E-Paper
Advertisement

Ahmed Shehzad: పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు సిగ్గు, శ‌రం లేదు..ఏదో ఒక రోజు రాళ్ల‌తో ప్ర‌జ‌లే కొడ‌తారు !

Ahmed Shehzad: పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు సిగ్గు, శ‌రం లేదు..ఏదో ఒక రోజు రాళ్ల‌తో ప్ర‌జ‌లే కొడ‌తారు !
Advertisement

Ahmed Shehzad:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లు చెత్త ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. దీంతో సూపర్ 8 దశలో పాకిస్తాన్ వెను జరిగింది. శ్రీలంకను తక్కువ పరుగులకు కట్టడి చేయలేక విఫలమైన పాకిస్తాన్, సెమీ ఫైనల్ చేరకుండా ఇంటిదారి పట్టింది. అయితే పాకిస్తాన్ ఇంటిదారి పట్టిన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షహజాద్ ( Ahmed Shehzad ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్లేయర్లకు (pakistan ) సిగ్గు, శరం లేదని విమర్శలు చేశారు. వీళ్లను రాళ్లతో కొట్టిన తప్పు లేదని ఓ టీవీ డిబేట్లో వ్యాఖ్యానించారు మాజీ ఓపెనర్ అహ్మద్ షహజాద్. ఓడిపోతే పాకిస్తాన్ ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తార‌న్న భ‌యంతో లేద‌ని విమ‌ర్శ‌లు చేశారు. ఏదో ఒక రోజు రాళ్ల‌తో ప్ర‌జ‌లే కొడ‌తారని హెచ్చ‌రించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: T20 World Cup Semi Final Schedule: మార్చి 4 నుంచే సెమీస్ రేస్‌..టీమిండియా షెడ్యూల్ ఇదే, వ‌ర్షం ప‌డితే ఎలా

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు సిగ్గు, శ‌రం లేదు

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) పాకిస్తాన్ వైఫల్యం పై ఆ జట్టు మాజీ ఓపెనర్ అహ్మద్ షహజాద్ ( ( Ahmed Shehzad )) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పాకిస్తాన్ ప్లేయర్లకు కొంచెం కూడా భయం లేదని ఫైర్ అయ్యారు. ఒక టోర్నమెంటులో ఓడిపోతే పాకిస్తాన్ ప్రజలు తిరగబడి కొడతారన్న భయం లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు. తాను పాకిస్తాన్ జట్టులో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మ్యాచ్ ఆడే వాళ్ళమని గుర్తు చేశాడు. చిన్న సిరీస్ ఓడిపోయిన కూడా ఎయిర్ పోర్టుకు వచ్చి అభిమానులు తిరగబడతారని భయపడే వాళ్ళమని వెల్లడించారు. దాంతో ప్లేయర్ల అందరం విడివిడిగా విడిపోయి సాయంత్రం కొంతమంది, వేకువ జామున 6 గంటలకు మరి కొంతమంది పాకిస్తాన్ చేరుకునే వాళ్ళమని తెలిపాడు. కానీ ఇప్పటి పాకిస్తాన్ ప్లేయర్లు ( Pakistan Players) ఇండియా చేతిలో ఓడిపోయిన కూడా సిగ్గు, శరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌పై భారీ ఫైన్ విధించేందుకు రంగం సిద్ధం

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో చెత్త ప్రదర్శన ఘనపరిచిన పాకిస్తాన్ ప్లేయర్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా ఇండియా చేతిలో ఓడిపోయినందుకు గాను ఒక్కో ప్లేయర్ 50 లక్షల రూపాయలు బోర్డుకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అలాగే చాలామంది సీనియర్ ప్లేయర్లపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. కెప్టెన్ సల్మాన్ అలీ తన బాధ్యతలనుంచి కూడా తప్పుకునేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. బాబర్ ఆజంను టెస్టులకే పరిమితం చేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇంకా చాలా కఠినమైన నిర్ణయాలు అమలు చేసేందుకు అత్యవసర సమావేశం కూడా ఈ వారంలో నిర్వహించబోతోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Advertisement

Also Read: Kris Srikkanth: ఈ ఒక్క వెధ‌వ స్వార్థం వ‌ల్లే, వెస్టిండీస్ సంక నాకి పోయింది…మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×