement

Motorola Edge 70 Fusion: గేమర్లు, వ్లాగర్లకు పూనకాలే.. పవర్‌పుల్ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్ డేట్ ఫిక్స్!

Motorola Edge 70 Fusion: గేమర్లు, వ్లాగర్లకు పూనకాలే.. పవర్‌పుల్ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్ డేట్ ఫిక్స్!
Advertisement

Motorola Edge 70 Fusion: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోటరోలా.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెక్ ప్రియుల కోసం ‘మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్’ను మార్చి 6న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ఈ ఫోన్.. ముఖ్యంగా గేమర్లు, కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది మిడ్‌రేంజ్ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తూ మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉందని టెక్ నిపుణుల అంచనా.

క్లాసీ లుక్, పిచ్చెక్కించే డిస్‌ప్లే:

మోటరోలా ఫోన్లు అంటేనే స్టైలిష్ డిజైన్‌కు మారుపేరు. ఎడ్జ్ 70 ఫ్యూజన్ కూడా ప్రీమియం లెదర్ ఫినిషింగ్, కర్వ్డ్ ఎడ్జ్‌లతో చాలా లగ్జరీగా కనిపిస్తుంది. ఇది సిల్హౌట్, బ్లూ సర్ఫ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యం కానుంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. దీనిలో 1.5K రెజల్యూషన్ కలిగిన క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్‌ను అమర్చారు. 144Hz రిఫ్రెష్ రేట్, ఏకంగా 5,200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో రావడం వల్ల, ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే సినిమా లవర్స్ కోసం HDR10+ సపోర్ట్ కూడా ఉంది.

Advertisement

Also Read: రూ.6,999కే ప్రీమియం లుక్.. ఆండ్రాయిడ్ 15తో వచ్చిన లావా కొత్త ఫోన్ విశేషాలివే!

50MP ట్రిపుల్ కెమరా సెటప్:

వేగవంతమైన పనితీరు కోసం Motorola Edge 70 Fusionలో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 చిప్‌సెట్‌ను వాడారు. దీంతో మల్టీ‌టాస్కింగ్‌ చాలా స్మూత్‌గా నడుస్తుంది. ఇకపోతే ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వెనుకవైపు 50MP సోనీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. దీని వల్ల తక్కువ లైటింగ్‌లో కూడా అద్భుతమైన ఫొటోలను తీయొచ్చు. అలాగే సెల్ఫీల కోసం ఉన్న 32MP కెమెరా 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఉండటం వల్ల వ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ 3 రకాల స్టోరేజ్ వేరియంట్లలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది.

షాకింగ్ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

సాధారణంగా Motorola Edge 70 Fusion వంటి స్లిమ్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కానీ మోటరోలా దీనిలో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీని అమర్చింది. దీనికి తోడు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండ్రోజుల పాటు వాడుకోవచ్చన్నమాట.

Also Read: ఈ రింగ్ వేలికి పెట్టుకుంటే చాలు.. మీ బాడీలో ఏం జరుగుతుందో చిటికెలో చెప్పేస్తుంది!

Related News

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

రూ.లక్షలు పెట్టి ఏఐ ఫోన్ కొనాలా? లేక సాధారణ ఫోనే బెటరా? రెండింటికీ తేడా ఇదే!

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఖాతాలో డబ్బులు మటాష్!

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

Big Stories

Advertisement
×