E-Paper
Advertisement

Whatsapp New Feature: వాట్సప్ సంచలనం.. ఏ యాప్‌కైనా మెసేజ్ పంపొచ్చు!

Whatsapp New Feature: వాట్సప్ సంచలనం.. ఏ యాప్‌కైనా మెసేజ్ పంపొచ్చు!
Advertisement
new technology updates

Send Message to Any App from Whatsapp(New technology updates): ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. తమ యూజర్ల సేఫ్టీ, అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో సరికొత్త అనుభూతిని కలిగించేందుకు తరచూ పనిచేస్తూ ఉంటుంది. తద్వారా ఈ యాప్ యూజర్లకు దీన్ని వినియోగించడం మరింత సులభతరం అవుతుంది. ఇప్పటికే ఎన్నో రకాల కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా మరొక కొత్త ఫీచర్‌పై పనిచేస్తుంది.

ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వాట్సాప్ నుంచి థర్డ్ పార్టీ యాప్‌లతో నేరుగా చాటింగ్ చేసే వీలు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ థర్డ్ పార్టీ యాప్‌లతో ఛాటింగ్ ఫీచర్‌పై వర్క్ చేస్తోంది. ఇక ఈ వర్క్ పూర్తయిన తర్వాత యూజర్లు వాట్సాప్ నుండే ఏదైనా యాప్‌కి మెసేజ్‌లు చేయగలుగుతారు.

Advertisement

కాగా ఈ ఫీచర్‌ను మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురావచ్చని సోషల్ మీడియాలో వార్తలు సాగుతున్నాయి. ఈ మేరకు దీనికి సంబంధించిన విషయాలపై వాట్సాప్ ఇంజనీరింగ్ డైరెక్టర్ డిక్ బ్రోబర్ కొన్ని విషయాలను పంచుకున్నారు. వాట్సాప్ తన 200 కోట్ల మంది వినియోగదారులకు థర్డ్ పార్టీ యాప్‌లతో ఛాటింగ్ చేసే అవకాశాన్ని కల్పించడానికి ఇంటర్ఆపరబిలిటీని అందించడానికి రెడీగా ఉందని అన్నారు.

READ MORE: WhatsApp New Feature : వాట్సాప్ కొత్త ఫీచర్.. అలాంటి కాల్స్ మ్యూట్..

Advertisement

అంతేకాకుండా వాట్సాప్ ప్రైవసీ, సెక్యూరిటీ, యూనిటీని దృష్టిలో పెట్టుకుని ఈ థర్డ్ పార్టీ యాప్‌లకు ఇంటర్ఆపరబిలిటీని అందిస్తున్నట్లు డిక్ బ్రోబర్ పేర్కొన్నారు. అయితే ఈ ఫీచర్ టెలిగ్రామ్‌కి సపోర్ట్ చేస్తుందా? లేదా అని కొందరు చర్చించుకుంటున్నారు.

వాట్సాప్ తర్వాత అతి పెద్ద మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్. ఈ రెండు యాప్‌లకు మంచి పోటీ ఉంది. వాట్సాప్‌లో లేని కొన్ని ఫీచర్లను వినియోగదారులు టెలిగ్రామ్‌లో పొందుతారు. అలాంటి సమయంలో టెలిగ్రామ్, వాట్సాప్ వినియోగదారులు ఈ రెండు యాప్‌ల ద్వారా ఒకరికొకరు ఛాటింగ్ చేయడం ప్రారంభిస్తే అది నిజంగా అద్భుతమే చెప్పాలి. అయితే ఇంకా దీనిపై పూర్తి సమాచారం లేదు.

READ MORE: WhatsApp Scam:- ఇంటర్నేషనల్ నెంబర్లతో వాట్సాప్ కాల్స్.. తస్మాత్ జాగ్రత్త..!

అయితే మెటా.. ఫేస్‌బుక్ మెసెంజర్, ఇతర ఛాటింగ్ యాప్‌లకు మద్దతుని ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే ఈ ఫీచర్ వర్కింగ్‌లోకి వచ్చిన తర్వాత టెక్స్ట్ మెసెంజింగ్, వాయిస్ మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు, ఫైల్స్ ట్రాన్సఫర్ చేయడం వంటి వాటిని వినియోగదారులు ఉపయోగించగలుగుతారు. కానీ, ప్రస్తుతం వాట్సాప్ యూజర్లు.. ఇతర యాప్‌ల వినియోగదారులతో గ్రూప్ ఛాట్ లేదా కాల్ చేయలేరు. ఈ ఫీచర్‌ను త్వరలో యాడ్ చేయనున్నారు.

Related News

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

రూ.లక్షలు పెట్టి ఏఐ ఫోన్ కొనాలా? లేక సాధారణ ఫోనే బెటరా? రెండింటికీ తేడా ఇదే!

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఖాతాలో డబ్బులు మటాష్!

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

Big Stories

Advertisement
×