E-Paper
Advertisement

NexPhone Windows: మీ జేబులో సరిపడే కంప్యూటర్.. ఒకే మొబైల్‌లో విండోస్, ఆండ్రాయిడ్

NexPhone Windows: మీ జేబులో సరిపడే కంప్యూటర్.. ఒకే మొబైల్‌లో విండోస్, ఆండ్రాయిడ్
Advertisement

NexPhone Windows| ఒకే డివైస్‌తో అన్ని డిజిటల్ పనులు చేయాలనే భావన ఇటీవలి కాలంలో అందరిలో కలుగుతోంది. అందుకే నెక్స్‌డాక్ (NexDock) కంపెనీ నెక్స్‌ఫోన్ (NexPhone) అనే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొబైల్‌గా మాత్రమే కాకుండా కంప్యూటర్‌గా కూడా పని చేస్తుంది. మొబైల్, డెస్క్‌టాప్, కంప్యూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌లను ఒకే డివైస్‌లో ఇవ్వాలని లక్ష్యం. కొన్ని సంవత్సరాల క్రితం Nokia, HTC వంటి బ్రాండ్లు Windows ఫోన్లు తీసుకొచ్చాయి. NexPhone ఆ ఆలోచనను ఆధునిక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌తో మరింత ముందుకు తీసుకెళ్తోంది.

డిజైన్, బిల్డ్ క్వాలిటీ

NexPhone సాధారణ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లా కనిపిస్తుంది. మందమైన బెజెల్స్, గట్టి గ్రే రబ్బర్ బాడీ ఉంది. ఫోన్ మందం 13.1mm ఉంది. ఇది ఆధునిక స్మార్ట్‌ఫోన్ల కంటే బరువుగా, మందంగా ఉంటుంది. బరువు సుమారు 256 గ్రాములు. అయినా డ్యూరబుల్‌గా, బలంగా అనిపిస్తుంది.

డిస్‌ప్లే ఫీచర్లు

Advertisement

NexPhoneలో 6.58 ఇంచ్ Full HD+ LCD డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. స్మూత్ స్క్రోలింగ్, మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మొబైల్ ఉపయోగం, డెస్క్‌టాప్ పనులకు సరిపోతుంది.

మల్టీ-బూట్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్

నెక్స్‌ఫోన్ అతి పెద్ద ప్రత్యేకత మల్టీ-బూట్ సపోర్ట్. బాక్స్ నుంచే Android 16తో వస్తుంది. అయితే ఇందులో Debian Linux, Windows 11 కూడా రన్ చేయవచ్చు. మానిటర్‌కు కనెక్ట్ చేసి డెస్క్‌టాప్‌గా ఉపయోగించవచ్చు. Linuxతో పూర్తి డెస్క్‌టాప్ ఎన్విరాన్‌మెంట్ దొరుకుతుంది. Windows 11ని ఫోన్‌పై డైరెక్ట్‌గా రన్ చేయవచ్చు. అయితే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ Windowsకి స్విచ్ చేయడానికి రీబూట్ చేయాలి. కంపెనీ ప్రకారం.. Windows మొబైల్-ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.

ప్రాసెసర్, లాంగ్-టర్మ్ సపోర్ట్

Advertisement

NexPhoneలో క్వాల్‌కామ్ QCM6490 ప్రాసెసర్ ఉంది. ఇది ఎంటర్‌ప్రైజ్, IoT డివైస్‌ల కోసం రూపొందించారు. స్నాప్‌డ్రాగన్ 780Gకి దగ్గరగా ఉంటుంది. 2036 వరకు ప్రాసెసర్ సపోర్ట్ ఇస్తామని కంపెనీ చెప్పింది. Microsoft ఈ చిప్‌సెట్‌కు Windows 11 అధికారిక సపోర్ట్ ఇచ్చింది. పూర్తి డెస్క్‌టాప్ కంప్యూటర్లతో పోలిస్తే పర్‌ఫామెన్స్ కొంచెం తక్కువ ఉండవచ్చు.

మెమరీ, స్టోరేజ్ ఆప్షన్లు

NexPhoneలో 12GB RAM ఉంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. మైక్రోSD కార్డ్‌తో స్టోరేజ్ విస్తరించవచ్చు. వివిధ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో మల్టీటాస్కింగ్ సులభం అవుతుంది.

కెమెరా స్పెసిఫికేషన్లు

NexPhoneలో మంచి కెమెరా సెటప్ ఉంది. రియర్‌లో 64 మెగాపిక్సెల్ Sony IMX787 ప్రైమరీ సెన్సార్ ఉంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ కెమెరా 10 మెగాపిక్సెల్ ఉంది. బేసిక్ ఫోటోగ్రఫీ, వీడియో కాల్స్‌కు సరిపోతుంది.

Also Read: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రాడ్ యాప్స్.. వెంటనే వీటిని డెలీట్ చేయండి.. ప్రభుత్వ హెచ్చరిక

బ్యాటరీ, కనెక్టివిటీ

NexPhoneలో 5000mAh బ్యాటరీ ఉంది. Windows వంటి హెవీ OS రన్ చేస్తే బ్యాటరీ లైఫ్ మారవచ్చు. 5G కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6Eతో ఫాస్ట్ వైర్‌లెస్ స్పీడ్స్ ఉన్నాయి. IP68, IP69K రేటింగ్స్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్.

ధర, అందుబాటు

NexPhone ప్రస్తుతం ఎర్లీ రిజర్వేషన్‌లో ఉంది. ఎర్లీ ధర $549 (అంటే భారత కరెన్సీలో సుమారు రూ.50,200). $199 అడ్వాన్స్ చెల్లించి రిజర్వ్ చేయవచ్చు. Q3 2026లో లాంచ్ అవుతుందని కంపెనీ చెప్పింది.

NexPhone ఒక ప్రయోగాత్మకంగా డివైస్. స్మార్ట్‌ఫోన్‌ను పూర్తి కంప్యూటింగ్ సొల్యూషన్‌గా మార్చాలని లక్ష్యం. రియల్-వరల్డ్ ఉపయోగంలో పర్‌ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అంబిషియస్ గోల్స్‌తో వచ్చిన ఆసక్తికరమైన ప్రయత్నం ఇది.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×