Nokia N76 2026 Mobile: క్లాసిక్ ఫ్లిప్ ఫోన్ కాలం ముగిసింది అనుకునే సమయంలో 2026లోకి అడుగుపెట్టే నోకియా కొత్త ఎన్76 మళ్లీ ఆ గుర్తులకు మరోసారి ప్రాణం పోసేలా ఎదరైంది. ఒకప్పుడు ప్రజలు ఎంతో ఇష్టపడ్డ ఆ ఫ్లిప్ స్టైల్ మళ్లీ కనిపిస్తున్నా, ఈసారి దానికి అప్‌డేటెడ్ లుక్, మోడ్రన్ టచ్, ఇంకా నేటి యూజర్లకు కావాల్సిన స్పీడ్ కలిసిపోవడం ప్రత్యేకం. పాత మోడల్ ప్రేమించిన వారైనా, ఫ్లిప్‌కు కొత్తగా అట్రాక్ట్ అవుతున్న వారైనా ఈ ఫోన్ మీద చూపు పడకుండా ఉండదు. చిన్న ఫ్లిప్ తెరచే ఆ అనుభూతి ఇప్పటికీ అదే రీతిలో ఉండి, పైగా మొత్తం ఫోన్ మరింత మోడ్రన్‌గా మారింది.
అప్‌డేటెడ్ లుక్‌తో డిజైన్
డిజైన్ విషయానికి వస్తే 2026 ఎన్76లో ఫ్లిప్ ఐడియా పాతదే అయినా లుక్ మాత్రం పూర్తిగా అప్‌డేటెడ్ లుక్‌గా మారింది. ఒకప్పుడు మందంగా కనిపించే ఫ్లిప్ ఫోన్లలా కాకుండా ఇది పలుచగా ఉండి, మెటాలిక్ ఫినిష్‌తో ప్రీమియం ఫీల్ ఇస్తుంది. చేతిలోకి తీసుకున్నప్పుడు హార్డ్‌గ్రిప్‌లా అనిపించడం. పాకెట్‌లో పెట్టుకున్నా బరువు అనిపించదు. బయటికి ఎక్కడైనా తీసుకెళ్లినా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఫ్లిప్ మెకానిజం కూడా మరింత స్మూత్‌గా మారి, ఒక్కసారి ఓపెన్ చేసినప్పుడు ఆ క్లిక్ ఫీల్ బాగానే ఉంటుంది. నీటి చినుకులు తగిలినా ఫోన్ సేఫ్‌గా ఉండేలా చేసిన ఈ వాటర్ రెసిస్టెన్స్ కారణంగా యూజర్లకు మరింత నమ్మకం కలుగుతుంది.
డిస్‌ప్లే.. విజువల్స్ చాలా క్లియర్
డిస్‌ప్లే భాగంలో ఉన్న అప్‌డేట్స్ స్పష్టంగా గుర్తించవచ్చు. లోపల 6.5 ఇంచుల అమోలేడ్ స్క్రీన్ ఉండటం వల్ల విజువల్స్ చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. వీడియోలు, ఫోటోలు, యాప్‌లు అన్నీ షార్ప్‌గా కనపడటం ఈ ఫోన్ ఆకర్షణ. బయట ఉన్న చిన్న స్క్రీన్ ఇప్పుడు ఫుల్ కలర్ టచ్ స్క్రీన్‌గా మారి మరింత ఉపయోగపడుతుంది. కాల్స్, మెసేజెస్, నోటిఫికేషన్స్ కోసం ఫోన్‌ను పూర్తిగా తెరవాల్సిన పని ఉండదు. చిన్న స్క్రీన్‌పై త్వరగా చూసేయొచ్చు, లోపలి పెద్ద స్క్రీన్‌పై సినిమాలు చూడడానికి, చదివేందుకు మంచి స్పేస్ దొరుకుతుంది.
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్
పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఉండటం వల్ల ఫోన్ స్పీడ్ చాలా బాగుంటుంది. గేమింగ్ చేసినా, యాప్ మార్చినా, స్క్రోల్ చేసినా ఎక్కడా ఆగిపోయే ఫీల్ రాదు. తాజా అండ్రాయిడ్ వెర్షన్‌తో ఫోన్ నడవడం వల్ల ఇంటర్‌ఫేస్ కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. హెవీ యాప్‌లు లేకపోవడం వల్ల ఫోన్ మరింత స్మూత్‌గా పనిచేస్తుంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్ ఉన్న వేరియంట్‌లో ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ అన్నీ జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. 5జి సపోర్ట్ ఉండటం వల్ల డౌన్‌లోడ్స్, స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్ అన్నీ చాలా ఫాస్ట్‌గా జరుగుతాయి. పాత ఎన్76తో పోలిస్తే ఇది పూర్తిగా కొత్త జనరేషన్‌కు సరిపోయేలా తయారైంది.
Also Read: Vivo Smartphon: వివో ఎస్19 న్యూ మోడల్ ఎంట్రీ.. మార్కెట్లోకి రానున్న వివో ఫోన్‌పై టాక్ ఎలా ఉందంటే?
64ఎంపి మెయిన్ కెమెరా
క్యామెరా సెటప్ కూడా చాలా బాగుంది. 64ఎంపి మెయిన్ కెమెరా క్లియర్ ఫోటోలు ఇస్తుంది. ఏఐ సిస్టమ్ లైటింగ్‌కి తగినట్టుగా అజస్ట్ చేసి ఇమేజెస్ బాగానే తీసుకురాగలదు. 32ఎంపి ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కి మంచి అవుట్‌పుట్ ఇస్తుంది. 8కె వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉన్నందువల్ల క్వాలిటీ వీడియోలు తీయాలనుకునేవారికి ఇది ప్రయోజనం.
5000mAh బ్యాటరీ
5000mAh బ్యాటరీ ఉండటం వల్ల ఒక్కసారి ఛార్జ్‌తో రోజు మొత్తం ఫోన్ వాడుకోవచ్చు. స్ట్రీమింగ్ చేసినా, గేమ్స్ ఆడినా, సాధారణ వాడుక చేసినా సాయంత్రం వరకూ సేఫ్‌గా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల తక్కువ టైంలోనే ఛార్జ్ అయ్యిపోతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉండటం వల్ల కేబుల్ అవసరం లేకుండా ఫోన్ పెట్టేసి ఛార్జ్ చేసుకోవచ్చు. పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ బ్యాటరీ ఎక్కువసేపు నిలబడేలా హెల్ప్ చేస్తుంది.
ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్
ఫీచర్ల విషయానికి వస్తే 5జి వైఫై 6, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, యుఎస్‌బి టైప్-సి అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ రెండూ వేగంగా పనిచేస్తాయి. జైరోస్కోప్, యాక్సిలరోమీటర్, బ్యారోమీటర్ వంటి సెన్సర్లు ఫిట్‌నెస్ యాప్‌లు, గేమ్స్, ఏఆర్ టూల్స్ వాడేటప్పుడు బాగా ఉపయోగపడతాయి.
అందుబాటులో ధర
నోకియా ఎన్76 2026 మొబైల్ లాంచ్ డేట్ ఇంకా హైదరాబాద్‌లో ధర వివరాలు ఎలా ఉన్నాయంటే.. ధర పరంగా చూస్తే 2026 ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో ఫోన్ గ్లోబల్‌గా లాంచ్ అవుతుంది. 8జిబి ప్లస్ 128జిబి మోడల్ సుమారు 699 డాలర్లు, 12జిబి ప్లస్ 256జిబి మోడల్ సుమారు 899 డాలర్లు. ఈ ధరలను భారత మార్కెట్‌తో పోల్చుకుంటే సుమారు రూ.65,000 నుంచి రూ.85,000 మధ్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. నోకియా ఈసారి ఫ్లిప్ స్టైల్‌కి ఇచ్చిన కొత్త టచ్, అప్‌డేటెడ్ లుక్, ఆధునిక ఫీచర్లు అన్నీ కలిపి ఈ రేంజ్‌లో ఫోన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫ్లిప్ అనుభూతి మళ్లీ కావాలనుకునే వారికి, సాధారణ స్లాబ్ ఫోన్లకంటే డిఫరెంట్‌గా ఉండే ఫోన్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.