Xiaomi 17T: ప్రముఖ షియోమీ సంస్థ తమ పాపులర్ 17 సిరీస్‌ను మరింత విస్తరిస్తూ షియోమీ 17Tను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మార్కెట్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ హ్యాండ్ సెట్ మే 28న గ్లోబల్‌గా విడుదల కానుంది. ఇక ఇండియన్ యూజర్స్ కోసం జూన్ 4వ తేదీన గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడీ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
ఈ Xiaomi 17T ప్రీమియం లుక్‌తో రానుంది. దీనిలో 1.5K రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.59 ఇంచుల AMOLED డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది. దీనివల్ల గేమింగ్ ఆడేవారికి, వీడియోలు ఎక్కువగా చూసేవారికి స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌తో పాటు వెనుకవైపు సరికొత్త కెమెరా మాడ్యూల్‌తో ఈ ఫోన్ ఆకట్టుకోనుంది.
ఫొటోగ్రఫీకి షియోమీ ఎప్పుడూ ఇచ్చే ప్రాధాన్యత తెలిసిందే. ఈ ఫోన్‌లో కూడా ప్రముఖ కెమెరా బ్రాండ్ లైకా భాగస్వామ్యంతో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను ఇస్తున్నారు. ఇందులో రెండు 50MP కెమెరాలతో పాటు ఒక 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరాను కేటాయించనున్నారు.
Also Read: హోమ్ థియేటర్ రేంజ్ సౌండ్.. బ్లౌపంక్ట్ కొత్త వైర్‌లెస్ స్పీకర్ల స్పెషాలిటీ ఇదే!
మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్‌ను తట్టుకునేలా Xiaomi 17Tలో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌ను ఉపయోగించబోతున్నారు. అలాగే సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS సాఫ్ట్‌వేర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. దీనివల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ చాలా వేగంగా, స్మూత్‌గా సాగుతుంది.
ఈ ఫోన్ ప్రత్యేకతల్లో చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ గురించే. ఏకంగా 6500mAh భారీ బ్యాటరీని దీనిలో అమర్చనున్నారు. అడ్వాన్స్‌డ్ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వాడటం వల్ల ఫోన్ బరువు పెరగకుండా ఎక్కువ బ్యాకప్ ఇస్తుంది. దీనికి తోడు IP68 వాటర్‌ప్రూఫ్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ ఉండటం వల్ల నీటిలో పడినా, వర్షంలో తడిసినా ఫోన్‌కు ఎలాంటి ముప్పు ఉండదు.
Also Read: జస్ట్.. రూ.51కే అన్‌లిమిటెడ్ కాల్స్, 60GB డేటా.. BSNL యూజర్ల కోసం అదిరిపోయే ఫ్రీడమ్ ప్లాన్!