E-Paper
Advertisement

NASA Spots Super Earth: అదిగో సూపర్ ఎర్త్..!

NASA Spots Super Earth: అదిగో సూపర్ ఎర్త్..!
Advertisement
today's news in telugu

NASA Spots Super Earth(Today’s news in telugu): మన భూగోళం కన్నా 30-70% పెద్దగా ఉన్న సూపర్‌ఎర్త్‌ను నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మరో సౌరవ్యవస్థలో ఆ గ్రహం ఉందట. దానిని TOI-715 b గా వ్యవహరిస్తున్నారు.

భూమిలాగే ఓ నక్షత్రం చుట్టూ అది పరిభ్రమిస్తోంది. అంత సుదూరాన ఉన్న ఆ గ్రహంపై నీరు ఉండటానికి అవసరమైన క‌చ్చిత ఉష్ణోగ్రతలు ఉన్నాయని నాసా చెబుతోంది. అయితే అదొక్కటే కాకుండా.. ఉపరితలంపైజలం ఉండాలంటే మరెన్నో కారణాలు దోహదపడతాయి. వాటిలో వాతావరణం ఒకటి.

Advertisement

Read More: Whatsapp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్.. ఇకపై ఏ యాప్‌కైనా మెసేజ్ పంపొచ్చు!

తాను తిరిగే నక్షత్రానికి ఆ సూపర్ ఎర్త్ 19 రోజులు మాత్రమే దగ్గరగా పరిభ్రమిస్తున్నట్టు గుర్తించారు. అదీ గాక ఆ నక్షత్రం మన సూర్యుడితో పోలిస్తే.. అంత వేడిగా లేదు. పెద్దది కూడా కాదు. అంటే సూపర్ ఎర్త్‌పై వాతావరణం మన కన్నా భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. కొత్తగా కనుగొన్న ఈ భూగ్రహం గురించి వివరాలు రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీలో ప్రచురితమయ్యాయి.

Advertisement

అయితే గోల్డీలాక్స్ రీజియన్.. అంటే ఆవాసయోగ్య ప్రాంతంలోనే సూపర్‌ఎర్త్ పరిభ్రమిస్తున్నట్టు నాసా చెబుతోంది. భూవాతావరణం ఉన్న ఇలాంటి గ్రహాల కోసమే శాస్త్రవేత్తలు దీర్ఘకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. టాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్(TESS) ఈ గ్రహాల కదలికలను గమనిస్తుంటుంది. తాజాగా సూపర్ ఎర్త్ ఉనికి కూడా అలాగే వెలుగులోకి వచ్చింది. TOI-715 b గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మరింత నిశితంగాపరిశీలించి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో నాసా శాస్త్రవేత్తలు ఉన్నారు.

భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్ల దూరంలో రోదసిలో ఉన్న ఈ టెలిస్కోప్ ద్వారా ఎక్సో ప్లానెట్లను ఆవరించి ఉన్న వాతావరణాన్ని, అక్కడి స్థితిగతులను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి వీలుంటుంది.

Tags

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×