E-Paper
Advertisement

ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్.. డిటాచబుల్ స్పీకర్లతో వచ్చిన.. పవర్‌ఫుల్ ప్రొజెక్టర్!

ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్.. డిటాచబుల్ స్పీకర్లతో వచ్చిన.. పవర్‌ఫుల్ ప్రొజెక్టర్!
Advertisement

Nebula P1 Projector: ప్రస్తుత రోజుల్లో ప్రొజెక్టర్ ఒక ముఖ్యమైన పరికరంగా మారిపోయింది. ఇంట్లోనే థియేటర్ రేంజ్ మూవీ ఎక్స్ పీరియన్స్ పొందేందుకు చాలా మంది వీటిని వినియోగిస్తున్నారు. అయితే ప్రొజెక్టర్స్ ను ఎక్కడికైనా తరలించేందుకు వీలుగా పొర్టబుల్ మోడల్స్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ‘Nebula P1’ ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా డిటాచబుల్ స్పీకర్లతో వచ్చింది. దీనికి సంబంధించిన ప్రధాన ఫీచర్లు, కొనడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

డిటాచబుల్ స్పీకర్లు

నెబులా పీ1 ప్రొజెక్టర్ హైలెట్ ఫీచర్ గా దీనిని చెప్పవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే రెండు స్పీకర్లను ప్రొజెక్టర్ నుండి విడదీసి మీకు కావలసిన చోట పెట్టుకోవచ్చు. ఇది 20W అవుట్‌పుట్‌తో నిజమైన 2.0 సరౌండ్ సౌండ్, డాల్బీ ఆడియో (Dolby Audio) అనుభూతిని అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ స్పీకర్లు 20 గంటల వరకు నాన్ స్టాప్ గా పనిచేస్తాయి.

Advertisement

ఫుల్ హెచ్‌డీ విజువల్స్

ఈ ప్రొజెక్టర్ 1080P ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్‌ కు సపోర్ట్ చేస్తుంది. 650 యాన్సీ ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌తో చీకటి గదుల్లో అద్భుతమైన, క్వాలిటీ విజువల్స్ ను ప్రదర్శిస్తుంది. ఈ ప్రొజెక్టర్ ద్వారా 180 అంగుళాల వరకూ స్క్రీన్ సైజ్ ను పెంచుకోవచ్చు.

130 డిగ్రీల గింబల్ స్టాండ్

Advertisement

ఈ ప్రొజెక్టర్ కు 130 డిగ్రీల వరకు బెండ్ చేయగల డ్యూయల్ ఆర్మ్ గింబల్ (Gimbal) ను అమర్చారు. దీనివల్ల ప్రొజెక్టర్ ను పెట్టేందుకు సెపరేట్ గా స్టాండ్ ను కొనాల్సిన పనిలేదు. గోడ, సీలింగ్ పైకి సులభంగా స్క్రీన్ ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.

గూగుల్ టీవీ సపోర్ట్

నెబులా పీ1 ప్రొజెక్టర్.. గూగుల్ టీవీ సపోర్ట్ తో వచ్చింది. గూగుల్ టీవీ ఇందులో ఇన్ బిల్ట్ గానే ఇచ్చారు. దీని సాయంతో నెట్‌ఫ్లిక్స్ (Netflix), యూట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి ద్వారా 4 లక్షల కంటే ఎక్కువ సినిమాలు, షోలను నేరుగా స్ట్రీమ్ చేయవచ్చు.

స్మార్ట్ అడ్జస్ట్‌మెంట్ టెక్నాలజీ

ఈ ప్రొజెక్టర్.. రియల్ టైమ్ ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ కరెక్షన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇవి ప్రొజెక్టర్‌ను ఎక్కడ పెట్టినా.. సెకన్ల వ్యవధిలోనే చిత్రాలను బ్లర్ లేకుండా క్లారిటీగా ప్రసారం చేసేందుకు సాయపడతాయి. ఇందులోని ‘ఆటో ఆబ్‌స్టాకిల్ ఎవాయిడెన్స్’ ఫీచర్.. స్క్రీన్ ముందు ఏదైనా అడ్డంకులు ఉంటే వెంటనే గుర్తించి ఇమేజ్ సైజ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసేస్తుంది.

Also Read: అయ్యబాబోయ్.. ఏసీ, టీవీ, మెుబైల్స్‌పై భారీ తగ్గింపు.. 60% తక్కువకే పట్టుకెళ్లొచ్చు..!

కొనడం వల్ల కలిగే లాభాలు?

నెబులా పీ1 ప్రొజెక్టర్.. డిటాచబుల్ స్పీకర్లతో వస్తున్నందున.. సౌండ్ మీ చుట్టూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది చాలా చిన్న సైజ్ లో ఉండటం వల్ల విహారయాత్రలకు, అవుట్‌డోర్ క్యాంపింగ్‌లకు ఈజీగా తీసుకెళ్లవచ్చు. ప్రొజెక్టర్ అవసరంలేని సందర్భాల్లో దీనిని బ్లూటూత్ స్పీకర్లుగా కూడా వాడుకోవచ్చు.

Also Read: రూ.80 లక్షల జీతం, అమెరికాలో ఇల్లు.. అయినా టెక్కీ జంట సూసైడ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×