E-Paper
Advertisement

Rangareddy News: రంగారెడ్డి జిల్లాలో సర్టిఫికెట్ల అమ్మకాలు.. 50 వేలకు పదో తరగతి, 75 వేలకు ఇంటర్

Rangareddy News: రంగారెడ్డి జిల్లాలో సర్టిఫికెట్ల అమ్మకాలు..  50 వేలకు పదో తరగతి,  75 వేలకు ఇంటర్
Advertisement

Rangareddy News: రండి బాబు.. రండి.. యువతీ యువకులకు సువర్ణ అవకాశం. మీకు పదో తరగతి మొదలు బీటెక్ వరకు సర్టిఫికెట్లు కావాలా? చదవాల్సిన అవసరం లేదు. కనీసం పరీక్షలు కూడా రాయాల్సినవరం లేదు. డబ్బులిస్తే చాలు సర్టిఫికెట్లు మీ సొంతం. ఇదీ రంగారెడ్డి జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు అమ్మకాలు. ఈ  రాకెట్‌ను గుట్టురట్టు చేశారు పోలీసులు. మొత్తం ఐదుగుర్ని అరెస్టు చేశారు.

జోరుగా నకిలీ సర్టిఫికెట్ల అమ్మకాలు

Advertisement

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టుని రట్టు చేశారు సైబరాబాద్ SOT పోలీసులు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆపై బీటెక్ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న గ్యాంగ్‌ని అరెస్ట్ చేసింది. పలు యూనివర్శిటీల పేర్లతో తయారు చేసిన ఫేక్ సర్టిఫికెట్ల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ లకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు, మెమోలు తయారు చేస్తున్న గ్యాంగ్‌ని పక్కాగా స్కెచ్ వేసి అరెస్టు చేసింది. ఈ రాకెట్‌కి మూల సూత్రధారి మీర్జా అక్తర్ అలీ బేగంని గుర్తించారు. తయారీ, ప్రింటింగ్, అమ్మకాలు సాగించడంలో కీలక నిందితుడు. ప్రజలకు- నకిలీ సర్టిఫికెట్లు గ్యాంగ్‌‌కి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు మహమ్మద్ అహ్మద్.

Advertisement

50 వేలకు పదో తరగతి.. 75 వేలకు ఇంటర్ సర్టిఫికెట్లు

వీరితోపాటు మరో ముగ్గుర్ని అరెస్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేయడానికి వచ్చినవారు అందులో ఉన్నారు. వారిలో వెంటకసాయి, రోహిత్, ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. వారి ఉద్యోగం రీత్యా నకిలీ సర్టిఫికెట్లు తీసుకోవడానికి వచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఈ గ్యాంగ్ కేవలం తెలంగాణలోని యూనివర్సిటీల నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల యూనివర్సిటీలకు సంబంధించి ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

ఎంక్వైరీ చేయరన్న కారణంతో మిగతా రాష్ట్రాల యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటివరకు ఎంతమందికి ఈ సర్టిఫికెట్లు విక్రయించారు? వాటిని కొనుగోలు చేసినవారు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు? ఏయే కంపెనీల్లో చేస్తున్నారు? పాస్‌పోర్టు లేదా వీసాల కోసం అప్లై చేశారా? వీటికి ఎక్కడెక్కడ ఉపయోగించుకున్నారు? అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.

ALSO READ: రైతుపై దాడి కేసులో అధికారి సస్పెండ్.. బిగ్ టీవీ ఎఫెక్ట్

నకిలీ సర్టిఫికెట్లను గుర్తించేందుకు కేంద్రం డిజిలాకర్‌ వ్యవస్థ‌ని తీసుకొచ్చింది. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో  సులభతరంగా వెరిఫికేషన్‌ చేయవచ్చు. సర్టిఫికెట్లకు కోడ్ తరహాలో వ్యవస్థని తీసుకొచ్చింది. ఇక మెమోలు అయితే డిజిలాటర్ నుంచి తీసుకునే సదుపాయం తీసుకొచ్చింది. దీనివల్ల ఏవి నకిలీ సర్టిఫికెట్లు.. ఏవి ఒరిజినల్ అనేది సులభంగా గుర్తించవచ్చు.

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×