Galaxy S25 Price Drop: మన దేశంలో శాంసంగ్ ఫోన్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా S సిరీస్ ఫోన్ చేతిలో ఉంటే ఆ మజానే వేరు. కానీ, వాటి ధరలు చూసి చాలామంది అమ్మో.. ఈ ఫోన్లను మనం కొనగలమా? అని ధర గురించి వెనకడుగు వేస్తుంటాం. అయితే, ఇప్పుడు అలాంటి ఆలోచనకు చెక్ పెట్టే సమయం వచ్చేసింది. 2025లో మార్కెట్లోకి వచ్చిన Samsung Galaxy S25 సిరీస్ ఫోన్లపై ఈ-కామర్స్ సైట్లు అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మొన్నటి వరకు కొనలేమేమో అనుకున్న ఫోన్లు ఇప్పుడు తక్కువ బడ్జెట్‌లోనే అందుబాటులోకి వచ్చేశాయి.
శాంసంగ్ తమ టాప్ మోడల్ ఫోన్లపై ఇంత త్వరగా రేట్లు తగ్గిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో గెలాక్సీ S25 మోడల్ ఏకంగా రూ.24,000 తక్కువకే లభిస్తోంది. లాంచ్ అయినప్పుడు రూ.80,999 ఉన్న ఈ ఫోన్.. ఇప్పుడు రూ.56,999కే సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర యాక్సిస్ లేదంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డులు ఉంటే మరో రూ.2,850 వరకు అదనంగా తగ్గుతుంది. దీంతో దాదాపు రూ.54,000కే ఈ ప్రీమియం ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు. పైగా నెలకు రూ.2,000 కట్టుకునేలా సులభమైన ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉండటం విశేషం.
Also Read: ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అవ్వడం మీ డ్రీమా? తక్కువ ధరలో లభించే ఈ Nikon D7500 మీ కోసమే!
చాలామందికి తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కావాలని ఉంటుంది. అలాంటి వారి కోసమే S25 FE మోడల్. రూ.60,000 ధరతో వచ్చిన ఈ ఫోన్.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.44,999కే అందుబాటులో ఉంది. దీనికి బ్యాంక్ ఆఫర్లు తోడైతే ధర ఇంకా తగ్గుతుంది. అంతేకాదు.. మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద భారీ తగ్గింపు కూడా పొందొచ్చు. మిడ్‌రేంజ్ ధరలోనే ప్రీమియం ఫీచర్లు వాడాలనుకునే వారికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.
ఇక శాంసంగ్ ఫోన్లలో కింగ్ లాంటిది S25 అల్ట్రా. ఈ ఫోన్ ధర ఇప్పుడు అమెజాన్ ఇండియాలో అమాంతం పడిపోయింది. ఏకంగా రూ.30,000 తగ్గింపుతో ఇప్పుడిది రూ.99,999కే దొరుకుతోంది. రూ.1,30,000 దాటిన ఈ ఫోన్ ఇప్పుడు రూ.లక్ష లోపు రావడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఎక్సలెంట్ కెమెరా క్వాలిటీ, అదిరిపోయే గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వారికి అల్ట్రా మోడల్ బెస్ట్ ఆప్షన్. ఎక్స్ఛేంజ్ ద్వారా కూడా దీనిపై రూ.42,000 వరకు ప్రయోజనం పొందే వీలుంది.
మార్కెట్లో ఉన్న ఐఫోన్ లేదంటే ఇతర బ్రాండ్లకు పోటీగా శాంసంగ్ తమ ధరలను భారీగా తగ్గించింది. అయితే ఇలాంటి ఆఫర్లు చాలా అరుదుగా వస్తుంటాయి. ప్లాట్‌ఫారమ్ ప్రమోషన్లు లేదంటే బ్యాంక్ పార్టనర్‌షిప్స్ ఉన్నప్పుడే ఇవి అందుబాటులో ఉంటాయి. పండగ సీజన్, సేల్ అయిపోగానే రేట్లు మళ్లీ పెరిగిపోతాయి. అందుకే.. మీరు పాత ఫోన్ మార్చి ఒక మంచి ప్రీమియం శాంసంగ్ ఫోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. అస్సలు ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఆర్డర్ పెట్టేయడం మంచిది.
Also Read: 165Hz డిస్‌ప్లే, డైమెన్సిటీ 9500 చిప్‌సెట్.. వన్‌ప్లస్ నుంచి పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్ వచ్చేస్తోంది!