Motorola Edge 70 Pro: ప్రస్తుతం టెక్ లవర్స్‌ను ఎక్కువగా ఆకర్షిస్తున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఏదంటే.. కళ్లు మూసుకుని మోటరోలా పేరు చెప్పేయొచ్చు. ఇప్పటికే Edge 70 సిరీస్‌లో రెండు ఫోన్లను విడుదల చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు దానికంటే పవర్‌ఫుల్ వెర్షన్‌గా ‘Motorola Edge 70 Pro’ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ఏప్రిల్ 22న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన వివరాలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి.
ఈ Motorola Edge 70 Proను చూడగానే ముచ్చటగొలిపేలా డిజైన్ ప్లాన్ చేసింది కంపెనీ. ముఖ్యంగా ఈ మోడల్‌లో 3 రంగులు ఉన్నాయి. మార్బుల్ ఫినిషింగ్‌తో వైట్, మెరిసిపోయేలా టీ కలర్, ఇంకా క్లాత్ ఫినిషింగ్‌తో టైటాన్ కలర్. కర్వ్‌డ్ స్క్రీన్, వెనుక స్టైలిష్ కెమెరా సెటప్‌తో ఫోన్ చాలా ప్రీమియంగా కనిపిస్తోంది.
6.8 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో సినిమా చూసినా, గేమ్స్ ఆడినా ఆ అనుభూతి వేరే లెవల్‌లో ఉంటుంది. దీని 144Hz రిఫ్రెష్ రేట్ వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వకుండా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. ఇక లోపల ఉన్న మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ వల్ల ఎంతటి భారీ యాప్స్ అయినా చిటికెలో ఓపెన్ అయిపోతాయి. ఫోన్ వేడెక్కకుండా ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్ కూడా అమర్చారు.
Also Read: Samsung Galaxy S25పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఏకంగా రూ.30,000 తగ్గించేశారు!
ఇకపోతే ఫోటోల విషయానికి వస్తే.. Motorola Edge 70 Proలో AI మ్యాజిక్ ఉండబోతోంది. వెనుక 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం కూడా 50 మెగాపిక్సెల్ కెమెరానే ఇచ్చారు. వెలుతురు తక్కువగా ఉన్నా సరే.. ఏఐ సాయంతో ఫోటోలు చాలా బ్రైట్‌గా, క్లియర్‌గా వస్తాయని కంపెనీ చెబుతోంది. టెలిఫోటో లెన్స్ లేకపోయినా, సాఫ్ట్‌వేర్ పవర్‌తో ఆ లోటు తెలియకుండా మేనేజ్ చేస్తారట.
చాలామందికి ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే టెన్షన్ ఉంటుంది. కానీ ఇందులో ఏకంగా 6500mAh భారీ బ్యాటరీ ఉంది. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రెండు రోజులు నిశ్చింతంగా వాడుకోవచ్చు. పైగా 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.
ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతుంది. ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ మాటిచ్చింది. అలాగే నీళ్లలో పడినా, దుమ్ములో ఉన్నా ఫోన్ పాడవకుండా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ (IP68/69) కూడా ఉంది. మంచి కెమెరా, అదిరిపోయే బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ కానుంది. ధర ఎంతో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read: నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నా.. ఈ స్కోడా ‘డ్యూయోబెల్’ సౌండ్ వినిపించాల్సిందే!