E-Paper
Advertisement

Uttam Kumar Reddy: నిర్లక్ష్యం వద్దు.. వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తిచేయాలి: మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: నిర్లక్ష్యం వద్దు.. వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తిచేయాలి: మంత్రి ఉత్తమ్
Advertisement

Uttam Kumar Reddy: మట్టితో పేరుక పోయిన ప్రాజెక్టులలో రెండోదశ పూడిక తీత పనులకు సత్వరమే శ్రీకారం చుట్టాలని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు. వర్షాకాలానికి ముందే పూడికతీత పనులకు ఉపక్రమిస్తే వర్షాకాలంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మట్టితో పూడిపోయిన ప్రాజెక్టులలో నీటి సామర్ధ్యం పూర్తిగా పడి పోవడంతో జాతీయ స్థాయిలో ఇది ప్రధాన సమస్యగా పరిణమించిందన్నారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

నీటి సామర్ధ్యం తగ్గుదల..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఏర్పడ్డ ఈ సంక్షోభంనుంచి బయటపడి రైతాంగానికి నీటి భద్రత కల్పించేందుకు కేంద్రం జాతీయస్థాయిలో తీసుకొచ్చిన పూడిక తీత విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పూడిక తీత పనులకు అంకురార్పణ చుట్టిందన్నారు. చారిత్రాత్మక బాక్ర నంగల్ నుంచి తెలంగాణలో సుప్రసిద్ధ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriramsagar Project) వరకు మట్టితో పూడి పోయి నీటిసామర్ద్యం నిలువలు పడి పోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 120 టీఎంసీ ల సామర్ధ్యం నుంచి ఏకంగా 80 టీఎంసీ లకు పడిపోయిందని వివరించారు.

Advertisement

Also Read: Telangana Tourism: తెలంగాణ టూరిజంలో రసవత్తరంగా మారిన ఈడీ రాజకీయం..?

అవసరమైన నిధుల కోసం..

మట్టితో లేదా ఇసుక మేటలతో ప్రాజెక్టులు పడిపోయి నీటి సామర్ధ్యం నిలువలు ఘోరంగా పడిపోయి ఇది జాతీయ స్థాయి సమస్యగా పరిణమించినందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ముందుకు పోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే మొదటిదశ లో చేపట్టిన పూడిక తీత పనులు జాతీయస్థాయిలో పూడికతీతకై చేపట్టిన మార్గదర్శనంలొనే తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. పూడికతీత పనులకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు గాను ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రివర్గం ముందుంచి ఆమోదం తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఉండాల్సిన నీటి సామర్ధ్యం

Advertisement

ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న పూడిక తీత పనులను ఆయన ప్రస్తావిస్తూ పైలెట్ ప్రాజెక్ట్ కింద “కడెం” ప్రాజెక్టులో మొదటి దశ లో చెపట్టి న పూడిక తీత విజయవంతం అయ్యిందన్నారు. ఇక్కడ పూర్తిగా అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులలో ఉండాల్సిన నీటి సామర్ధ్యం నిలువలు.. వర్షాల ఉధృతికి వచ్చి చేరే నీటితో ఏర్పడ్డ నీటినిలువలు సమగ్రంగా అధ్యయనం జరిపి అంతిమ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్, ఇ.ఎన్.సి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Holi Beauty Care: హోలీకి ముందు ముఖానికి ఈ నూనె రాస్తే రంగులు చర్మానికి అతుక్కోవు

Related News

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

Big Stories

Advertisement
×