Motorola Edge 70: మోటరోలా తన కొత్త ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 70ను భారత మార్కెట్‌లో సేల్‌కు తీసుకువచ్చింది. కేవలం 5.99 మిమీ మందంతో ఇది మోటరోలా నుంచి వచ్చిన అత్యంత సన్నని ఫోన్‌గా నిలుస్తోంది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను బ్రాంజ్ గ్రీన్, గాడ్జెట్ గ్రే, లిల్లీ ప్యాడ్ అనే మూడు పాంటోన్ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేశారు.
మోటరోలా ఎడ్జ్ 70 ఫోన్ ధరను రూ.29,999గా నిర్ణయించినప్పటికీ.. లాంచ్ ఆఫర్లతో తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బ్యాంక్ డిస్కౌంట్‌తో ధర రూ.28,999కి తగ్గుతుంది. అదనంగా యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డులపై రూ.750, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 5% వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.15,000 వరకు అదనపు తగ్గింపు కూడా అందిస్తున్నారు.
ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ ఉన్నాయి. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో స్క్రీన్ స్పష్టత బాగా కనిపిస్తుంది. పనితీరుకు స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, 8GB RAM 256GB స్టోరేజ్ అందించారు.
ఇక కెమెరా సెక్షన్‌లో 50MP OIS ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్/మాక్రో సెన్సార్, ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5000mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. IP68, IP69 రేటింగ్‌లు, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UIతో Motorola Edge 70 ఈ సెగ్మెంట్‌లో బలమైన ఎంపికగా కనిపిస్తోంది.