Basil – Samson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల (Chennai Super Kings vs Sunrisers Hyderabad) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్… చెన్నై సూపర్ కింగ్స్ పై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిన నేపథ్యంలో అవలీలగా హైదరాబాద్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా తొలి ఓవర్ లో చెన్నై ఆటగాడు సంజు శాంసన్ (Sanju Samson six prediction) సిక్సర్ కొడతాడని మలయాళ హీరో, డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ (Basil Joseph) ప్రిడిక్షన్ చేశాడు. అతడు చెప్పినట్టుగానే సంజు శాంసన్ సిక్సర్ కొట్టి.. నిజం చేశాడు. ఈ క్రమంలోనే బాసిల్ జోసెఫ్ చేసిన ప్రొడక్షన్ వైరల్ గా మారింది.
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య నిన్న ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 13 బంతుల్లో సంజు శాంసన్ 27 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సిక్సర్ కూడా ఉంది. అయితే, నిన్నటి మ్యాచ్ సందర్భంగా తొలి ఓవర్ లోనే సంజు శాంసన్ సిక్సర్ కొడతాడని తమిళ హీరో బాసిల్ జోసెఫ్ (Basil Joseph) ప్రిడిక్షన్ చేశాడు. ఇక అతడు చెప్పినట్లుగానే సంజు శాంసన్ నిజం చేసేసాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ క్రమంలో అతని పక్కన ఉన్న హీరోయిన్ రియా శిబు క్యూట్ ఎక్స్ ప్రెషన్ వీడియోను మరింత స్పెషల్ గా మార్చింది. అయితే మొన్న జరిగిన టి20 ప్రపంచ కప్ 2026 సందర్భంగా కూడా ఫైనల్ మ్యాచ్ లో సంజు శాంసన్ సిక్సర్ కొడతాడని బాసిల్ జోసెఫ్ అంచనా వేశాడు. ఇక అతను చెప్పినట్లుగానే సంజు శాంసన్ సిక్సర్ కొట్టడం జరిగింది. అంటే వరల్డ్ కప్ లో జరిగిన సీన్ నిన్నటి సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో రిపీట్ అయింది అన్నమాట. ఈ క్రమంలో హీరో బాసిల్ జోసెఫ్ ను మాయల ఫకీర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వాడు ఏది కోరితే సంజు అదే కొడుతున్నాడని రియాక్ట్ అవుతున్నారు నెటిజెన్స్. ఇది ఇలా ఉండగా, ఈ మ్యాచ్ లో చెన్నై ఓటమి పాలైంది.
Also Read: Mushfiqur Rahim: కాలితో గట్టిగా తన్నిన ముష్ఫిఖర్ రహీం..10 మీటర్ల దూరంలో పడ్డ హెల్మెట్
Sanju Samson and Basil Joseph is a beautiful chemistry 🤩 pic.twitter.com/boNXqewWvw
— Deepu (@deepu_drops) May 19, 2026