E-Paper
Advertisement

‘కెనడియన్ బావి’ వింత.. పెరట్లో పైపులు పాతి.. ఇల్లంతా కూల్‌గా మార్చేశాడు!

‘కెనడియన్ బావి’ వింత.. పెరట్లో పైపులు పాతి.. ఇల్లంతా కూల్‌గా మార్చేశాడు!
Advertisement

Canadian Well: ప్రస్తుత రోజుల్లో భానుడి భగభగలకు తట్టుకోవాలంటే ఏసీ ఉండాల్సిందే. అయితే ఏసీ కొనాలన్నా, దాని వల్ల వచ్చే కరెంటు బిల్లును భరించాలన్న సామాన్యులకు తలకు మించిన భారంగా మారిపోవ్చు. ఈ నేపథ్యంలో వీటన్నింటికి చెక్ పెడుతూ రూపాయి కరెంట్ బిల్లు కూడా లేకుండా ఒక వ్యక్తి తన ఇంటిని కూల్‌గా మార్చుకున్నాడు. ఏసీ, రిఫ్రిజెరెంట్ గ్యాస్ లేకుండా కేవలం తన పెరట్లో కొన్ని పైపులను భూమిలో పూడ్చిపెట్టి అద్భుతమైన జియోథర్మల్ (భూగర్భ ఉష్ణోగ్రత) వ్యవస్థను తయారు చేసుకున్నాడు. ‘కెనడియన్ బావి’ (Canadian Well) లేదా ‘ఎర్త్ టన్నెల్ హీట్ ఎక్స్ఛేంజర్’ అని పిలిచే ఈ సాంకేతికత ఏంటి? ఎలా పనిచేస్తుంది? వంటి విశేషాలు ఈ కథనంలో చూద్దాం.

ఏంటి ఈ ‘కెనడియన్ బావి’ వింత?

సాధారణంగా భూమి ఉపరితలంపై వాతావరణం ఎంత వేడిగా లేదా ఎంత చలిగా ఉన్నా.. భూమి లోపల నిర్దిష్ట లోతులో మాత్రం ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకేలా (స్థిరంగా) ఉంటుంది. ఈ సహజ సిద్ధమైన సూత్రాన్ని ఆధారంగా చేసుకునేదే ‘కెనడియన్ బావి’ విధానం. కెనడా వంటి చలి దేశాల్లో శీతాకాలంలో ఇంటిని వెచ్చగా ఉంచడానికి వాడే ఈ పద్ధతిని.. వేసవి కాలానికి అనుగుణంగా ఇంటిని చల్లబరచడానికి తీర్చిదిద్దారు. దక్షిణ అమెరికాకు చెందిన కంటెంట్ క్రియేటర్ తన నివాసంలో ఈ జియోథర్మల్ వ్యవస్థను ఏర్పాటు చేసి.. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.

ఇది ఎలా పనిచేస్తుందంటే?

Advertisement

ఈ అద్భుతమైన సిస్టమ్ కోసం సదరు వ్యక్తి తన ఇంటి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో (పెరట్లో) కొన్ని మీటర్ల లోతులో గుంత తీశాడు. అందులో ప్రత్యేకమైన ప్లాస్టిక్ పైపులను ఒక క్రమ పద్ధతిలో అమర్చి మళ్లీ మట్టితో పూడ్చేశాడు. బయటి వేడి గాలి ఈ పైపుల ద్వారా లోపలికి ప్రవహించినప్పుడు భూగర్భంలో ఉన్న చల్లదనం వల్ల ఆ గాలి చల్లబడుతుంది. అలా చల్లబడిన గాలిని పైపుల కనెక్షన్ల ద్వారా నేరుగా ఇంట్లోని గదుల్లోకి వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు.

ఏసీలు, ఫ్యాన్లకు గుడ్‌బై

వేసవిలో బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటినా తన ఇంట్లోకి వచ్చే గాలి మాత్రం ఎప్పుడూ 22 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్యే ఉంటుందని కంటెంట్ క్రియేటర్ పేర్కొన్నారు. రాత్రి పూట అస్సలు ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరమే రావడం లేదని అన్నారు. ఈ వ్యవస్థ వల్ల ఇంట్లోకి నిరంతరం చల్లటి గాలి వస్తూనే ఉంటుందని.. సంప్రదాయ ఏసీల్లాగా ఇందులో హానికరమైన గ్యాస్‌లు విడుదల కావు కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని పేర్కొంటున్నారు.

Advertisement

Also Read: జియో రూ.199 ప్లాన్.. బడ్జెట్ ధరలో అపరిమిత బెనిఫిట్స్.. కానీ ఓ మెలిక ఉంది!

ఒకసారి ఖర్చుతో.. జీవితాంతం ఫ్రీ!

ఈ జియోథర్మల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రారంభంలో పైపులు, మట్టి తవ్వకాలకు మాత్రమే ఖర్చవుతుంది. ఆ తర్వాత దీనికి ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు. పైగా కరెంట్ బిల్లు సున్నా. ప్రకృతి ఇచ్చిన వనరులను కాపాడుకుంటూ జేబుకు చిల్లు పడకుండా దక్షిణ అమెరికా కంటెంట్ క్రియేటర్ చేసిన ఈ ప్రయోగం.. ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యావరణహితంగా ఇళ్లను నిర్మించుకోవాలనుకునే వారికి ఈ ‘కెనడియన్ వెల్’ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమని చెప్పవచ్చు.

Also Read: Basil-Samson: సంజు సిక్సర్‌పై హీరో బాసిల్ జోసెఫ్ ప్రిడిక్షన్..వ‌ర‌ల్డ్ క‌ప్ సీన్ రిపీట్

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×