E-Paper
Advertisement

WPL 2026: RCB లేడీ క్రికెట‌ర్ల‌కు వేధింపులు..విదేశీ క్రికెట‌ర్లు చీర‌లు క‌ట్టుకోవాలంటూ బెదిరింపులు ?

WPL 2026: RCB లేడీ క్రికెట‌ర్ల‌కు వేధింపులు..విదేశీ క్రికెట‌ర్లు చీర‌లు క‌ట్టుకోవాలంటూ బెదిరింపులు ?
Advertisement

WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే వరుసగా ఐదు విజయాలు నమోదు చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bengaluru )… ఈ టోర్నమెంట్ లో ప్లే ఆఫ్స్ కు దూసుకు వెళ్ళింది. ఈ సారి టైటిల్ కూడా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది యాజమాన్యం. నిన్న వడోదరలో స్పెషల్ ఈవెంట్ నిర్వహించి, దావత్ ఏర్పాటు చేసిందట. ఈ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన మహిళా క్రికెటర్లందరూ సాంప్రదాయ బట్టల్లో కనిపించి సందడి చేశారు.

Also Read: Abhishek Sharma Net Worth: అభిషేక్ శ‌ర్మకు కోట్ల‌ల్లో ఆస్తులు..ఖ‌రీదైన కార్లు, బంగ్లాలు..ప్రియురాలు ఎవ‌రంటే ?

RCB క్రికెటర్లకు వేధింపులు.. చీరలు కట్టుకోవాలని ?

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026 Tournament) నేపథ్యంలో ప్లే ఆఫ్స్ కు దూసుకు వెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మహిళా క్రికెటర్లకు బిగ్ ట్రీట్ ఇచ్చింది యాజమాన్యం. గురువారం రోజు రాత్రి చిన్న పార్టీ ఇవ్వడం జరిగింది. ఆర్సీబీ రెడ్ కార్పెట్ ( RCB Red Carpet event ) పేరుతో ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా మహిళా క్రికెటర్లు చీరలు కట్టుకోవాలని కండిషన్ పెట్టిందట ఆర్సీబీ యాజమాన్యం. విదేశీ క్రికెటర్లు కూడా ఇండియన్ ట్రెడిషన్ బట్టల్లో మాత్రమే కనిపించాలని పేర్కొందట. కచ్చితంగా అందరూ చీరలు కట్టుకోవాలని చెప్పగా… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళ క్రికెటర్లు నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో యాజమాన్యానికి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లకు చిన్నపాటి గొడవ కూడా జరిగిందట. ఇక చివరికి విదేశీ క్రికెటర్లు కూడా ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని, ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే ఈ వివాదాన్ని బయటకు రాకుండా ఆర్సీబీ యాజమాన్యం చూసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు వైరల్ చేస్తున్నారు.

ప్లే ఆఫ్స్ ద‌శ‌కు WPL 2026

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. మరో రెండు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకోవాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎలిమినేట్ కావాల్సిన గుజరాత్ నిన్న అద్భుతంగా రాణించి విజయం సాధించింది. యూపీ వారియ‌ర్జ్‌ జట్టును చిత్తుగా ఓడించింది. ఈ రెండు గంటల మధ్య నిన్న మ్యాచ్ జరగగా 45 పరుగుల తేడాతో విజయం సాధించింది గుజరాత్. దీంతో పాయింట్లు పట్టికలో రెండవ స్థానానికి దూసుకు వచ్చింది గుజరాత్. రెండు, మూడు స్థానాల కోసం మొత్తం ఐదు జట్టు తలపడుతున్నాయి. ఇందులో యూపీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ రెండు జట్ల రన్ రేట్ మైనస్ లో ఉంది. వాళ్లు వరుసగా గెలిచిన కూడా కష్టమే. ఇటు గుజరాత్ అలాగే ముంబై మరో విజయాన్ని నమోదు చేసుకుంటే ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయి.

Advertisement

Also Read: RCB Players-Indian roads: ఆర్సీబీ ప్లేయ‌ర్ల‌కు వేధింపులు..వీడియోలు తీస్తూ మ‌రీ..ఇండియాలో ప‌రువు తీస్తున్నారురా ?

 

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×