E-Paper
Advertisement

Motorola Smart AC: మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఏసీ లాంచ్.. ఇన్‌స్టాలేషన్, కాపర్ వైర్, స్టాండ్ అన్నీ ఫ్రీ

Motorola Smart AC: మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఏసీ లాంచ్.. ఇన్‌స్టాలేషన్, కాపర్ వైర్, స్టాండ్ అన్నీ ఫ్రీ
Advertisement

Motorola Smart AC| మార్చి నెల వచ్చేసింది. దీంతో వేసవి ఎండలు కూడా తీవ్రమవుతున్నాయి. రానున్నరోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలో ఇంట్లో లేదా ఆఫీసు కోసం చాలామంది ఏసీ కొనాలనుకుంటారు. మీరు కూడా కొత్త ఎసీ కొనాలనుకుంటున్నట్లయితే ఒక్క నిమిషం ఆగండి. మోటోరోలా కొత్త స్మార్ట్ ఎయిర్ కండిషనర్ల రేంజ్ భారత దేశంలో లాంచ్ చేసింది. అడ్వాన్స్ ఫీచర్లు ఉన్న ఈ ఎసీలు తక్కువ ధరలో లభిస్తున్నాయి.

కస్టమర్లను ఆకర్షించడానికి మోటోరోలా చాలా ఫ్రీ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఎసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏసీల ప్రారంభ ధర రూ.28,990. కొనుగోలుతో రూ.10,000 కంటే ఎక్కువ విలువైన బెనిఫిట్స్ ఉన్నాయి.

ప్రతి కొనుగోలుతో ఫ్రీ బెనిఫిట్స్

Advertisement

మోటోరోలా ఈ స్మార్ట్ ఎసీలతో చాలా ఫ్రీ సర్వీసులు ఇస్తోంది. ఇవి అదనపు ఖర్చులు తగ్గిస్తాయి. ఏసీ కొనుగోలు చేశాక కంపెనీ ఫ్రీ ఇన్‌స్టాలేషన్ ఇస్తుంది. ఫ్రీ అవుట్‌డోర్ యూనిట్ స్టాండ్, ఇన్‌స్టాలేషన్ సమయంలో కావాల్సిన కాపర్ వైర్ కూడా ఫ్రీగానే ఇస్తోంది. మూడు సంవత్సరాల పాటు ఫ్రీ గ్యాస్ ఫిల్లింగ్ సపోర్ట్ ఉంది. రూ.10,000 కంటే అధిక విలువ చేసే ఈ సర్వీసులు ఉచితంగా లభించడంతో మంచి సేవింగ్స్.

నాలుగు రకాల ఎసీ మోడల్స్

వివిధ రూమ్ సైజులు, ఎనర్జీ సేవింగ్ అవసరాలకు తగినట్లు మోటోరోలా నాలుగు ఏసీ మోడల్స్ లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం కొత్త ఏసీల ధరలు ఇలా ఉన్నాయి:

  • 1 టన్ ఏసీ 3 స్టార్ మోడల్ – రూ.28,990
  • 1.5 టన్ 3 స్టార్ మోడల్ – రూ.31,990
  • 1.5 టన్ 5 స్టార్ మోడల్ – రూ.36,990
  • 2 టన్ 3 స్టార్ మోడల్ – రూ.38,990
Advertisement

బ్యాంక్ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో ధర మరింత తగ్గుతుంది. పూర్తి ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

స్మార్ట్ ఫీచర్లతో మరింత సౌకర్యం

ఈ ఎసీలు అడ్వాన్స్ స్మార్ట్ ఫీచర్లు కలిగి ఉన్నాయి. Wi-Fi కనెక్షన్ ఉంది. స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కడి నుంచైనా ఎసీని కంట్రోల్ చేయవచ్చు. గంటకు టెంపరేచర్ సెట్టింగ్స్ షెడ్యూల్ చేయవచ్చు. ఇది కంఫర్ట్ ఇస్తూనే విద్యుత్ ఆదా చేస్తుంది. డ్రై మోడ్, ఎకో మోడ్, స్లీప్ మోడ్ వంటి వివిధ కూలింగ్ మోడ్స్ ఉన్నాయి.

Also Read: యూట్యూబ్‌లో అనవసర వీడియోలు మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయా? ఈ టిప్స్‌తో సమస్యకు చెక్

టర్బో మోడ్‌తో త్వరగా కూలింగ్

ఇందులో టర్బో కూల్ మోడ్ ఉంది. వేడి ఎక్కువగా ఉన్నా రూమ్ త్వరగా చల్లబడుతుంది. దాదాపు 20 నిమిషాల్లో రూమ్ కూల్ అవుతుంది. మధ్యాహ్న సమయంలో ఉష్ణ్రాగ్రతలు ఎక్కువగా ఉన్నా చల్లదనం త్వరగా కంఫర్ట్ ఇస్తుంది.

బలమైన డిజైన్, ఎక్కువ వారంటీ

ఇన్‌వర్టర్ టెక్నాలజీ ఉంది. రూమ్ టెంపరేచర్ ప్రకారం.. కంప్రెసర్ స్పీడ్ సర్దుబాటు అవుతుంది. 100 శాతం కాపర్ కండెన్సర్ ఉంది. ఇది ఎక్కువ కాలం పాటు బాగుంటుంది, కూలింగ్ మెరుగుపడుతుంది. యాంటీ-కరోషన్ కోటింగ్ ఉంది. సెల్ఫ్-క్లీనింగ్ టెక్నాలజీతో డస్ట్ తగ్గుతుంది, మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది.

వారంటీ సపోర్ట్

కంప్రెసర్‌పై 10 సంవత్సరాల వారంటీ ఉంది. ప్రొడక్ట్ మొత్తంపై 3 సంవత్సరాల కాంప్రహెన్సివ్ వారంటీ ఉంది. ఇది లాంగ్-టర్మ్ రిలయబిలిటీ ఇస్తుంది.

తక్కువ ధర, స్మార్ట్ ఫీచర్లతో మోటోరోలా ఈ వేసవిలో బడ్జెట్ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఫ్రీ ఇన్‌స్టాలేషన్, ఎక్స్‌ట్రా బెనిఫిట్స్‌తో మిగతా బ్రాండ్స్ కంటే మంచి  ఆప్షన్.

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×