E-Paper
Advertisement

Sircilla district: సెల్ టవర్ ఎక్కి యువకుడు నిరసన.. వీడియో వైరల్

Sircilla district: సెల్ టవర్ ఎక్కి యువకుడు నిరసన.. వీడియో వైరల్
Advertisement

Sircilla district: రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భూమి వివాదం నేపథ్యంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కర్ల రవి అనే యువకుడు గ్రామ శివారులో ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది.

 తనకు భూమిని విక్రయించిన వ్యక్తి రిజిస్ట్రేషన్ విషయంలో మోసం చేశాడని ఆరోపించాడు. భూమి కొనుగోలు సమయంలో అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని నమ్మించి విక్రయం చేసినట్లు, తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ఆయన వాపోయాడు. ఈ విషయమై సంబంధిత అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సమస్యను తక్షణమే పరిష్కరించాలంటూ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్లు రవి చెప్పాడు.

Advertisement

సెల్‌టవర్‌పై యువకుడు ఉన్నట్లు సమాచారం అందుకున్న వెంటనే ఇల్లంతకుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి యువకుడితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అతడిని శాంతింపజేస్తూ, సమస్యను చట్టపరంగా పరిష్కరించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. పలువురు గంటల పాటు జరిగిన చర్చల అనంతరం రవిని సురక్షితంగా కిందకు దింపారు.

పోలీసులు మాట్లాడుతూ..  ఇలాంటి సమస్యలకు ఆందోళనకర చర్యలు తీసుకోవడం సరైన మార్గం కాదని, చట్టపరమైన విధానాల ద్వారా పరిష్కారం పొందవచ్చని తెలిపారు. రవి ఫిర్యాదును సంబంధిత శాఖలకు పంపించి, భూమి లావాదేవీలపై విచారణ చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ ఘటనతో గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత శాంతించింది.

Advertisement

ALSO READ:Rangareddy district: సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదని తిట్టాడు.. మనస్థాపంతో ఉరేసుకుని సూసైడ్

Related News

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

Big Stories

Advertisement
×