E-Paper
Advertisement

SmartGlasses Instagram Reels: ఇకపై స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు.. స్మార్ట్‌గ్లాసెస్‌‌లోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్

SmartGlasses Instagram Reels: ఇకపై స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు.. స్మార్ట్‌గ్లాసెస్‌‌లోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్
Advertisement

SmartGlasses Instagram Reels| ఇన్‌స్టాగ్రామ్ మాతృక కంపెనీ మెటా చెందిన స్మార్ట్ గ్లాసెస్‌కి పెద్ద అప్‌డేట్ రాబోతోంది. ఈ అప్‌డేట్ రాగానే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫోన్ లేకుండానే చూడొచ్చు. ఇది రోజువారీ షార్ట్ వీడియోలు చూసే విధానాన్ని మార్చేస్తుంది. ఈ ఏడాది (2025) ప్రారంభంలోనే మెటా రే బ్యాన్ డిస్‌ప్లే స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ చేసింది. వీటి లెన్స్‌లోనే డిస్‌ప్లే ఉంటాయి. ఇప్పుడు రీల్స్ సపోర్ట్, EMG హ్యాండ్‌రైటింగ్ టెక్నాలజీ వంటి కొత్త ఫీచర్స్ యాడ్ చేయబోతోంది.

రే బ్యాన్ డిస్‌ప్లే స్మార్ట్ గ్లాసెస్ ఏమిటి?

మెటా రే బ్యాన్ డిస్‌ప్లే (Ray Ban Display) గ్లాసెస్‌లో రైట్ లెన్స్‌లో బిల్ట్-ఇన్ డిస్‌ప్లే ఉంది. నోటిఫికేషన్స్, బేసిక్ ఇన్ఫో చూపిస్తుంది. గ్లాసెస్ స్టైలిష్, లైట్ వెయిట్ సాధారణ సన్‌గ్లాసెస్ లాగా కనిపిస్తాయి. రోజువారీ వినియోగానికే ఈ డిజైన్ లో రూపొందించారు. కొత్త అప్‌డేట్‌తో వీడియో కంటెంట్ కూడా చూడొచ్చు.

EMG హ్యాండ్‌రైటింగ్ ఫీచర్ ఏమిటి?

Advertisement

EMG హ్యాండ్‌రైటింగ్ టెక్నాలజీ మెటా న్యూరల్ రిస్ట్‌బ్యాండ్‌తో పని చేస్తుంది. చేతి కండరాల మూవ్‌మెంట్స్‌ని బ్యాండ్ డిటెక్ట్ చేస్తుంది. ఏ ఫ్లాట్ సర్ఫేస్ మీదైనా రాయొచ్చు లేదా డ్రా చేయొచ్చు. కండరాల కదరికల సిగ్నల్స్ డిజిటల్ ఇన్‌పుట్‌గా మారుతాయి. స్క్రీన్ లేదా కీబోర్డ్ అవసరం లేదు. చాలా న్యాచురల్, ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. మెటా CTO ఆండ్రూ బాస్‌వర్త్ ఇది త్వరలో వస్తుందని చెప్పాడు. 2026 సంవత్సరం ప్రారంభంలోనే ఈ అప్డేట్ విడుదలయ్యే అయ్యే అవకాశం ఉంది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గ్లాసెస్‌లో ఎలా చూడొచ్చు?

ఏఐ స్మార్ట్ గ్లాసెస్ లో మెటా.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ సపోర్ట్ టెస్ట్ చేస్తోంది. ఇంటర్నల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కొన్ని నెలల్లో పబ్లిక్ రోల్‌అవుట్ అయ్యే అవకాశం ఉంది.. రీల్స్ డైరెక్ట్‌గా లెన్స్ డిస్‌ప్లేలో కనిపిస్తాయి. హ్యాండ్స్ ఫ్రీగా చూడొచ్చు. ఇకపై ఫోన్ అవసరం లేదు. లెన్స్ డిస్‌ప్లే బ్రైట్, హై రిజల్యూషన్ ఇస్తుంది.

గ్లాసెస్‌ని ఎలా కంట్రోల్ చేయాలి?

Advertisement

జెస్చర్స్ (బాడీ మూవెమెంట్స్ చేతి కదలికల) ద్వారా కంట్రోల్ చేయొచ్చు. EMG రిస్ట్‌బ్యాండ్ జెస్చర్ రికగ్నిషన్ సపోర్ట్ చేస్తుంది. చేతి మూవ్‌మెంట్స్‌తో స్క్రోల్ చేయొచ్చు, కంటెంట్ సెలెక్ట్ చేయొచ్చు. టచ్ స్క్రీన్ అవసరం లేదు. చాలా న్యాచురల్‌గా ఉంటుంది.

గ్లాసెస్ ధర, లభ్యత

ప్రస్తుతం అమెరికాలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 799 డాలర్లు.. (అంటే భారత కరెన్సీలో సుమారు రూ.72,634). త్వరలో కెనడా, ఫ్రాన్స్, ఇటలీలో లాంచ్ అవుతాయి. మరిన్ని దేశాల్లో కూడా ఇన్‌స్టాగ్రామ్ విడుదల చేయనుంది.

ఈ అప్‌డేట్ ఫోన్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. హ్యాండ్స్ ఫ్రీ కంటెంట్ యాక్సెస్ ఇస్తుంది. స్మార్ట్ గ్లాసెస్ మరింత ప్రాక్టికల్ అవుతాయి. మెటా వేరబుల్ టెక్నాలజీలో ఈ గ్లాసెస్ తో పెద్ద అడుగు వేస్తోంది!

Also Read: భీమ్ యుపిఐ స్పెషల్ ఆఫర్.. అందరికీ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×