E-Paper
Advertisement

మైక్రోవేవ్ వాడుతున్నారా? ఈ 4 వస్తువులు పెడితే బాంబులా పేలడం ఖాయం!

మైక్రోవేవ్ వాడుతున్నారా? ఈ 4 వస్తువులు పెడితే బాంబులా పేలడం ఖాయం!
Advertisement

Microwave safety tips: ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో మైక్రోవేవ్ ఓవెన్ వాడుతున్నారు. త్వరగా ఏదైనా ఆహార పదార్థాలు వేడిచేయాలన్నా లేదా కొన్ని రకాల గ్రిల్స్, ఫిజ్జా వంటివి తయారు చేయాలన్నా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే మైక్రోవేవ్ పనిచేసే తీరు సాధారణ స్టవ్ లకన్నా కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇది విద్యుదయస్కాంత తరంగాల ద్వారా ఆహారంలోని నీటి అణువులను వేడి చేస్తుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు వేడిచేయడానికి మనం ఓవెన్‌లో పెట్టినప్పుడు అవి ఆ తరంగాలకు ప్రతిస్పందించి మంటలు రావడం లేదా ఓవెన్ పేలడం వంటివి జరుగుతాయి. కిచెన్‌లో ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ 4 రకాల వస్తువులకు మైక్రోవేవ్‌లో పెట్టకూడదు:

1. మెటల్, అల్యూమినియం(Metals):

మైక్రోవేవ్ లోపల ఉంచకూడని అత్యంత ప్రమాదకరమైన వస్తువులలో లోహపు వస్తువులు మొదటివి. అల్యూమినియం ఫాయిల్ అంతే కాకుండా స్టీల్ గిన్నెలు లేదా లోపలు అంచులు ఉన్న పింగాణీ పాత్రలను పెట్టినప్పుడు ఆర్కింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. లోహం మైక్రోవేవ్ తరంగాలను ప్రతింబిస్తుంది. దీని వల్ల నిప్పు రవ్వలు వచ్చి ఓవెన్ లోపల మంటలు చెలరేగుతాయి. ఇది ఓవెన్ ను పూర్తిగా దెబ్బతీయడమే కాకుండా పేలుడుకు కూడా దారి తీస్తుంది.

2. గుడ్లు(Eggs):

Advertisement

చాలామంది సమయం ఆదా అవుతుందని గుడ్లను నేరుగా మైక్రోవేవ్‌లో పెట్టి ఉడికించాలని చూస్తుంటారు. కానీ ఇది మీరు చేసే అతిపెద్ద తప్పు కావచ్చు. మైక్రోవేవ్ లోపల ఉండే అధిక ఉష్ణోగ్రత వల్ల గుడ్డు లోపల విపరీతమైన ఆవిరి , ఒత్తిడి ఒక్క సారిగా పెరుగుతుంది. ఈ ఒత్తిడిని భరించలేక గుడ్డు పెంకు బాంబులా పేలిపోతుంది. దీని వల్ల ఓవెన్ పాడవడమే కాకుండా.. మీరు ఓవెన్ డోర్ తీయగానే అది మీ ముఖం మీద పేలి తీవ్రమైన గాయాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి గుడ్లను ఎప్పుడూ స్టౌవ్ మీద నీళ్లలోనే ఉడికించడం సురక్షితం.

3. ప్లాస్టిక్ పాత్రలు(Non-Microwave Safe Plastics):

ప్లాస్టిక్ పాత్రలు మైక్రోవేవ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందకంటే ఇవి వేడికి కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా వీటిలోని బిస్ ఫేనాల్ ఏ వంటి ప్రమాదకర రసాయనాలు కూడా ఆహారంలోకి విడుదల అవుతాయి. ఇది క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. కేవలం microwave safe అని రాసి ఉన్న పాత్రలను మాత్రమే వాడటం మంచిది.

Advertisement

Also Read: LPG గ్యాస్ ఆదా సీక్రెట్: ప్రెజర్ కుక్కర్ Vs ఓపెన్ కుకింగ్.. ఏది వాడితే మంచిది?

4. పచ్చి మిరపకాయలు(Hot Peppers):

పచ్చిమిరపకాయలను పొరపాటున కూడా మైక్రోవేవ్ లో పెట్టకూడదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. వేడిచేసినప్పుడు క్యాప్సైసిన్ అనే రసాయనం వీటి నుంచి ఆవిరి రూపంలో విడుదల అవుతుంది. అయితే ఇది మీరు ఓవెన్ తలుపులు తీయగానే ఆ ఘూటైన వాసన మీ కళ్లు, ముక్కులోకి వెళ్లి తీవ్రమైన మంటను కలిగించే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది ఒక కెమికల్ స్ప్రే లాగా పనిచేస్తుంది.

Related News

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

Big Stories

Advertisement
×