E-Paper
Advertisement

Black Eggs: సముద్రం అట్టడుగునా నల్ల రంగు గుడ్లు.. ఏంటా అని పరిశీలిస్తే..

Black Eggs: సముద్రం అట్టడుగునా నల్ల రంగు గుడ్లు.. ఏంటా అని పరిశీలిస్తే..
Advertisement

మన పరిశోధకులు ఈ విశ్వంలోని అంతరిక్ష రహస్యాలను తెలుసుకోగలిగారే గానీ.. ఈ భూమిపైనే ఉన్న మహా సముద్రాల లోగుట్టును తెలుసుకోలేకపోయారు. బెర్ముడా ట్రయాంగిల్స్ నుంచి సముద్రంలోని అత్యంత లోతైన ప్రదేశంలో ఉండే చీకటి ప్రపంచంలో దాగిన రహస్యాలు ఇప్పటికీ మిస్టరీనే. ఇంకో విషయం ఏమిటంటే.. భూమి మీద ఉన్న జీవులతో పోల్చితే సముద్రంలో ఉండే జీవుల సంఖ్య చాలా ఎక్కువ. వాటి జాతులు, రకాలను లెక్కించడం అంత సులభమైన పని కాదు. ఇందులో ఏలియెన్స్ కూడా దాగి ఉండవచ్చనే కథలు కూడా చాలా ఉన్నాయ్. ఆ కథలు నిజమే అన్నట్లుగా తాజాగా ఓ వింత జీవిని కనిపెట్టారు మన పరిశోధకులు.

పసిఫిక్ లోతుల్లో నల్లని గుడ్లు

పరిశోధనల్లో భాగంగా ఇటీవల జపాన్‌‌లోని టోక్యో విశ్వవిద్యాలయం, హోక్కైడో విశ్వవిద్యాలయ పరిశోధకులు పసిఫిక్ మహా సముద్రంలో రోబెటిక్ డైవ్ ద్వారా పరిశోధనలు చేపట్టారు. దాదాపు 6,200 మీటర్లలో లోతులో వారికి అక్కడ ఓ పెద్ద రాతిని అంటుకుని ఉన్న నల్లని గుడ్లు కనిపించాయి. అవి చూసేందుకు చాలా వింతగా.. హాలీవుడ్ సినిమాల్లో చూపించే ఏలియన్ గుడ్లలో ఉన్నాయి. దీంతో ఆ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతంలో గుడ్లు ఉండటం అసాధ్యం. ఒక వేళ ఉన్నా.. అవి దేనివై ఉంటాయనే ప్రశ్నలు తలెత్తాయి.

ఆ గుడ్లలో ఏం ఉన్నాయ్?

Advertisement

సముద్రంలో కేవలం చేపలు మాత్రమే కాదు. గుడ్లు పెట్టే జాతులు ఇంకా చాలానే ఉన్నాయ్. దీంతో అవి దేని గుడ్లు అయ్యుండవచ్చనే సందేహం నెలకొంది. దీంతో రోబోటిక్ హ్యాండ్ ద్వారా వాటిలో ఒక గుడ్డును పగలగొట్టారు. ఆ సమయంలో అందులో నుంచి పాలలాంటి ద్రవం బయటకు వచ్చింది. దాని లోపల చిన్న జీవులు కనిపించాయి. అవన్నీ నీటిలో చెల్లాచెదురైపోయాయి. అయితే, అలాంటి జీవులను గతంలో ఎన్నడూ చూడకపోవడం వల్ల అవేమిటనేది అర్థం కాలేదు. అలాగే, వాళ్లు చూసినవి గుడ్లు కాదని.. గూళ్లని నిర్ధరించుకున్నారు.

ఏమిటా జీవులు?

ఆ నల్లని గుడ్లలాంటి గూళ్లలో కనిపించనవి ఇదివరకు ఎన్నడూ కనిపించని జీవులు. అవి ఫ్లాట్‌వార్మ్ తరహాలో ఉన్నాయి. సాధారణంగా ఫ్లాట్ వార్మ్‌లు రాళ్లకు అతుక్కుని ఉంటాయి. కానీ, గుడ్లు లాంటి గూళ్లలో కనిపించడం ఇదే తొలిసారి. సముద్రం అడుగున ఉండే పరిస్థితులకు తగినట్లుగా అవి అలా గూళ్లను నిర్మించుకొని ఉండవచ్చని పరిశోధకులు భావించారు. ఆ గూళ్ల నమూనాలు సేకరించి పరిశోధనలు చేపట్టారు. ముందుగా అవి సముద్రపు జీవులేనని, ఏలియెన్స్ కావని నిర్ధరించుకున్నారు.

Advertisement

Also Read: చచ్చి బతికి.. మరణం గురించి ఒక్క బొమ్మతో అంతా చెప్పేశాడు, దీని అర్థం ఇదే!

సుమారు 6 వేల మీటర్ల లోతులో వాటి జీవన విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గుడ్ల తరహాలో గోళాకారంలో ఉన్న ఆ గూళ్లు బండరాళ్లకు చాలా గట్టిగా అతుక్కుని ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. అయితే, అవి గుడ్లు కాదని.. ఫ్లా్ట్ వార్మ్‌ల ప్రత్యుత్పత్తి కేంద్రాలని పేర్కొన్నారు. పరిశోధనల్లో జరిపిన డీఎన్ఏ టెస్టుల్లో ఆ జీవులు ప్లాటిహెల్మింథెస్ ఫైలమ్‌ రకానికి చెందినవని, ఇప్పటి వరకు వర్ణించని కొత్త జాతి జీవులనని వివరించారు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×