BigTV English

CM Revanth Reddy: టీఎస్ఆర్టీసీకి కొత్త బస్సులు.. ప్రారంభించిన సీఎం

CM Revanth Reddy: టీఎస్ఆర్టీసీకి కొత్త బస్సులు.. ప్రారంభించిన సీఎం
telangana today news

CM Revanth Reddy Inaugurated TSRTC New Buses(Telangana today news): హైదరాబాద్ లో బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 100 బస్సులను పల్లె వెలుగు , ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులు ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం కోసం 90 ఎక్స్‌ప్రెస్ బస్సులు వినియోగిస్తారు. హైదరాబాద్‌-శ్రీశైలం రూట్‌లో తొలిసారిగా 10 ఏసీ రాజధాని సర్వీసులు నడుస్తాయి.


గత ప్రభుత్వం కార్మిక సంఘాలను రద్ద చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలేదన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మిలు గద్దె దించేశారని తెలిపారు. మహాలక్ష్మి పథకం కోసం 1300 బస్సులు అందుబాటులోకి తీసుకొస్తుమన్నారు. ఆర్టీసీ కార్మికుల రూ. 280 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు.

Read More: ‘అబద్దాల బడ్జెట్ కాదు.. మాది వాస్తవిక బడ్జెట్’


దేశానికి ఆదర్శంగా ఉండేలా పాలన చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించామన్నారు. తెలంగాణ మోడల్ పాలన దేశానికి ఆదర్శకంగా మారుతుందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ వస్తే.. తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేశారని తెలిపారు. ఆ సమయంలో 36 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారని వివరించారు.

CM Revanth Reddy latest news

సమ్మెకు దిగారని ఆర్టీసీ కార్మికుల సంఘాలను సీఎం రద్దు చేశారని మండిపడ్డారు. 15 కోట్ల 21 లక్షల మంది మహిళా ప్రయాణికుల టిక్కెట్ ఖర్చలను ప్రభుత్వం చెల్లించింది. రూ. 535 కోట్ల చెక్కును సీఎం.. ఆర్టీసీ యాజమాన్యానికి అందించారు.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×