E-Paper
Advertisement

Sea Map: సముద్రంలోని నీరంతా ఇంకిపోతే.. ఇదిగో NASA రిలీజ్ చేసిన ఈ సీ-మ్యాప్ చూడండి

Sea Map: సముద్రంలోని నీరంతా ఇంకిపోతే.. ఇదిగో NASA రిలీజ్ చేసిన ఈ సీ-మ్యాప్ చూడండి
Advertisement

మన భూమిలో 70 శాతం నీటిలోనే మునిగి ఉంటుంది. మిగతా 30 శాతం మాత్రమే నేల కనిపిస్తుంది. సముద్ర మట్టానికి ఎగువున ఉండే ప్రాంతాల్లో మాత్రమే మనము నివసించగలం. అయితే, ఒకప్పుడు భూమి శాతం కూడా ఎక్కువగానే ఉండేదట. కాలక్రమేనా సముద్ర మట్టాలు పెరుగుతున్న నేపథ్యంలో తీర ప్రాంతాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఉదాహరణకు మన దేశంలోని గుజరాత్ తీరంలోని ప్రాచీన ద్వారక నగరాన్నే చూడండి.. ఎలా సముద్రంలో కలిసిపోయిందో. అలాగే.. భవిష్యత్తులో మరెన్నో నగరాలు సముద్ర గర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అయితే, ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రమాదాన్ని ముందే పసిగడుతున్నాం. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇప్పుడు మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటక ఖండం కూడా కరగడం మొదలైంది. దానివల్ల సముద్ర మట్టాలు కూడా క్రమేనా పెరుగుతున్నాయి. అందుకే పరిశోధకులు సముద్రాలపై ఒక కన్నేసి ఉంచారు. దాని లోగుట్టు తెలుసుకొనేందుకు ఇటీవలే ఒక మ్యాప్ కూడా తయారు చేశారు.

సముద్రం.. ఒక మిస్టరీ ప్రపంచం

మన పరిశోధకులకు అంతరిక్షం గురించి తెలిసినంతగా సముద్ర రహస్యాలు గురించి తెలియదు. గాల్లోకి దూసుకెళ్లినంత ఈజీగా నీటి లోపలకి చేరుకోలేకపోతున్నారు. దీనికి కారణం అక్కడ ఉండే విభిన్న పరిస్థితులే. నీటి అడుగుకు వెళ్లే కొద్ది పరిస్థితులు మారిపోతాయి. యంత్రాలు సైతం మొరాయిస్తాయి. మన పరిశోధకులు అల్లంత దూరంలో ఉన్న చంద్రుడి మ్యాప్‌ను స్పష్టంగా తయారు చేయగలిగారు. మనకు కనిపించని చంద్రుడి అవతలి వైపు చిత్రాలను సైతం తీసుకోగలిగారు. కానీ, మన భూమి మీద ఉన్న సముద్రాల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోలేకపోతున్నారు. అందుకే.. సముద్రానికి కూడా ఒక మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు.

ఆ మ్యాప్‌లో ఏం ఉంటుంది?

Advertisement

2033 కల్లా సముద్రంలోని ప్రతి అంగుళం గురించి తెలిసేలా ఒక మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది నాసా. మన భూమి చుట్టూ తిరుగుతున్న SWOT అనే ఒక ఉప్రగహ్రం సాయంతోసముద్ర గర్భంలోని భూభాగం మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా ఈ ఉపగ్రహం నీటి అడుగున ఉండే లోయలు, శిఖరాలను గుర్తిస్తోంది. SWOT అందించిన డేటా మొత్తాన్ని ఉపయోగించి.. ఇప్పటికే ఒక సముద్ర గర్భపు పటాన్ని రూపొందించారు. ఇందులో ఊదా రంగు సముద్రంలో పల్లంగా ఉండే ప్రాంతాలను, ఆకు పచ్చ రంగు ఎత్తుగా ఉండే ప్రాంతాలను సూచిస్తోంది.

SWOT అంటే?

SWOT అంటే సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ అని అర్థం. నాసా, ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ CNES (సెంటర్ నేషనల్ డి’ఎట్యూడ్స్ స్పేషియల్స్)ల సహకారంతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేశారు. సాధారణంగా సోనార్ పరికరాల ద్వారా సముద్ర గర్భాన్ని అంచనా వేస్తుంటారు. ఆ పరికరాలను ఎక్కువగా నౌకలకు మాత్రమే అమర్చుతారు. అయితే స్వోట్ ఉపగ్రహంలో ఏర్పాటు చేసిన టెక్నాలజీ.. సోనార్ కంటే పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందని, సూక్ష్మమైన అంశాలను సైతం చిత్రీకరిస్తుందని నాసా పరిశోధకులు అంటున్నారు.

సముద్ర గర్భం మ్యాప్ వల్ల ఉపయోగం ఏమిటీ?

Advertisement

ఇప్పటి వరకు మనకు సముద్రం అడుగున ఏం ఉందో తెలీదు. కనుచూపు మేరలో మనకు నీళ్లు మాత్రమే కనిపిస్తాయి. అయితే, దాని కింద భూమి మీద ఉన్నట్లే పెద్ద పర్వతాలు, లోయలు ఉంటాయి. అయితే, అవి ఏయే ప్రాంతాల్లో ఏ విధంగా విస్తరించి ఉన్నాయనేది స్పష్టంగా తెలీదు. సముద్ర గర్భానికి సంబంధించిన మ్యాప్ సిద్ధమైతే.. నౌకాయానం, కమ్యునికేషన్ కేబుళ్లు, సముద్రంలో మైనింగ్ వంటివి సులభం అవుతాయి. సముద్ర ప్రవాహం తీరు, ఆటుపోట్లను అర్థం చేసుకోవచ్చు. సముద్రం లోతును అంచనా వేయొచ్చు. విపత్తులను ముందుగానే పసిగట్టి.. దాని వల్ల ఏయే ప్రాంతాలకు ప్రమాదం ఉండవచ్చనేది కచ్చితంగా తెలుసుకోవచ్చు.

ఈ SWOT ఉపగ్రహం ఎలా పనిచేస్తుంది?

ఈ మ్యాప్ ఇప్పటికిప్పుడు తయారు చేసింది కాదు. దీనికి బీజం 2022లోనే పడింది. కేవలం సముద్రగర్భాన్ని పరిశీలించే లక్ష్యంతోనే SWOT ఉపగ్రహాన్ని సిద్ధం చేశారు. దాన్ని 2022, డిసెంబర్ నెలలో ప్రయోగించారు. ఇది నిత్యం భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. 21 రోజుల్లో భూగోళంలోని 90 శాతం భాగాన్ని ఇది స్కాన్ చేయగలుగుతుంది. కేవలం సముద్రాలనే కాదు.. సరస్సులు, నదుల్లో నీటి మట్టాన్ని సైతం ఈ ఉపగ్రహం కొలుస్తుంది. 2024 నాటికే ఈ ఉపగ్రమం సముద్రగర్భాన్ని సంబంధించిన మ్యాప్‌ను తయారు చేసేసింది. ఒకప్పటి ఉపగ్రహాలు ఒక కిలోమీటరు కంటే ఎక్కువ ఎత్తు ఉండే సముద్ర పర్వతాలను మాత్రమే గుర్తించేవని, కానీ స్వోట్ మాత్రం దానిలో సగం కంటే తక్కువ ఎత్తు ఉన్న సముద్ర పర్వతాలను సైతం గుర్తించగలదని నాసా పరిశోధకులు చెబుతున్నారు. 2030 నాటికి ఓడలు వెళ్లేందుకు అనువైన మార్గాలను గుర్తించి మ్యాప్ రూపొందించాలనేది నాసా లక్ష్యం. అదిగానీ పూర్తయితే.. నౌకాయానం మరింత సులభం అవుతుంది. నాసా రూపొందించిన సముద్ర గర్భ మ్యాప్‌ను ఈ వీడియోలో చూడండి.

Also Read: సముద్రం అట్టడుగునా నల్ల రంగు గుడ్లు.. ఏంటా అని పరిశీలిస్తే..

Tags

Related News

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

Big Stories

Advertisement
×