E-Paper
Advertisement

Motorola Razr Fold: మోటోరోలా బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్.. 6000mAh బ్యాటరీతో ప్రీమియం డివైజ్

Motorola Razr Fold: మోటోరోలా బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్.. 6000mAh బ్యాటరీతో ప్రీమియం డివైజ్
Advertisement

Motorola Razr Fold| స్పెయిన్ దేశంలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ ఈవెంట్‌లో మోటోరోలా తన కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రేజర్ ఫోల్డ్‌ విడుదల చేసింది. ఈ ఫోన్ మోటోరోలా బ్రాండ్‌లో మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసమే మోటోరోలా ఈ కొత్త ఫోల్డెబుల్ ఫోన్ తీసుకొచ్చింది. అదే సమయంలో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ కూడా ప్రదర్శించింది.

రేజర్ ఫోల్డ్ ధర, అందుబాటు

రేజర్ ఫోల్డ్ ధర 1,999 యూరోలు (భారత కరెన్సీలో రూ.2,14,600). ప్యాకేజీలో మోటో పెన్ అల్ట్రా కూడా ఉంటుంది. యూరప్‌లో త్వరలో సేల్స్ ప్రారంభమవుతాయి. ఆ తర్వాత నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్ మార్కెట్లలో లాంచ్ అవుతుంది. ప్యాంటోన్ లిలీ వైట్, ప్యాంటోన్ బ్లాకెన్డ్ బ్లూ వంటి కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఎడ్జ్ 70 ఫ్యూజన్ ధర ఇంకా ప్రకటించలేదు.

డిస్‌ప్లే ఫీచర్లు, ప్రొటెక్షన్

Advertisement

రేజర్ ఫోల్డ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. 6.6 ఇంచ్ LTPO pOLED కవర్ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1080* 2520 పిక్సెల్స్. 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 6000 నిట్స్ వరకు ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెరామిక్‌తో కవర్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంది. ఇన్నర్ డిస్‌ప్లే 8.1 ఇంచ్ సైజు, 2K రిజల్యూషన్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 6200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.

పెర్ఫామెన్స్, హార్డ్‌వేర్

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఫ్లాగ్‌షిప్ లెవల్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది. అడ్రెనో A829 GPU ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ స్మూత్‌గా జరుగుతాయి. పెద్ద 6000mAh బ్యాటరీ ఉంది. హెవీ యూజర్లు, ట్రావెలర్లు ఎక్కువ సమయం ఫోన్ యూజ్ చేసినా బ్యాటరీ రన్ అవుతుంది. ఫోల్డెబుల్ ఫోన్స్ ఇంత పెద్ద బ్యాటరీ లభించడం అరుదు.

కెమెరా సెటప్, వీడియో రికార్డింగ్

Advertisement

ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ప్రైమరీ కెమెరా 50MP సోనీ LYTIA సెన్సార్. 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉంది. ఔటర్ డిస్‌ప్లేలో 32MP సెల్ఫీ కెమెరా, ఇన్నర్ డిస్‌ప్లేలో 20MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రియర్ కెమెరాలు 8K వీడియోను 30fpsలో, 4K వీడియోను 60fpsలో రికార్డ్ చేస్తాయి.

కనెక్టివిటీ, సెన్సార్లు

5G కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. Wi-Fi, NFC, GPS, బైడౌ, నావిక్ సపోర్ట్ ఉన్నాయి. USB Type-C పోర్ట్ ఉంది. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ఈ-కంపాస్, బ్యారోమీటర్ వంటి సెన్సార్లు ఉన్నాయి.

Also Read: ఇక 50 శాతం కరెంట్ బిల్లు ఆదా.. టాప్ రేటెడ్ 9kg వాషింగ్ మెషీన్లపై భారీ తగ్గింపు

డిజైన్, సైజు, బరువు

ఫోల్డ్ అయినప్పుడు సైజు 160.05*73.6*10.04 mm. అన్‌ఫోల్డ్ అయినప్పుడు 144.47*160.05*4.7 mm. బరువు సుమారు 243 గ్రాములు. సన్నగా, ప్రీమియం ఫీల్ ఇస్తుంది. పోర్టబిలిటీ మంచిగా ఉంటుంది.

ఫోల్డబుల్ ఫోన్స్ మార్కెట్‌లో మోటోరోలా రేజర్ ఫోల్డ్ బలమైన ఎంట్రీ ఇచ్చింది. మంచి పెర్ఫామెన్స్, బ్రైట్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ కెమెరాలతో ప్రీమియం సెగ్మెంట్‌లో బలంగా పోటీ పడుతోంది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×