E-Paper
Advertisement

BLDC vs Normal Fans: రెండూ సీలింగ్ ఫ్యాన్లే.. కానీ టెక్నాలజీలో ఎంత తేడానో.. కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

BLDC vs Normal Fans: రెండూ సీలింగ్ ఫ్యాన్లే.. కానీ టెక్నాలజీలో ఎంత తేడానో.. కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Advertisement

BLDC vs Normal Fans: ప్రస్తుతం మార్కెట్లో ప్రతీది స్మార్ట్ గా మారిపోతున్నాయి. కూలర్, ఏసీ, ఫ్రిడ్జ్ ఎలా ప్రతీది అధునాతన స్మార్ట్ ఫీచర్లతో ఆకట్టుకున్నాయి. అటు సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్లకు ప్రత్యామ్నాయంగా అత్యాధునిక బీఎల్‌డీసీ (BLDC) ఫ్యాన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే నార్మల్ ఫ్యాన్లతో పోలిస్తే బీఎల్ డీసీ మోడల్స్ కాస్త ఖరీదైనవిగా ఉన్నాయి. దీంతో రెండింటికి మధ్య తేడా తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నార్మల్ vs BLDC ఫ్యాన్ల మధ్య ప్రధాన తేడా ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

మోటారు, పనితీరు పరంగా..

సాధారణ సీలింగ్ ఫ్యాన్లు ‘ఇండక్షన్ మోటార్’తో పనిచేస్తాయి. ఇది వర్క్ చేయడం కోసం కాపర్ వైండింగ్‌పై ఆధారపడతాయి. దీని వల్ల రాపిడి ఎక్కువ జరిగి మోటార్ త్వరగా వేడెక్కుతుంది. అంతేకాకుండా కొంత విద్యుత్ కూడా వేడెక్కె ఛాన్స్ ఉంది. మరోవైపు BLDC ఫ్యాన్లు.. పర్మినెంట్ మ్యాగ్నెట్స్ (Permanent Magnets), ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌ ఆధారంగా వర్క్ చేస్తాయి. ఇందులో బ్రష్ లు లేకపోవడం వల్ల మోటార్ అస్సలు వేడెక్కదు. ఫలితంగా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

విద్యుత్ ఆదా

Advertisement

విద్యుత్ ను వినియోగించే విషయంలో సాధారణ, బీఎల్ డీసీ ఫ్యాన్ల మధ్య స్పష్టమైన తేడా ఉంది. సాధారణ ఫ్యాన్ పూర్తి వేగంతో తిరిగడానికి 75-80 వాట్ల విద్యుత్‌ ఖర్చు చేస్తే.. BLDC ఫ్యాన్ అదే వేగానికి కేవలం 28-35 వాట్లను మాత్రమే ఉపయోగిస్తుంది. అంటే సాధారణ ఫ్యాన్ వాడే విద్యుత్తులో సగం కంటే తక్కువతో ఇది పనిచేస్తుంది.

సౌండ్, వోల్టేజ్ పరంగా..

సాధారణ ఫ్యాన్లు తిరుగుతున్నప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది. ఫ్యాన్ పాతబడే కొద్ది ఇది మరింత పెరుగుతుంటుంది. అయితే BLDC ఫ్యాన్లు అలా కాకుండా చాలా నిశ్శబ్దంగా పనిచేస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు సాధారణ ఫ్యాన్ స్లో అయ్యే ఛాన్స్ ఉంది. కానీ BLDC మోడల్స్ మాత్రం తక్కువ వోల్టేజీలోనూ స్థిరమైన వేగంతో తిరుగుతాయి.

రిమోట్ కంట్రోల్

Advertisement

సాధారణ ఫ్యాన్లను నియంత్రించాలంటే.. గోడకు ఉండే రెగ్యులేటర్ తప్పనిసరి. కానీ BLDC ఫ్యాన్లకు అది అవసరం లేదు. ఇవి రిమోట్ కంట్రోల్‌ తో వస్తాయి కాబట్టి కూర్చున్న చోటు నుంచే ఆపరేట్ చేయవచ్చు. అంతేకాకుండా రిమోట్ లో స్లీప్ మోడ్, టైమర్ ను పెట్టి.. ఫ్యాన్ ఏ సమయానికి ఆగిపోవాలో కూడా ముందే సెట్ చేయవచ్చు. కొన్ని అడ్వాన్స్డ్ BLDC ఫ్యాన్లు అయితే స్మార్ట్ ఫోన్ యాప్స్, వాయిస్ అసిస్టెంట్ సపోర్టుతో కూడా వస్తున్నాయి.

Also Read: హైయర్ కంపెనీకి చెందిన.. టాప్-5 బాటమ్ మౌంట్ ఫ్రిడ్జ్‌లు.. వీటి ఫీచర్లు చూస్తే ఫిదానే!

బడ్జెట్ పరంగా చూస్తే..

ధర విషయానికి వస్తే బీఎల్ డీసీ ఫ్యాన్లు సాధారణ ఫ్యాన్ల కంటే రూ.1,500 – 2,500 ఎక్కువ ధర కలిగి ఉంటాయి. ప్రారంభంలో ఇది ఎక్కువ ఖర్చుగా అనిపించినప్పటికీ.. విద్యుత్ బిల్లుల ద్వారా కేవలం 18 నుండి 24 నెలల్లోనే ఆ అదనపు ఖర్చును తిరిగి పొందేయచ్చు. కాబట్టి ఎక్కువ రోజులు మన్నిక, భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా BLDC ఫ్యాన్లు బెస్ట్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: వారెవ్వా.. ఇది కదా సక్సెస్ అంటే.. కొడుకుతో కలిసి టెన్త్ పాసైన అమ్మ!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×