E-Paper
Advertisement

WTC 2025-2027: పీక‌ల్లోతూ క‌ష్టాల్లో టీమిండియా.. ప్రతి టెస్టు గెలిస్తేనే, WTC ఛాన్స్‌..పాయింట్ల పట్టిక ఇదే

WTC 2025-2027: పీక‌ల్లోతూ క‌ష్టాల్లో టీమిండియా.. ప్రతి టెస్టు గెలిస్తేనే, WTC ఛాన్స్‌..పాయింట్ల పట్టిక ఇదే
Advertisement

WTC 2025-2027 : WTC 2025-27 సీజ‌న్ లో భార‌త్ మొత్తం 8 మ్యాచ్ లు ఆడింది. వాటిలో నాలుగు మ్యాచ్ ల్లోనే విజ‌యం సాధించింది. విజ‌యాల శాతం 54.17 గా ఉంది. వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ ఫైన‌ల్ కి అర్హ‌త సాధించాలంటే 64-68 శాతం ఉండాలి. టీమిండియా మ‌రో 10 మ్యాచ్ లు సౌతాఫ్రికాతో 1, శ్రీలంక‌తో 2, న్యూజిలాండ్ తో 2, ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉండ‌గా.. ప్ర‌తీ టెస్టు కూడా చాలా కీల‌క‌మే అని చెప్ప‌వచ్చు. వీట‌న్నింటిలో గెలిస్తే.. టీమిండియా 79.63 శాతం, 9 గెలిస్తే.. 74.07, 8 గెలిస్తే..68.52, 7 గెలిస్తే.. 62.96 శాతం సొంతం చేసుకుంటుంది. దీనిని బ‌ట్టి క‌నీసం 8 గెలిస్తేనే వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ పై ఆశ‌లు సజీవంగా ఉంటాయి. టీమిండియా మిగ‌తా మ్యాచ్ ల్లో కీల‌కంగా ఆడ‌టం చాలా ముఖ్యం అనే చెప్పాలి.

Also Read : IPL 2026 : SRH కెప్టెన్‌ మార్పుపై కావ్య పాప సంచలన ప్రకటన.. వచ్చే సీజన్ కు వస్తున్నాడు

క‌ష్టాల్లో టీమిండియా..!

Advertisement

భార‌త్-సౌతాఫ్రికా మ‌ధ్య జ‌రిగిన‌ తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. దీంతో వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ పాయింట్ల ప‌ట్టిక‌లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఓట‌మితో టీమిండియా డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో మూడోస్థానం నుంచి నాలుగో స్థానానికి ప‌డిపోయింది. భార‌త్ పాయింట్ల శాతం 54.17 గా ఉంది. ప్ర‌స్తుతం డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ 8 మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ ల్లో విజ‌యం సాధించి మూడు మ్యాచ్ ల్లో ఓట‌మి పాలైంది. మ‌రోవైపు సౌతాఫ్రికా ఈ విజ‌యంతో 66.7 శాతం తో రెండో స్థానానికి ఎగ‌బాకింది. పీసీటీ ప‌రంగా సౌతాఫ్రికా, శ్రీలంక జ‌ట్లు స‌మంగా ఉన్నాయి. పాయింట్ల ప‌రంగా మాత్రం శ్రీలంక 16 కంటే సౌతాఫ్రికా 24 పాయింట్ల‌తో ముందంజ‌లో ఉంది. ప్ర‌స్తుతం శ్రీలంక మూడో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక ఆస్ట్రేలియా జ‌ట్టు 100 పాయింట్లో అగ్ర‌స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్ ల్లో విజ‌యం సాధించింది. సౌతాఫ్రికా ఆడిన 3 మ్యాచ్ ల్లో 2 విజ‌యాలు, ఒక్క ఓట‌మిని చ‌విచూసింది.

ప్రతి టెస్టు గెలిస్తేనే..!

ఇక నుంచి ఆడే ప్ర‌తీ మ్యాచ్ లో టీమిండియా విజ‌యం సాధించిన‌ట్ట‌యితే పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో కొన‌సాగి WTC ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్తోంది. ఒక‌వేళ అలా కాకుండా టీమిండియా ఓట‌మి పాలైతే మాత్రం ఫైన‌ల్ కి చేరుకోకుండానే ఇంటి బాట ప‌ట్ట‌నుంది. ఇప్ప‌టికే టీమిండియాలో ప‌లు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సౌతాఫ్రికాతో జ‌రిగిన తొలి మ్యాచ్ లో కెప్టెన్ శుబ్ మ‌న్ గిల్ కి గాయం కావడంతో టీమిండియా ఓట‌మిపాలైంది. గిల్ లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపించింది. ముందు ముందు జ‌రుగ‌బోయే మ్యాచ్ ల‌కు కూడా శుబ్ మ‌న్ గిల్ త‌ప్ప‌క ఆడాల‌ని అభిమానులు పేర్కొంటున్నారు. గిల్ ఆడ‌టంతో జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు తీసుకెళ్ల‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంటాడ‌ని అభిమానులు పేర్కొంటున్నారు. మ‌రోవైపు గంభీర్ పై కూడా సోష‌ల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేయ‌డం గ‌మనార్హం. టీమిండియా వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ కి వెళ్తుందో లేదో వేచి చూడాలి మ‌రీ.

Advertisement

Also Read : IPL 2026 Auction : చాణుక్యుడి కంటే మేధావి.. పక్క జట్ల పర్సు మొత్తం ఖాళీ చేస్తాడు, ఇంతకీ ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×