E-Paper
Advertisement

టీవీలకే సుప్రీం బాస్! 100 ఇంచుల భారీ స్క్రీన్.. పిక్చర్ క్వాలిటీలో తగ్గేదే లే!

టీవీలకే సుప్రీం బాస్! 100 ఇంచుల భారీ స్క్రీన్.. పిక్చర్ క్వాలిటీలో తగ్గేదే లే!
Advertisement

Sony Bravia 100 inch TV 4K: సినిమాలు అంటే ఇష్టం ఉన్న వాళ్లకి అంతే కాకుండా గేమింగ్‌లో మునిగిపోయే వాళ్లకి 2026 ఒక స్పెషల్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. సోనీ తన లేటెస్ట్ మోడల్ అయిన Bravia 3 II ఈ ఏడాదిలోనే లాంచ్ చేసింది. లక్షరాల 100 ఇంచులు ఉన్న ఈ టీవీ, భారీ స్క్రీన్ కలిగి ఉండటం వల్ల మనకు థియేటర్ అనుభూతిని అందిస్తుంది. హోమ్ ఎంటర్టైన్మెంట్ రేంజ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తున్న ఈ టీవీ ధర, ఫీచర్లతో పాటు మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సోనీ 100 ఇంచుల BRAVIA 3 11 – రివ్యూ
1.థియేటర్ ఫీల్:
ఒకప్పుడు పెద్ద స్క్రీన్ మీద మూవీ చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే. కానీ ఇప్పడు ఆ అవసరం లేదు. ఎందుకంటే ఈ సోనీ టీవీ మోడల్ ఇంట్లో ఉంటే.. థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దాదాపు ఎనిమిదిన్నర అడుగుల వెడల్పు ఉండే ఈ టీవీ స్క్రీన్ గోడ మీద ఉంటే అదీ టీవీల కాకుండా డిజిటల్ విండోలాగా మీకు కనిపిస్తుంది. సోనీ తన పాత మోడల్స్‌లోని లోపాలను సవరించుకుని ఈ సెకండ్ జనరేషన్ మోడల్ లాంచ్ చేసింది.

Advertisement

2. 4K క్లారిటీ, 120HZ మ్యూజిక్:
ఈ టీవీలో ప్రతీ సీన్ చాలా స్పష్టంగా ఉంటుంది. దీనికి తోడు 120HZ రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల వీడియో ప్లే అయ్యేటప్పుడు ఎక్కడ చూసినా కూడా అస్సలు లాగ్ అనిపించదు. ముఖ్యంగా క్రికెట్ చూసేటప్పుడు మాత్రం బాల్ వేగం, యాక్షన్ సినిమాల్లో ఫైట్స్ సీక్వెన్స్ కూడా చాలా స్మూత్‌గా ఉంటాయి. గేమర్స్ కైతే ఈ టీవీ చాలా బాగా నచ్చుతుంది. ps5 లాంటి కన్సోల్స్ కనెక్ట్ చేస్తే.. ఆ అనుభవం మాత్రం మాటల్లో చెప్పలేం.

3.XR ప్రాసెసర్:
ఈ టీవీ XR కాగ్నిటివ్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది.  మన మెదడు ఒక వస్తువును ఎలా చూస్తుందో అలాగే టీవీలోని ఇమేజ్‌లను ఇది ప్రాసెస్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. రంగులు కూడా దీనిలో చాలా నేచురల్ గా ఉంటాయి. అంతే కాకుండా బ్లాక్ కలర్ మరింత డీప్ బ్లాక్‌లాగా కనిపిస్తుంది. HDR కంటెంట్ చూసినప్పుడు కాంతి, నీడల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చీకట్లో తీసిన సీన్లు కూడా డీటెయిల్డ్‌గా కనిపిస్తాయి.

Advertisement

4. స్మార్ట్ ఫీచర్లు, సౌండ్ క్వాలిటీ:
ఇది కేవలం పెద్ద స్క్రీన్ మాత్రమే కాదు. GOOGLE TV ఓఎస్‌తో వస్తున్న మోడల్ కాబట్టి నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్ అన్నీ ఇన్ బిల్ట్‌గా ఉంటాయి. ఇంక సౌండ్ విషయానికి వస్తే.. మాత్రం సోనీ Acoustic Multi-Audio ఇందులో వాడారు కాబట్టి ..స్క్రీన్ వెనక ఉన్న స్పీకర్ల ద్వారా మనకు నేరుగా శబ్దం వినిపిస్తుంది.

ఈ 100 ఇంచుల టీవీ పెద్ద హాల్, పెద్ద రూం ఉన్న వారికి సెట్ అవుతుంది. అంతే కాకుండా హోమ్ థియేటర్ సెట్ చేసుకోవాలని అనుకున్న వారికి కూడా ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ లవర్స్ అంతే కాకుండా సినిమా ఫ్యాన్స్, హై ఎండ్ గేమర్స్ కోసం సోనీ ఈ మోడల్ ను డిజైన్ చేసింది.

గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×