E-Paper
Advertisement

ట్రిప్పు ఏదైనా.. కిక్కు ఇచ్చే వంట గ్యారెంటీ! గ్యాస్ లేకపోయినా దావత్!

ట్రిప్పు ఏదైనా.. కిక్కు ఇచ్చే వంట గ్యారెంటీ! గ్యాస్ లేకపోయినా దావత్!
Advertisement

NEWDRU FlameGuard Pro Portable Butane Gas: ప్రస్తుతం ట్రావెలింగ్‌తో పాటు ట్రెకింగ్, అవుట్ డోర్ క్యాంపింగ్ అంటే ఇష్టపడని లేరు. ఉండరు. అయితే అడవిలోనో లేదా కొండలపైనో ఉన్నప్పుడు ఆకలేస్తే.. ప్యాక్ చేసిన ఫుడ్ కాకుండా వేడి వేడిగా తినాలని అందరికీ ఉంటుంది. ఇలాంటి వారి కోసం మార్కెట్లోకి వచ్చిన ఒక అద్భుతమైన గార్జెట్ NEWDRU FlameGuard Pro Portable Butane Gas Camping Stove. దీంతో ఎక్కడైనా ఈజీగా చిన్న చిన్న వంటలు చేసుకోవచ్చు. అందుకే వీటికి ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. దీని ఫీచర్లతో పాటు ధర, ఉపయోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

NEWDRU FlameGuard – ఫీచర్లు, పూర్తి వివరాలు:

Advertisement

స్టైలిష్ అండ్ కాంపాక్ట్ డిజైన్:
సాధారణంగా గ్యాస్ స్టవ్‌లు చాలా బరువుగా ఉంటాయి. కానీ ఈ స్టౌ మాత్రం చాలా తేలికగా ఉంటుంది. మీరు దీన్ని బ్యాక్ ప్యాక్‌‌లో పెట్టుకుని కూడా కిలో మీటర్ల దూరం హ్యాపీగా నడిచి వెళ్లిపోవచ్చు. ఇది బ్లాక్ కలర్‌లో క్లాసీ లుక్‌తో ఉండటమే కాకుండా చాలా ధృఢంగా ఉంటుంది. కాబట్టి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఇది ఏ మాత్రం పాడవదు.

గాలిని తట్టుకునే ఫ్లేమ్ గార్డ్:
బయట వంట చేసేటప్పుడు ఎదురయ్యే అతి పెద్ద సమస్య గాలి. గాలి వేగంగా వీస్తే సాధారణ స్టవ్‌ల మీద మంట వెంటనే ఆరిపోతుంది. కానీ ఈ స్టౌ పేరులో ఉన్నట్టు FLAME GUARD టెక్నాలజీ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది చుట్టూ మంటకు రక్షణ కవచం లాగా ఉండి.. గాలి ఎంత వేగంగా వీచినా కూడా ఆరిపోకుండా కాపాడుతుంది. దీని వల్ల గ్యాస్ వృథా కాకుండా ఉంటుంది. అంతే కాకుండా వంట కూడా తొందరగా పూర్తవుతుంది.

Advertisement

ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్:
చాలా మంది పోర్టబుల్ స్టౌ వాడటానికి భయపడుతుంటారు. అయితే గ్యాస్ పేలుతుందేమోననే భయం ఇందుకు కారణం.  కానీ ఈ స్టౌ లో ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి గ్యాస్ కంటైనర్‌లో ఒత్తిడి పెరిగినప్పుడు మాత్రం ఇది ఆటోమెటిక్‌గా గ్యాస్ సరఫరాను ఆపేస్తుంది. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం చాలా తక్కువ అని చెప్పొచ్చు.

అడ్జస్టబుల్ ఫ్లేమ్:
మనం ఇంట్లో వాడే గ్యాస్ లాగానే దీనిలో కూడా మంట పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి వీలుగా నాబ్ ఉంటుంది. టీ పెట్టాలన్నా లేదా బిర్యానీ చేయాలన్నా కూడా కావాల్సిన వేడిని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది కేవలం 4K120HZ టీవీ మోడల్ లాగా మోడ్రన్ టెక్నాలజీతో మీ కుకింగ్ స్పీడ్ పెంచుతుంది.తక్కువ టైంలోనే మీరు వివిధ రకాల వంటలను  చేసుకోవచ్చు.

ఎవరికి బెస్ట్:
ఇది ట్రావెలర్లకు బెస్ట్ అని చెప్పొచ్చు. కార్ ట్రిప్ లేదా బైక్ ట్రిప్ వెళ్లేవారికి ఇది ఫర్ఫెక్ట్. అంతే కాకుండా కొండలపైకి వెళ్లేవారికి కూడా ఈ స్టౌ అవసరం ఉంటుంది. ఇదిలా ఉంటే బ్యాచిలర్స్ చిన్న రూముల్లో ఉండే వారికి ఇది చాలా స్థలాన్ని ఆదా చేస్తుంది. తక్కువ టైంలోనే దీనిపై రక రకాల వంటలు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇంట్లో గ్యాస్ అయిపోయినప్పుడు లేదా కరెంట్ లేనప్పుడు ఇది మీరు బ్యాకప్ గా ఉపయోగించుకోవచ్చు.

Also Read: టీవీలకే సుప్రీం బాస్! 100 ఇంచుల భారీ స్క్రీన్.. పిక్చర్ క్వాలిటీలో తగ్గేదే లే!

ధర: (ఫ్లిప్ కార్డ్ లో రూ.1701)
ఈ స్టౌ ధర సామాన్యలకు అందుబాటులోనే ఉంది. కానీ దీనిని కొనేముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు దీన్ని కొన్నప్పుడు గ్యాస్ క్యాన్ విడిగా కొనాల్సి ఉంటుంది. ఇది దాదాపు అన్ని ప్రముఖ సైట్లలో కూడా లభిస్తుంది.

గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

Big Stories

Advertisement
×