E-Paper
Advertisement

వారెవ్వా.. ఇది కదా సక్సెస్ అంటే.. కొడుకుతో కలిసి టెన్త్ పాసైన అమ్మ!

వారెవ్వా.. ఇది కదా సక్సెస్ అంటే.. కొడుకుతో కలిసి టెన్త్ పాసైన అమ్మ!
Advertisement

West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఓ తల్లి, తన పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఆరో తరగతిలోనే చదువుకు దూరమైనా, చదువుకోవాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకోవడమే కాకుండా, కొడుకుతో కలిసి పదో తరగతి పరీక్షల్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

బండారు లక్ష్మీలహరి అనే మహిళ, కొన్ని అనివార్య కారణాల వల్ల చిన్నప్పుడే చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ చదువుపై ఉన్న మక్కువ ఆమెను ఊరికే ఉండనివ్వలేదు. తన కుమారుడు విజయ్ పదో తరగతికి రావడంతో, తానూ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నారు. కొడుకు రెగ్యులర్ స్కూల్‌లో చదువుతుంటే, తల్లి ఓపెన్ స్కూల్ ద్వారా పుస్తకాలు పట్టింది. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటూనే, కొడుకుతో పోటీపడుతూ రాత్రింబవళ్లు శ్రమించారు.

Advertisement

పరీక్షా ఫలితాలు వెలువడటంతో ఆ ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. కొడుకు విజయ్ 600 మార్కులకు గాను 562 సాధించి తన సత్తా చాటగా, తల్లి లక్ష్మీలహరి 500 మార్కులకు గాను 360 సాధించి సగర్వంగా పాసయ్యారు. ‘చదువుకోవడానికి వయసుతో పనిలేదని మా అమ్మ నిరూపించింది’ అని కొడుకు మురిసిపోతుంటే, ఇన్నేళ్ల తర్వాత విజయం సాధించినందుకు తల్లి ఆనందానికి అవధుల్లేవు. పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని చాటిన ఈ తల్లిపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.

Also Read: మొదట ఒక్కరితో.. ఆపై ముగ్గురితో.. భార్య సీక్రెట్ వీడియోలు చూసి తట్టుకోలేకపోయిన భర్త!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×