E-Paper
Advertisement

IND VS SA 2nd Test: పీక‌ల్లోతు క‌ష్టాల్లో టీమిండియా..100 ప‌రుగుల‌కే 5 వికెట్లు డౌన్‌

IND VS SA 2nd Test: పీక‌ల్లోతు క‌ష్టాల్లో టీమిండియా..100 ప‌రుగుల‌కే 5 వికెట్లు డౌన్‌
Advertisement

IND VS SA 2nd Test:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd Test) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా పీకల్లోతూ కష్టాల్లో పడింది. తప్పక గెలవాల్సిన ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమవుతున్నారు. మన బౌలర్లు సరిగ్గా వికెట్లు తీయకపోగా ఇప్పుడు బ్యాటర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. 100 పరుగుల లోపే ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయింది టీమిండియా. మొదటి ఇన్నింగ్స్ లో ఇప్పటి వరకు 38 ఓవర్లు ఆడిన టీమిండియా, ఐదు వికెట్ల నష్టానికి 106 పరుగులు సాధించింది. ప్రస్తుతం నితీష్ కుమార్ రెడ్డి అలాగే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read: T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

టీమిండియాను ఆదుకున్న యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal)

Advertisement

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లందరూ విఫలమైనప్పటికీ యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal) మాత్రం జట్టును ఆదుకున్నాడు. 97 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు బౌండరీలతో పాటు ఒక సిక్సర్ ఉంది. గడిచిన ఆరు ఇన్నింగ్స్ లలో పెద్దగా రాణించని యశస్వి జైస్వాల్ ఇందులో మాత్రం దుమ్ము లేపాడు. అటు కేఎల్ రాహుల్ 63 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. టీమిండియా కెప్టెన్ శుభ్ మాన్‌ గిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సాయి సుదర్శన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 40 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే సాధించి హర్మర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అటు టీమిండియా కొత్త కెప్టెన్ రిషబ్ పంత్  ( Rishabh Pant) 7 పరుగులకే వెనుదిరిగాడు. దృవ్ జురేల్ డకౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా టాప్ ఆర్డ‌ర్‌ మొత్తం కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ రెండు వికెట్లు తీయగా హర్మర్ రెండు వికెట్లు పడగొట్టాడు.

కేశవ్ మహారాజ్ ( Keshav Maharaj) ఒక వికెట్ తీశాడు. అటు మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా అద్భుతంగా రాణించింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు పెద్దగా రాణించకపోవడంతో 151 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా 489 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దక్షిణాఫ్రికాకు చెందిన ముత్తుస్వామి సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మార్కో జాన్సన్ 9వ వికెట్ కు బ్యాటింగ్ చేసి 93 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోతే మాత్రం దారుణ ప‌రిస్థితులు చోటు చేసుకుంటాయి. ఇందులో ఓడినా, మ్యాచ్ డ్రా చేసుకున్నా, టెస్ట్ సిరీస్ మాత్రం దక్షిణాఫ్రికా సొంతం చేసుకోనుంది. రెండో టెస్ట్ డ్రా అయితే, 1-0 తేడాతో స‌ఫారీలు సిరీస్ ఎగురేసుకుపోనుంది.  ఇలాంటి నేప‌థ్యంలో ఈ రెండో మ్యాచ్ లో టీమిండియా క‌చ్చితంగా గెలవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

Advertisement

Also Read: Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×