E-Paper
Advertisement

Nokia V2 Ultra Pro Max 5G: 200ఎంపి కెమెరాతో నోకియా వి2 అల్ట్రా ప్రో మాక్స్ 5జి.. డిజైన్ నుంచి బ్యాటరీ వరకు అప్‌డేట్

Nokia V2 Ultra Pro Max 5G: 200ఎంపి కెమెరాతో నోకియా వి2 అల్ట్రా ప్రో మాక్స్ 5జి.. డిజైన్ నుంచి బ్యాటరీ వరకు అప్‌డేట్
Advertisement

Nokia V2 Ultra Pro Max 5G: నోకియా పేరు వినగానే ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించిన దృఢమైన ఫోన్ గుర్తుకు వస్తుంది. కాలం మారినా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం తగ్గలేదు, ఇప్పుడు న్యూ టెక్నాలజీతో మళ్లీ మార్కెట్‌లో తన స్థానం సంపాదించుకోవాలని నోకియా ప్రయత్నిస్తుంది. ఇదే నేపథ్యంలో నోకియా వి2 అల్ట్రా ప్రో మాక్స్ 5జి మార్కెట్‌లోకి రానుంది. అప్‌డేటెడ్ లుక్, స్ట్రాంగ్ క్వాలిటీతో పాటు మోడ్రన్ టెక్నాలజీని కలిపి ప్రీమియం సెగ్మెంట్‌తో పోటీకి దిగేందుకు సిద్దమతున్నట్టు కనిపిస్తోంది. మరి దీని ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.

6.9 అంగుళాల 4కె అమోలెడ్ స్ర్కీన్‌

Advertisement

డిస్‌ప్లే విషయానికి వస్తే, 6.9 అంగుళాల 4కె అమోలెడ్ స్ర్కీన్‌తో తగినంత స్పష్టత కలిగిన 144Hz రిఫ్రెష్ రేటు, హెచ్‌డిఆర్ 10 ప్లస్ మద్దతు ద్వారా ప్రతి కదలిక తేలికగా, ప్రతి రంగు స్పష్టంగా కనిపించేలా సిద్ధమవుతుందన్నట్లు సమాచారం ఉంది. స్మూత్ బార్డర్లు, మధ్యలో ఉన్న పంచ్‌హోల్ ముందు కెమెరా, గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ ఈ పరికరానికి గట్టి బలం ఇస్తాయి. మెటాలిక్ ఫ్రేమ్‌తో కూడిన మ్యాట్ గ్లాస్ వెనుకభాగం ప్రీమియం స్థాయి నాణ్యతను ఇస్తుందని చెప్పబడుతోంది. తక్కువ ధర ఉత్పత్తి అనిపించే ఏ వివరాన్నీ లేకుండా పూర్తిగా ఉన్నత శ్రేణి ఫోన్ ఆకృతి ఇస్తుందని అంచనా.

స్మూత్ ఫెర్‌ఫార్మెన్స్

Advertisement

ఫెర్‌ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జోన్ 4 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ అత్యంత వేగంతో పనిచేసే అవకాశం ఉంది. అధిక శక్తి కలిగిన ర్యామ్ ఎంపికలు, పెద్ద స్టోరేజ్ సామర్థ్యం, గేమింగ్ సమయంలో వచ్చే వేడి తగ్గించే ప్రత్యేక కూలింగ్ వ్యవస్థ కారణంగా ఈ పరికరం భారమైన పనుల్ని కూడా సునాయాసంగా నిర్వహించగలదని భావిస్తున్నారు. దీర్ఘకాల వినియోగంలో కూడా పనితీరు తగ్గకుండా ఉండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

Also Read: Smartwatches At Rs 999: రూ.12వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ.999లకే.. అమెజాన్ స్పెషల్ ఆఫర్ వివరాలు

200ఎంపి క్వాడ్ కెమెరా

ప్రదాన ఆకర్షణ కెమెరా. 200ఎంపి ప్రధాన సెన్సార్‌తో కూడిన క్వాడ్ కెమెరా సిస్టమ్, 64ఎంపి విస్తృత దృశ్య లెన్స్, 50ఎంపి టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్ 10ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో, అలాగే డెప్త్ సెన్సార్ కలిపి మెరుగైన విజువల్ కవరేజ్ కోసం అవసరమైన సమాచారాన్ని అందించే సామర్థ్యం. ముందుభాగంలో 64ఎంపి కెమెరా ఉండటం వల్ల క్లియర్ సెల్ఫీ ఇమేజస్, క్లారిటీ వీడియో కాల్స్ సాధ్యం అవుతాయి. ఆధునిక ఏఐ ఫోటోగ్రఫీతో పాటు 8K వీడియో సామర్థ్యాలు కంటెంట్ రూపొందించే వారికి మరింత విస్తృత అవకాశాలను అందిస్తున్నాయని తెలుస్తోంది.

7,000mAh బ్యాటరీ సామర్థ్యం

ఈ ఫోన్ లో ప్రధాన ఆకర్షణలో నిలుస్తుంది భారీ బ్యాటరీ. 7,000mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రధాన ప్రత్యేకతగా చెప్పొచ్చు. 120W వేగవంతమైన వైర్ చార్జింగ్, 60W వైర్‌లెస్ చార్జింగ్ మద్దతు ద్వారా ఎక్కువ సమయం వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ ద్వారా ఇతర డివైస్‌లను కూడా చార్జ్ చేయవచ్చు. సుదీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ కారణంగా తరచూ ప్రయాణించే వినియోగదారులకు ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా బెనిఫిట్‌గా నిలుస్తుంది.

స్పీడ్ కనెక్టివిటీ

కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 15 క్లీన్ ఇంటర్‌ఫేస్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్‌లో సెక్యూరిటి సిస్టమ్ స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. అనేక గాడ్జెట్లతో కలుపుకునే సామర్థ్యం తో పాటు నిరంతర సాఫ్ట్‌వేర్ మెరుగుదలలు ఈ మోడల్‌కు దీర్ఘకాలిక విలువను పెంచుతున్నాయని సమాచారం. శాటిలైట్ కనెక్టివిటీ సహా 5జి ప్లస్, వైఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్ఎఫ్‌సి, యూఎస్‌బి టైప్-సి 4.0 వంటి ఆధునిక కనెక్టివిటీ ఎంపికలు కూడా ఉండే అవకాశం ఉంది. స్ర్కీన్‌లోనే ఉన్న ఫింగర్ ప్రింట్ గుర్తింపు, డాల్బీ ఆట్మోస్ సౌండ్, ఐపి68 నీటి దుమ్ము రెసిస్టన్స్, గేమింగ్‌కి అనువైన హాప్టిక్ రెస్పాన్స్ వంటి అంశాలు దీన్ని పూర్తి స్థాయి ఫ్లాగ్‌షిప్ పరికరంగా నిలబెడతాయి.

ఇండియాలో ధర ఎంతంటే?

భారతదేశంలో ఈ ఫోన్ ధర రూ.95,000 నుంచి రూ.1,10,000 మధ్య ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. నోకియా ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తే ప్రీమియం ఫోన్ విభాగంలో తిరిగి బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కెమెరా శక్తి, భారీ బ్యాటరీ, అత్యంత వేగవంతమైన ప్రాసెసర్, అప్‌డేటెడ్ లుక్ కలిసినపుడు వినియోగదారుల ఆసక్తిని గట్టిగా ఆకర్షించే అవకాశం ఉంది.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×