Motorola Signature Series: మోటరోలా తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత బలపరచేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే భారత మార్కెట్‌లోకి Motorola Signature Series పేరుతో కొత్త ఫ్లాగ్‌షిప్ డివైస్‌ను తీసుకురానుంది. ఇది మోటరోలా ఎడ్జ్ 70 అల్ట్రాకు సమానమైన లేదా రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యే అవకాశముందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో Signature Class Coming Soon అనే ట్యాగ్‌తో ప్రత్యేక మైక్రోసైట్ లైవ్ కావడం ఈ హైప్‌ను మరింత పెంచింది.
మోటరోలా అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026 జనవరి 7న భారత మార్కెట్‌లో Signature సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఇది Motorola Edge 70 Ultraకి రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యే అవకాశం ఉందని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే మోడల్స్, వేరియంట్స్‌పై ఇంకా స్పష్టత లేదు. లాంచ్ అనంతరం ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా స్టోర్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో అమ్మకాలు జరగనున్నాయి.
Also Read: బడ్జెట్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.వెయ్యి లోపే Ai+ నోవాపాడ్స్ హెల్త్ ట్రాకింగ్ ఇయర్‌బడ్స్!
ఈ సిరీస్‌ను ఫుల్ ప్రీమియం సెగ్మెంట్‌లో తీసుకురావాలని మోటరోలా ప్లాన్ చేస్తోంది. ఇందులో 6.7 ఇంచుల 1.5K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్‌తో పవర్‌ఫుల్ పనితీరు అందించనుందని సమాచారం. అలాగే IP68/IP69 వాటర్ రెసిస్టెన్స్, MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, Android 16 సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మోటరోలా సిగ్నేచర్ సిరీస్‌లో స్టైలస్ సపోర్ట్ ఉండటం వల్ల ఇది హైఎండ్ ప్రొడక్టివిటీ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఇక ఫొటోగ్రఫీ పరంగా చూసుకుంటే.. ఈ ఫోన్‌లో 50MP సోనీ లైటియా సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. OIS సపోర్ట్‌తో పాటు పెరిస్కోప్ లెన్స్ ఉండటం ప్రధాన హైలైట్. ఒకపోతే మోటరోలా సిగ్నేచర్ సిరీస్ ధర విషయానికి వస్తే.. ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. అయితే, Edge 50 Ultra ధరను బట్టి చూస్తే.. సుమారు రూ.60,000 ధర ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.