E-Paper
Advertisement

Chanakyaniti: పాము కంటే ప్రమాదకరమైన మనుషులు.. చాణక్యుడి ప్రకారం వీరు చాలా డేంజర్

Chanakyaniti: పాము కంటే ప్రమాదకరమైన మనుషులు.. చాణక్యుడి ప్రకారం వీరు చాలా డేంజర్
Advertisement

Chanakyaniti: చాణక్యుడి ‘నీతి శాస్త్రం’ మనిషి జీవితానికి.. ముఖ్యంగా సమాజంలో ఎవరితో ఎలా ఉండాలో నేర్పే ఒక అద్భుతమైన మార్గదర్శి. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మనం ఎవరిని నమ్మాలో తెలియడం ఎంత ముఖ్యమో, ఎవరిని అస్సలు నమ్మకూడదో తెలుసుకోవడం అంతకంటే ముఖ్యం. పొరపాటున తప్పుడు వ్యక్తులను నమ్మితే.. అది మన పతనానికి దారితీస్తుందని చాణక్యుడు హెచ్చరించారు.

Advertisement

చాణక్యుడి ప్రకారం.. ఈ 5 రకాల వ్యక్తులను ఎప్పటికీ నమ్మకూడదు:

1. ఆయుధాలు వాడే వారు :

Advertisement

ఆయుధాలు చేతిలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ ప్రమాదకరమే. కోపంలోనో లేదా పొరపాటునో వారు ఆ ఆయుధాన్ని వాడితే ఎదుటివారి ప్రాణాలకే ముప్పు కలిగే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి వ్యక్తుల మనస్తత్వం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. కాబట్టి.. ఆయుధాలు ఉన్నవారితో ఎంత తక్కువ స్నేహం ఉంటే అంత మంచిది.

2. ప్రమాదకరమైన మనుషులు:

ఇది జంతువులకే కాకుండా.. అలాంటి క్రూర స్వభావం ఉన్న మనుషులకు కూడా వర్తిస్తుంది. క్రూర జంతువులు ఎప్పుడు దాడి చేస్తాయో ఊహించడం అసాధ్యం. అలాగే.. లోపల క్రూరత్వం పెట్టుకుని బయటకు మంచిగా నటించే వ్యక్తులను కూడా నమ్మకూడదు. వారు తమ స్వార్థం కోసం ఎదుటివారిని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టవచ్చు.

3. ప్రవహించే నదులు:

నదులు చూడటానికి ప్రశాంతంగా ఉన్నా.. వాటి లోతు, ప్రవాహ వేగాన్ని తక్కువ అంచనా వేయకూడదు. వరదలు వచ్చినప్పుడు నదులు దారి మారుస్తాయి. ఒడ్డును ముంచెత్తుతాయి. అలాగే..నిలకడ లేని మనస్తత్వం ఉన్న వ్యక్తులు, తరచూ మాట మార్చేవారు నదుల వంటివారే. అలాంటి వారిపై ఆధారపడితే.. ఆపద సమయంలో వారు మనల్ని వదిలేసే అవకాశం ఉంది.

4. రాజ కుటుంబీకులు లేదా అధికారం ఉన్నవారు:

అధికారంలో ఉన్నవారితో స్నేహం బాగున్నంత సేపు లాభదాయకంగా అనిపించవచ్చు. కానీ.. వారికి తమ స్వార్థం లేదా పదవి ముఖ్యం. అధికారం తలకెక్కినప్పుడు వారు తమ స్నేహితులను కూడా శత్రువులుగా చూడవచ్చు. వారి కోపానికి గురైతే కోలుకోవడం కష్టం. అందుకే అధికార బలంతో విర్రవీగే వారిని గుడ్డిగా నమ్మకూడదని చాణక్యుడు చెప్పాడు.

5. స్వార్థపరులు:

ఎల్లప్పుడూ తన గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి ఎన్నటికీ నమ్మకమైన మిత్రుడు కాలేడు. తన లాభం కోసం మీ రహస్యాలను ఇతరులకు చెప్పడానికి కూడా వీరు వెనుకాడరు. పాముకు పాలు పోసినా అది విషమే ఇస్తుంది. అలాగే దుష్టులకు ఎంత మేలు చేసినా వారు సమయం వచ్చినప్పుడు వెన్నుపోటు పొడుస్తారు.

Also Read: ఎవరు వదిలి వెళ్ళినా తట్టుకోలేకపోతున్నారా? దీని వెనక ఉన్న అసలు కారణాలు ఇవే !

మనల్ని మనం కాపాడుకోవడం ఎలా?

చాణక్యుడి సూత్రాల ప్రకారం.. వివేకవంతుడైన వ్యక్తి ఎప్పుడూ ఎదుటివారి మాటల కంటే వారి ప్రవర్తనను గమనిస్తాడు.

పరీక్షించాలి: ఎవరికైనా పెద్ద బాధ్యత అప్పగించే ముందు వారిని చిన్న విషయాల్లో పరీక్షించాలి.

దూరం పాటించాలి: పైన చెప్పిన లక్షణాలు ఉన్న వ్యక్తులతో గొడవలు పెట్టుకోకుండా.. మర్యాదపూర్వకంగా దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

లోకంలో అందరూ మంచివారు కారు, అందరూ చెడ్డవారు కారు. కానీ ఎవరిని నమ్మాలో తెలియకపోతే జీవితం కష్టాల పాలవుతుంది. చాణక్యుడి ఈ హెచ్చరికలు మనల్ని మనం రక్షించుకోవడానికి, సరైన వ్యక్తులతో బంధాలను పటిష్టం చేసుకోవడానికి సహాయపడతాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×