E-Paper
Advertisement

ఈ 8 రకాల బట్టలను చన్నీళ్లతో ఉతికితే రోగాలొస్తాయట.. తస్మాత్ జాగ్రత్త!

ఈ 8 రకాల బట్టలను చన్నీళ్లతో ఉతికితే రోగాలొస్తాయట.. తస్మాత్ జాగ్రత్త!
Advertisement

Laundry Hacks: సాధారణంగా బట్టలు పాడవకుండా ఉండాలని లేదా కరెంటు ఆదా అవుతుందని చాలామంది చన్నీళ్లతోనే వాషింగ్ మెషీన్ రన్ చేస్తుంటారు. రంగులు వెలవకుండా ఉండటానికి ఇది మంచి పద్ధతే అయినప్పటికీ.. కొన్ని రకాల బట్టలను మాత్రం చన్నీళ్లతో ఉతికితే అవి పైకి శుభ్రంగా కనిపించినా లోపల మాత్రం ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో నిండి ఉంటాయి. ముఖ్యంగా ఈ 8 రకాల బట్టల విషయంలో వేడి నీటిని వాడటం చాలా ముఖ్యం.

1. బెడ్ షీట్లు, దుప్పట్లు:

మనం రోజులో దాదాపు 8 గంటల సమయం పడకపైనే గడుపుతాం. ఈ సమయంలో మన శరీరం నుండి వెలువడే చెమట, చర్మ కణాలు, కంటికి కనిపించని నలుసు దుమ్ము దుప్పట్లలో పేరుకుపోతాయి. చన్నీళ్లతో ఉతికితే ఇవి తొలగిపోవు. కనీసం 60 డిగ్రీల వేడి నీటిలో ఉతికితేనే అందులోని క్రిములు చనిపోయి, దుప్పట్లు అలర్జీలు కలిగించకుండా ఉంటాయి.

2. స్నానానికి వాడే టవల్స్:

Advertisement

టవల్స్ ఎప్పుడూ తడిగా ఉండటం వల్ల వాటిలో బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. చాలారోజుల పాటు చన్నీళ్లతోనే వీటిని ఉతికితే, టవల్స్ నుండి ఒక రకమైన మురికి వాసన రావడం మొదలవుతుంది. వేడి నీటితో ఉతికినప్పుడు మాత్రమే ఆ పీచులో ఇరుక్కున్న మురికి, వాసన వదిలిపోయి టవల్స్ తాజాగా మారుతాయి.

3. వంటగదిలో వాడే గుడ్డలు:

వంటగదిలో వాడే మసి గుడ్డలు లేదంటే గిన్నెలు తుడిచే బట్టలపై జిడ్డు, ఆహార పదార్థాలు, పచ్చి మాంసం తాలూకు బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. వీటిని చన్నీళ్లతో ఉతికితే ఆ క్రిములు చావకపోగా ఇతర బట్టలకు కూడా వ్యాపిస్తాయి. కాబట్టి.. వీటిని ఖచ్చితంగా వేడి నీటితోనే శుభ్రం చేయాలి.

4. జిమ్ దుస్తులు:

Advertisement

వ్యాయామ బట్టలు సాధారణంగా సింథటిక్ మెటీరియల్‌తో తయారవుతాయి. ఇవి చెమటను త్వరగా పీల్చుకున్నప్పటికీ, శరీరంలోని నూనెలను, వాసనను లోపలే పట్టి ఉంచుతాయి. చన్నీళ్లు ఆ జిడ్డును వదిలించలేవు. వేడి నీటిలో ఉతికినప్పుడే ఆ పోగులు విచ్చుకుని లోపల ఉన్న చెమట వాసనను బయటకు పంపిస్తాయి.

Also Read: పార్టీ మోడ్ ఆన్.. తక్కువ బడ్జెట్‌లో టాప్-7 పార్టీ స్పీకర్లు, ఈ క్రేజీ ఫీచర్లపై మీరూ ఓ లుక్కేయండి!

5. చిన్న పిల్లల బట్టలు:

చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా డైపర్లు లేదంటే పసిపిల్లల బట్టలపై ఉండే మలమూత్ర విసర్జితాల నుండి బ్యాక్టీరియా, వైరస్‌లు వ్యాపించే ప్రమాదం ఉంది. వీటిని కేవలం వేడి నీటితో ఉతికినప్పుడు మాత్రమే సంపూర్ణంగా క్రిమిరహితం అవుతాయి. దీనివల్ల పిల్లలకు ఇన్ఫెక్షన్లు వంటివి రావు.

6. తెల్లటి కాటన్ బట్టలు:

తెల్లటి టీ షర్టులు, సాక్సులు కాలక్రమేణా పసుపు రంగులోకి లేదా మురికిగా మారుతుంటాయి. దీనికి కారణం శరీరంలోని నూనెలు బట్టలకు పట్టడమే. చన్నీళ్లు ఈ జిడ్డును వదిలించలేవు. వేడి నీటిలో డిటర్జెంట్ బాగా పనిచేస్తుంది. దీనివల్ల తెల్లటి బట్టలు ఎక్కువ కాలం మెరుస్తూ కనిపిస్తాయి.

7. ఇల్లు తుడిచే గుడ్డలు:

మనం ఇల్లు శుభ్రం చేయడానికి వాడే గుడ్డలు రసాయనాలతో, విపరీతమైన మురికితో నిండి ఉంటాయి. చన్నీళ్లకు ఆ మొండి మురికిని వదిలించే శక్తి ఉండదు. మళ్లీ ఇల్లు తుడిచేటప్పుడు మురికి అంటకుండా ఉండాలంటే ఆ గుడ్డలను అధిక ఉష్ణోగ్రత ఉన్న నీటిలో ఉతకడం అవసరం.

8. జబ్బు పడినప్పుడు వాడే బట్టలు:

ఇంట్లో ఎవరికైనా జలుబు, దగ్గు లేదా జ్వరం వచ్చినప్పుడు వారు వాడిన కర్చీఫ్లు, దుస్తులను వేడి నీటిలోనే ఉతకాలి. చన్నీళ్లు వైరస్‌లను చంపలేవు సరే కదా, మెషీన్‌లో ఉన్న ఇతర బట్టలకు కూడా ఆ వైరస్‌ను అంటిస్తాయి. అందుకే అనారోగ్య సమయాల్లో వాడిన బట్టలను వేడి నీటితో శుద్ధి చేయడం ప్రాథమిక సూత్రం.

Also Read: ఆండ్రాయిడ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ మోడల్ ఫోన్ల‌లో ఇక వాట్సప్ పనిచేయదు, డేటాను ఇలా సేవ్ చేసుకోండి!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×