E-Paper
Advertisement

రూ.80 లక్షల జీతం, అమెరికాలో ఇల్లు.. అయినా టెక్కీ జంట సూసైడ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

రూ.80 లక్షల జీతం, అమెరికాలో ఇల్లు.. అయినా టెక్కీ జంట సూసైడ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
Advertisement

Techie Couple Suicide: హైదరాబాద్ నుంచి వెళ్లి బెంగళూరులో సెటిల్ అయిన సాఫ్ట్ వేర్ జంట ఆత్మహత్య ఘటన ప్రస్తుతం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. రూ.80 లక్షల జీతం, అమెరికాలో ఇల్లు ఉన్నప్పటికీ వారు చనిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నగరంలోని కోతనూరు ప్రాంతంలో గల అపార్ట్ మెంట్ లో నిమిషాల వ్యవధిలోనే ఈ టెక్కీ జంట సూసైడ్ కు పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇంతకీ టెక్కీ జంట ఎలా చనిపోయింది? దర్యాప్తులో బయటపడ్డ నిజాలేంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

అసలేం జరిగిందంటే?

బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం (మార్చి 31) రోజున టెక్కీ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తొలుత భర్త భాను చందర్ (32) గదిలో ఆత్మహత్య చేసుకోగా.. భార్య షాజియా సిరాజ్ (31) కొద్దిసేపటి తర్వాత అపార్ట్ మెంట్ లోని 18వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.

భర్త మరణం తట్టుకోలేక..

Advertisement

పోలీసుల కథనం ప్రకారం.. షాజియా ఎప్పటిలాగే మార్చి 31వ తేదీ ఉదయం 7.30 గంటలకు నైట్ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వచ్చింది. కాలింగ్ బెల్ కొట్టగా.. భర్త నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది సాయంతో తలుపులు పగలగొట్టి.. లోపలికి వెళ్లి చూడగా భర్త భానుచందర్ గదిలో ఉరివేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించారు. బల్లపై సూసైడ్ నోట్ సైతం రాసి ప్రాణాలు విడిచారు.

కొద్దిసేపటికే భార్య సూసైడ్..

భర్త భాను చందర్ మరణంతో షాజియా తట్టుకోలేకపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. స్థానికులు అత్యవసర వైద్య సిబ్బందికి కాల్ చేస్తున్న సమయంలో భర్తను చూస్తూ ఆమె ఉండిపోయిందని స్పష్టం చేశారు. ఈ గందరగోళం మధ్య 20 నిమిషాల పాటు అక్కడే ఉన్న షాజియా.. ఆపై ఎవరికి తెలియకుండా 18వ అంతస్తు వెళ్లి అక్కడి నుంచి అమాంతం కిందికి దూకి ప్రాణాలు విడిచింది.

సూసైడ్‌కు కారణం ఇదేనా..

Advertisement

భార్య, భర్తలు వరుస ఆత్మహత్యల నేపథ్యంలో బెంగళూరు పోలీసులు రంగంలోకి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి కీలక విషయాలు తెలిశాయి. పోలీసుల కథనం ప్రకారం భర్త భాను చందర్ గతంలో అమెరికాలో పనిచేశారు. లేఆఫ్స్ లో భాగంగా గతేడాది మధ్యలో ఆయన ఉద్యోగాన్ని కోల్పోయారు. అప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం రాలేదు. మరోవైపు షాజియా ఐబీఎంలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వస్తోంది. ఈ జంట 8 నెలల క్రితమే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యింది.

Also Read: అయ్యబాబోయ్.. ఏసీ, టీవీ, మెుబైల్స్‌పై భారీ తగ్గింపు.. 60% తక్కువకే పట్టుకెళ్లొచ్చు..!

రూ. 80 లక్షల వార్షిక ప్యాకేజీ

భాను చందర్ అమెరికాలో పనిచేసినప్పుడు అతడికి 80 లక్షల ప్యాకేజీ లభించేదని పోలీసులు తెలిపారు. అమెరికాలో ఒక ఇల్లు కొనడంతో పాటు తెలంగాణలో మరో ఇల్లు కట్టించుకున్నారని పేర్కొన్నారు. ఏఐ కారణంగా ఉద్యోగం కోల్పోవడం.. మరో జాబ్ రాకపోవడంతో అతడిలో ఆందోళన పెరిగిందని పోలీసులు తెలిపారు. సూసైడ్ కు ముందు చివరిగా షాజియా అతడితో మాట్లాడిందని.. ‘డిన్నర్ ఆర్డర్ చేశాను.. కాసేపట్లో తింటాను’ అని భర్త సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఓవరాల్ గా నిరుద్యోగాన్ని భరించలేక భానుచందర్.. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Also Read: అమెజాన్ బిగ్ స్ప్రింగ్ సేల్.. అత్యంత చౌక ధరకే.. థియేటర్‌ను తలపించే టీవీలు!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×