E-Paper
Advertisement

నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్‌ పెట్టుకున్నా.. ఈ స్కోడా ‘డ్యూయోబెల్’ సౌండ్ వినిపించాల్సిందే!

నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్‌ పెట్టుకున్నా.. ఈ స్కోడా ‘డ్యూయోబెల్’ సౌండ్ వినిపించాల్సిందే!
Advertisement

Skoda DuoBell: రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెవుల్లో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటల్లో మునిగిపోయేవాళ్లను మనం రోజూ చూస్తూనే ఉంటాం. పాపం.. వెనుక నుంచి ఎవరెంత గట్టిగా హారన్ కొట్టినా, బెల్ కొట్టినా వాళ్లకు అస్సలు వినిపించదు. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సైక్లిస్టులు ఎంత బెల్ కొట్టినా ముందు వెళ్లేవాళ్లు పక్కకు తప్పుకోక ఇద్దరూ ఇబ్బంది పడుతుంటారు. ఈ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టడానికి ప్రముఖ కార్ల కంపెనీ ‘స్కోడా’ ఒక క్రేజీ ఐడియాను తీసుకొచ్చింది. అదే ‘డ్యూయోబెల్’.

ఐడియా పాతదే.. రిజల్ట్ అద్భుతం:

సైకిల్ బెల్ అంటే మనకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా.. ఆ ట్రింగ్ ట్రింగ్ శబ్దం దాదాపు 150 ఏళ్ల నుంచి అలాగే ఉంది. ప్రపంచం మారింది కానీ ఆ బెల్ మాత్రం మారలేదు. ఇప్పుడు స్కోడా దాన్ని పూర్తిగా రీ డిజైన్ చేసింది. విశేషం ఏంటంటే.. ఇందులో ఎలాంటి సెన్సార్లు, బ్యాటరీలు ఉండవు. ఇది మనం వాడే పాత బెల్ లాగే సింపుల్ మెకానిజంతో పనిచేస్తుంది. కానీ ఈ బెల్ చేసే శబ్దం మాత్రం సాదాసీదాది కాదు. హైటెక్ హెడ్‌ఫోన్స్‌ను కూడా బోల్తా కొట్టించేలా దీన్ని తయారు చేశారు.

Advertisement

Also Read: 4,500 నిట్స్ బ్రైట్‌నెస్.. వెనుక వైపు LED డిస్‌ప్లే, Infinix Note 60 Pro ఫీచర్లు అరాచకం!

ఇదెలా సాధ్యమంటే?

సాధారణంగా నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ ఉన్న హెడ్‌ఫోన్స్ బయటి నుంచి వచ్చే సౌండ్స్‌ను అడ్డుకుంటాయి. కానీ ఈ డ్యూయోబెల్ ఆ ఫిల్టర్లను దాటుకుని నేరుగా చెవిలోకి దూరిపోతుంది. దీని కోసం స్కోడా టీమ్ పెద్ద రీసెర్చ్‌ చేసింది. హెడ్‌ఫోన్స్ ఏ శబ్దాన్ని ఆపలేకపోతున్నాయో అని వెతికి పట్టుకున్నారు. 750Hz నుంచి 780Hz మధ్య ఉండే ఫ్రీక్వెన్సీ సౌండ్స్‌ను హెడ్‌ఫోన్స్ సరిగ్గా ఆపలేవని వాళ్లకు అర్థమైంది. అందుకే ఈ బెల్ నుంచి సరిగ్గా ఆ పౌనఃపున్యంలో శబ్దం వచ్చేలా ట్యూన్ చేశారు.

ప్రమాదం జరగకముందే అలర్ట్..

Advertisement

ఈ బెల్ ఏ రేంజ్‌లో పనిచేస్తుందో తెలుసుకోవడానికి లండన్ వీధుల్లో డెలివరీ బాయ్స్‌తో టెస్టులు చేయించారు. మామూలు బెల్ కొడితే హెడ్‌ఫోన్స్ ఉన్నవాళ్లు అస్సలు స్పందించలేదు. కానీ ఈ డ్యూయోబెల్ కొట్టగానే, ఆ శబ్దం వాళ్లకు 22 మీటర్ల ముందే వినిపించింది. అంటే సైకిల్ వాళ్ల దగ్గరికి రావడానికి ఐదు సెకన్ల ముందే వాళ్లు అప్రమత్తం అయ్యారన్నమాట. రోడ్డు మీద ప్రమాదం జరగకుండా ఉండటానికి ఆ ఐదు సెకన్లు చాలు. అందుకే ఈ బెల్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.

త్వరలోనే అందుబాటులోకి..

ప్రస్తుతానికి స్కోడా ఈ బెల్‌ను లండన్ లాంటి నగరాల్లో ప్రయోగాత్మకంగా వాడుతోంది. త్వరలోనే ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. సైకిల్ తొక్కే వాళ్లకే కాదు.. రోడ్డుపై నడిచే వాళ్లకు కూడా ఇదొక రక్షణ కవచంలా మారుతుంది. టెక్నాలజీ అనేది ఎప్పుడూ పెద్ద పెద్ద మిషన్లలోనే కాదు.. ఇలాంటి చిన్న చిన్న ఆలోచనల్లో కూడా ఉంటుంది అని స్కోడా మరోసారి నిరూపించింది. ఏదైతేనేం.. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని లోకాన్ని మరిచిపోయేవారికి ఈ డ్యూయోబెల్ ఒక స్వీట్ వార్నింగ్ లాంటిదన్నమాట.

Also Read: 144Hz డిస్‌ప్లే, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మార్కెట్లోకి వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఇక దుమ్ములేపడమే!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×